SCR Miyawaki Method : దక్షిణ మధ్య రైల్వే 'మియావాకి ప్లాంటేషన్'.. ఇంతకీ ఏంటా పద్ధతి?-what is miyawaki method plantation why south central railway follows ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  What Is Miyawaki Method Plantation Why South Central Railway Follows

SCR Miyawaki Method : దక్షిణ మధ్య రైల్వే 'మియావాకి ప్లాంటేషన్'.. ఇంతకీ ఏంటా పద్ధతి?

HT Telugu Desk HT Telugu
Oct 23, 2022 07:34 PM IST

South Central Railway : దక్షిణ మధ్య రైల్వే మియావాకి పద్ధతిలో రైల్వే కాలనీలో మినీ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేస్తుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే ముందుకెళ్తోంది. జోన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మెుక్కలను పెంచేలా ప్లాన్ చేస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

South central Railway Miyawaki Plantation : దక్షిణ మధ్య రైల్వే పెద్ద ఎత్తున మెుక్కలను పెంచుతోంది. మియవాకి పద్ధతి(Miyawaki Method)లో మినీ ఫారెస్టులను అభివృద్ధి చేస్తోంది. సికింద్రాబాద్‌(Secunderabad) నార్త్‌ లాలాగూడలోని శాంతినగర్‌ రైల్వేకాలనీలో 4,300 చదరపు మీటర్ల పరిధిలో మియావాకి ప్లాంటేషన్‌ పూర్తయింది. మరో 1,100 చదరపు మీటర్ల పని పురోగతిలో ఉంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ ప్రాజెక్ట్ 5,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 20,000 మొక్కలతో విస్తరించి ఉంది. సేట్రీస్ ఎన్విరాన్‌మెంటల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దీనిని చేపట్టారు. మియావాకి పద్ధతిలో మెుక్కలను నాటుతున్నారు. మెుక్కల పెంపకంలో మియావాకి ప్లాంటెషన్ విభిన్నమైన పద్ధతి. ఇది ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) కూడా జంట నగరాల్లో మియావాకి పద్ధతిలో ప్లాంటేషన్ ప్లాన్ చేస్తోంది.

మియావాకి అనేది పర్యావరణ ఇంజినీరింగ్ విధానం. మొక్కలు శాస్త్రీయ పద్ధతిలో నాటడం ద్వారా సాధారణ ప్లాంటేషన్ కంటే 20 రెట్లు వేగంగా పెరుగుతాయి. తక్కువ ప్రదేశంలోనే దట్టమైన, విభిన్న జాతుల మొక్కలు ఉంటాయి. రెండు సంవత్సరాల వరకు దట్టమైన అటవీ(Forest)లాగా కనిపిస్తుంటుంది. 100 శాతం మనుగడ అవకాశాలు ఉంటాయి. మొక్కలు పై నుండి మాత్రమే సూర్యరశ్మిని పొందుతాయి. పక్కకి కాకుండా పైకి పెరుగుతాయి.

50-55 రకాల స్థానిక జాతులు (పండ్లు, ఔషధ, పుష్పించే, కలప మొదలైనవి) మియావాకి పద్ధతిలో దక్షిణ మధ్య రైల్వే పెంచుతోంది. గద్వాల్‌, నిజామాబాద్‌(Nizamabad)లో 2,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 8,500 మొక్కలతో మియావాకి ప్లాంటేషన్‌ను కూడా చేపట్టామని ఎస్‌సీఆర్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు.

తక్కువ స్థలంలో ఎక్కువ మెుక్కలను పెంచి అడవిలా తయారు చేయడమే మియావాకి మెథడ్ ప్లాంటేషన్(Miyawaki Method Plantation) అంటారు. జపాన్ శాస్త్రవేత్త అకీరా మియావాకి(Akira Miyawaki) ఈ పద్ధతిని కనిపెట్టాడు. ఈ పద్ధతిలో వేగంగా మెుక్కలు పెరుగుతాయి. పచ్చదనంతో దట్టమైన అరణ్యంలా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా దేశాలకు ఈ పద్ధతి పాకింది. ఇండియాలోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు.

మియావాకి పద్ధతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మెుక్కలు నాటుతారు. మెుక్కలు దగ్గర దగ్గరగా నాటుతారు. సూర్యకాంతి కోసం అవి పోటీపడతాయి. దీంతో నిటారుగా పెరుగుతాయి. సాధారణం కంటే.. ఎక్కువ ఎత్తుకు వెళ్తాయి. మియావాకి పద్ధతిలో కేవలం 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వ్యవధిలో పెద్ద అడవిని సృష్టించొచ్చు.

IPL_Entry_Point