telangana engineering fees: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులు ఖరారు
telangana eng colleges fees: ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు జీవో జారీ చేసింది.
engineering colleges fees in telangana: ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజులను ఖరారు చేస్తూ బుధవారం జీవో జారీ చేసింది. ఏఎఫ్‌ఆర్సీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని 159 కాలేజీల్లో ఫీజులను నిర్ణయించింది. ఈ జీవో ప్రకారం కాలేజీల్లో కనీస ఫీజు రూ. 45వేలకు పెంచుతున్నట్లు పేర్కొంది.
ఇక్కడే ఎక్కువ…..
ప్రభుత్వం జీవో ప్రకారం చూస్తే... ప్రస్తుతం తెలంగాణలోని 40 కళాశాల్లో ఫీజు లక్ష దాటనుంది. అత్యధికంగా ఎంజీఐటీలో రూ. 1.60లక్షలుగా ఉండనుంది. సీవీఆర్ రూ. 1.50లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్, వాసవీ కాలేజీల్లో రూ. 1.40లక్షలుగా నిర్ణయించారు. ఫీజుల పెంపు మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ కాలేజీల్లో 45 కోర్సుల్లో 65,633 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులోఉన్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అత్యధికంగా సీఎస్‌ఈలో 17,154, ఈసీఈలో 11,375, సీఎస్‌ఈ ఏఐఎంఎల్‌లో 7,032 సీట్లకు యూనివర్సిటీలు అనుమతిచ్చినట్లు పేర్కొంది. కన్వీనర్ కోటాలో 70శాతం, యాజమాన్య కోటాలో 30శాతం సీట్లను భర్తీ చేస్తారని వెల్లడించింది. కౌన్సెలింగ్ లో భాగంగా ఇవాళ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది.
Engineering fees hike in telangana: ఇంజినీరింగ్ ఫీజుల పెంపు అంశంపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో... పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫీజుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రభుత్వం తాజాగా ఖరారు చేసినప్పటికీ... ఫీజు రియంబర్స్ మెంట్ పై క్లారిటీ ఇవ్వలేదు.