Ganga Pushkaralu 2023: తెలంగాణ, ఏపీ నుంచి గంగా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు... పూర్తి వివరాలివే
South Central Railway Special Trains: గంగా పుష్కరాల కోసం వెళ్లే ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. తెలంగాణ, ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు తేదీలతో పాటు టైమింగ్స్ వివరాలను పేర్కొంది.
Special Trains for Ganga Pushkaralu 2023: ఈ ఏడాది గంగా పుష్కరాల కోసం వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిమ మధ్య రైల్వే. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్, గుంటూరు నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ మేరకు తేదీలు, టైమింగ్స్ వివరాలను పేర్కొన్నారు.
సికింద్రాబాద్ -రాక్సల్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఏప్రిల్ 23,30 తేదీలతో పాటు మే 07 తేదీన ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.30 గంటలకు బయల్దేరి.... మంగళవారం ఉదయం 06 గంటలకు చేరుతుంది. ఇక రాక్సల్ నుంచి సికింద్రాబాద్ నుంచి కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఏప్రిల్ 25, మే 2,9 తేదీల్లో ఈ సర్వీసులు నడుస్తాయి. రాక్సల్ నుంచి రాత్రి 07.15 గంటలకు బయల్దేరి... రెండో రోజు మధ్యాహ్నం 02.30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
తిరుపతి నుంచి ధన్ పూర్, ధనపూర్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఏప్రిల్ 22, 24,29, మే 01,6, 8 తేదీల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఉదయం 07.15 గంటలకు బయల్దేరి.. మరునాడు రాత్రి 11.15 గంటలకు ధన్ పూర్ చేరుతుంది. ఇక ధన్ పూర్ నుంచి వెళ్లే ప్రత్యేక రైళ్లు... మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి రెండో రోజు ఉదయం 07.45 నిమిషాలకు తిరుపతి చేరుతుంది. ఇక గుంటూరు -బనారస్, బనారస్ - గుంటూరు మధ్య కూడా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఏప్రిల్ 22,24,29, మే 1, 6, 08 తేదీల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
వేసవి ప్రత్యేక రైళ్లు….
వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 44 వేసవి ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. నాందేడ్- ఈరోడ్, సంబల్పూర్-కోయంబత్తూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతారు.ట్రైన్ నంబర్ 07189/07190 నాందేడ్-ఈరోడ్-నాందేడ్ స్పెషల్ ట్రైన్‌ను ఏప్రిల్ 21 నుంచి జూన్ 30 వరకు నడుపుతారు. నాందేడ్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.20కు బయల్దేరే రైలు శనివారం మధ్యాహ్నం రెండుగంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 07190 స్పెషల్ ట్రైన్ ఈరోడ్‌లో ఆదివారం ఉదయం 5.15కు బయల్దేరి సోమవారం ఉదయం 7.30కు నాందేడ్ చేరుతుంది. ఈరోడ్- నాందేడ్ ఈ రైలు ఏప్రిల్ 23 నుంచి జులై 2వరకు నడుపన్నారు.
నాందేడ్-ఈరోడ్-నాందేడ్ రైలు ముద్ఖేడ్, ధర్మాబాద్, బాసర,నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్, సేలం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుుంది ట్రైన్ నంబర్ 08311 సంబల్పూర్-కోయంబత్తూరు ప్రత్యేక రైలు ప్రతి బుధవారం ఉదయం 10.55కు బయల్దేరి గురువారం రాత్రి 9.40కు కోయంబత్తూరు చేరుతుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 28వరకు ఈ స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 08312గా కోయంబత్తూరులో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12కు బయల్దేరి శనివారం రాత్రి 9.15కు సంబల్పూర్ చేరుతుంది. ఏప్రిల్ 21 నుంచి జూన్ 30వరకు ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది.
సంబల్పూర్-కోయంబత్తూరు- సంబల్పూర్ రైలు బార్గార్ రోడ్, బాలాంగిర్, తిట్లఘర్, కేసింగా, మునిగూడ, రాయగూడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్త వలస, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం జంక్షన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల,ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూరు, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్, థర్డ్ ఏసి, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.
సంబంధిత కథనం