పడకగదిలో వాస్తు దోషాలు.. బెడ్ రూంలో ఈ మెుక్కలు ఉంటే మంచిదంట!
ఇంట్లో ఏదైనా వాస్తు దోషం తలెత్తితే, జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా పడక గదిలో ఉండే వాస్తు దోషాల కారణంగా భార్యాభర్తల మధ్య సఖ్యాత ఉండదని శాస్త్రం వివరిస్తోంది
పడకగది ఉండే వాస్తు దోషాలు వల్ల చాలా వరకు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదని వాస్తు శాస్త్రం చెబుతోంది. కావున పడకగదిలో దోషాలు లేకుండా చూసుకోవడం మంచిది. దోషాలను తొలిగించుకోవడానికి వాస్తు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా పడకగదిలో సముద్రపు ఉప్పు లేదా కర్పూరం స్ఫటికాలతో కూడిన గిన్నెను ఈశాన్య దిశగా ఉంచాలని సూచిస్తున్నారు. సముద్రపు ఉప్పు, కర్పూరం ఏదైనా ప్రతికూల శక్తులు ఉంటే వాటిని నిరోధిస్తాయి. అలాగే వాస్తు దోషాన్ని కూడా తొలగిస్తాయి. ఇక ఈశాన్య ముఖంగా ఉన్న పడకగది గోడలకు తెలుపు లేదా పసుపు రంగు వేయండి. అలాగే లావెండర్ సువాసన ఈశాన్య దిశలో వాస్తు దోషాలను తొలగించడంలో సహాయపడుతుంది. నార్త్-వెస్ట్ బెడ్‌రూమ్ వైపుగా ఉండే దోషాల వల్ల తరచుగా డబ్బు సమస్యతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి సమయంలో వాయువ్య మూలలో చంద్ర యంత్రాన్ని ఉంచడం వల్ల వాస్తు దోషాలను సరిదిద్దివచ్చు.
వాస్తు ప్రకారం బెడ్‌రూమ్‌లో మొక్కలు
మీ పడకగదిలో మెుక్కలు పెంచాలనుకుంటే వాస్తు ప్రకారంగా వాటిని సరైన దిశలో పెట్టండి. దానికి కింది నియమాలను పాటించండి
మనీ ప్లాంట్: ఒత్తిడిని వదిలించుకోవడానికి మనీ ప్లాంట్‌ను పడక గది మూలల్లో ఉంచండి. అయితే, వాటిపై కొంత సూర్యకాంతి పడేలా చూసుకోండి. గాలిని శుద్ధి చేసే శక్తి ఈ మెుక్కకు ఉంటుంది కాబట్టి.. పడక గదిలో ఈ మెుక్కను పెంచుకుంటే మంచిది.
వెదురు మొక్క: వాస్తు శాస్త్రం ప్రకారంగా వెదురు మొక్కలు అదృష్ట మొక్కలలో ఒకటిగా పరిగణించబడతాయి. వీటిని పడకగదిలో ఎక్కడైనా ఉంచవచ్చు. అయితే, ఆగ్నేయ మూల ఈ మెుక్కను ఉంచడానికి ఉత్తమైన ప్రదేశం.
లిల్లీ ప్లాంట్: కలువ మొక్క ఆనందం, శాంతి, సామరస్యానికి చిహ్నం. లిల్లీ గదిలో సానుకూల వైబ్‌ను తెస్తుంది. పీడకలలను దూరంగా ఉంచుతుంది. దీనిని గదిలో సూర్య కాంతి తగిలే ప్రదేశంలో ఉంచడం మంచిది
సంబంధిత కథనం