Haseena Teaser Launch: అడవిశేష్ చేతుల మీదుగా హసీన టీజర్ రిలీజ్.. క్రైమ్ థ్రిల్లర్‌గా సినిమా-adivi sesh launched teaser of crime thriller haseena ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Haseena Teaser Launch: అడవిశేష్ చేతుల మీదుగా హసీన టీజర్ రిలీజ్.. క్రైమ్ థ్రిల్లర్‌గా సినిమా

Haseena Teaser Launch: అడవిశేష్ చేతుల మీదుగా హసీన టీజర్ రిలీజ్.. క్రైమ్ థ్రిల్లర్‌గా సినిమా

Maragani Govardhan HT Telugu
Oct 15, 2022 11:10 AM IST

Haseena Teaser Launch: ప్రముఖ టాలీవుడ్ హీరో అడివి శేష్ చేతులమీదుగా హసీనా టీజర్ లాంచ్ అయింది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక దే నటిస్తోంది. నవీన్ ఇరగాని దర్శకత్వం వహిస్తున్నారు.

హసీనా టీజర్ లాంచ్
హసీనా టీజర్ లాంచ్

Haseena Teaser Launch: ప్రియాంక డే టైటిల్ రోల్‌లో సాయి తేజ గంజి, థన్వీర్, శివ గంగా, ఆకాష్ లాల్, వశిష్ణ నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం హసీనా. ఈ సినిమాను ఎస్ రాజశేఖర్ రెడ్డి, తన్వీర్ ఎండీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టెక్నికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి నవీన్ ఇరగాని దర్శకత్వం వహిస్తున్నారు. పింటు శుభం ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టాలీవుడ్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైంది.

ఒక నిమిషం 41 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. సగటు ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా ఈ టీజర్ కట్ చేశారు. స్నేహితులు చివరిదాకా వెంటే ఉంటారు కానీ అన్ని సమయాల్లో మాత్రం కాదు అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమాను రూపొందించారు. "ఎవడైనా బాగుపడాలన్నా సంకనాకి పోవాలన్నా దానికి కారణం ఫ్రెండ్స్ అయి ఉంటారు" అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్.. యూత్ ఆడియన్స్ ని థ్రిల్ చేసే సన్నివేశాలతో ఆకట్టుకుంది. "ఒక మనిషిని చంపాలంటే ఆయుధబలం అవసరం లేదు బుద్ధి బలం ఉంటే చాలు" అనే డైలాగ్ ఈ మూవీ కథలో కొత్తదనాన్ని తెలుపుతోంది. ఇక చివరగా.. "నా పేరు హసీనా.. నా కథ మీకు అర్థం కావాలంటే మీరు మందైనా తాగి ఉండాలి లేక మేధావి అయినా అయి ఉండాలి" అని చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది.

ఈ టీజర్ రిలీజ్ చేసిన అనంతరం అడవిశేష్ మాట్లాడుతూ.. హసీనా అనేది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని, 84 మంది కొత్త నటీనటులతో ఈ సినిమా రూపొందించడం విశేషమని చెప్పారు. టీజర్ చాలా బాగా వచ్చిందని అన్నారు. ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

అంతకుముందు ఈ చిత్రం నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన పాటను విడుదల చేశారు యంగ్ హీరో నిఖిల్. ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతూ అంచనాలు క్రియేట్ చేసింది. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్, మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.

ఈ సినిమాకు హరీష్ కృష్ణ (చంటి) ఎడిటర్‌గా, రామ కందా కెమెరామెన్‌గా, షారుక్ షేక్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. నేపథ్య సంగీతాన్ని నవనీత్ చారి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి తేజ గంజి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్