summer Special trains: నాందేడ్- ఈరోడ్, సంబల్పూర్‌-కోయంబత్తూరు మధ్య ప్రత్యేక రైళ్లు-south central railway announced 44 special trains in view of summer passenger rush ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Summer Special Trains: నాందేడ్- ఈరోడ్, సంబల్పూర్‌-కోయంబత్తూరు మధ్య ప్రత్యేక రైళ్లు

summer Special trains: నాందేడ్- ఈరోడ్, సంబల్పూర్‌-కోయంబత్తూరు మధ్య ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu
Apr 19, 2023 01:55 PM IST

summer Special trains: వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 44 వేసవి ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. నాందేడ్- ఈరోడ్, సంబల్పూర్‌-కోయంబత్తూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతారు.

వేసవి ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
వేసవి ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

summer Special trains:ట్రైన్ నంబర్ 07189/07190 నాందేడ్-ఈరోడ్-నాందేడ్ స్పెషల్‌ ట్రైన్‌ను ఏప్రిల్ 21 నుంచి జూన్ 30 వరకు నడుపుతారు. నాందేడ్‌ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.20కు బయల్దేరే రైలు శనివారం మధ్యాహ్నం రెండుగంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 07190 స్పెషల్ ట్రైన్ ఈరోడ్‌లో ఆదివారం ఉదయం 5.15కు బయల్దేరి సోమవారం ఉదయం 7.30కు నాందేడ్ చేరుతుంది. ఈరోడ్- నాందేడ్ ఈ రైలు ఏప్రిల్ 23 నుంచి జులై 2వరకు నడుపన్నారు.

నాందేడ్-ఈరోడ్-నాందేడ్ రైలు ముద్ఖేడ్, ధర్మాబాద్‌, బాసర,నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్‌, సేలం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుుంది

ట్రైన్ నంబర్ 08311 సంబల్పూర్-కోయంబత్తూరు ప్రత్యేక రైలు ప్రతి బుధవారం ఉదయం 10.55కు బయల్దేరి గురువారం రాత్రి 9.40కు కోయంబత్తూరు చేరుతుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 28వరకు ఈ స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 08312గా కోయంబత్తూరులో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12కు బయల్దేరి శనివారం రాత్రి 9.15కు సంబల్పూర్ చేరుతుంది. ఏప్రిల్ 21 నుంచి జూన్ 30వరకు ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది.

సంబల్పూర్-కోయంబత్తూరు- సంబల్పూర్ రైలు బార్గార్ రోడ్, బాలాంగిర్‌, తిట్లఘర్‌, కేసింగా, మునిగూడ, రాయగూడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్త వలస, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం జంక్షన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల,ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూరు, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్, థర్డ్ ఏసి, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్‌లు...

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 24 నుంచి ట్రైన్ నంబర్‌ 17211 మచిలీపట్నం యశ్వంతపూర్‌ రైల్లో సెకండ్ ఏసీ 1, ధర్డ్ ఏసీ రెండుకోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

ఏప్రిల్ 25 నుంచి ట్రైన్ నంబర్‌ 17212 యశ్వంతపూర్‌-మచిలీపట్నం రైల్లో సెకండ్ ఏసీ 1, ధర్డ్ ఏసీ రెండుకోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

ఏప్రిల్ 30 నుంచి ట్రైన్ నంబర్‌ 07185 మచిలీపట్నం-సికింద్రాబాద్‌-మచిలీపట్నం రైళ్లలో సెకండ్ ఏసీ 1, ధర్డ్ ఏసీ రెండుకోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

ఏప్రిల్ 24 నుంచి ట్రైన్ నంబర్‌ 17215/17216 మచిలీపట్నం-ధర్మవరం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రెండు ధర్డ్ ఏసీ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

ఏప్రిల్ 28 నుంచి ట్రైన్ నంబర్‌ 07189/07190 నాందేడ్-ఈరోడ్-నాందేడ్ రైళ్లలో ఒక ధర్డ్ ఏసీకో చ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

Whats_app_banner