TS CPGET 2022 | కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు.. ఇకపై ఆ కోర్సుల్లో చేరొచ్చు-ts cpget 2022 key changes in common pg entrance test in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Cpget 2022 | కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు.. ఇకపై ఆ కోర్సుల్లో చేరొచ్చు

TS CPGET 2022 | కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు.. ఇకపై ఆ కోర్సుల్లో చేరొచ్చు

HT Telugu Desk HT Telugu
May 16, 2022 04:32 PM IST

కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో కీలక మార్పులు జరిగాయి. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన వీసీలతో ఉన్నత విద్యా మండలి జరిపిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని అన్ని యునివర్సిటీల వీసీలతో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో భారీ మార్పులు చేశారు. ఏదేనా డిగ్రీ పాసైన విద్యార్థులు.. ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీ అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పించేలా నిర్ణయించారు.

ఈ ఏడాది కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2022-23 నుంచి ఈ మార్పు అమలులోకి వస్తుంది. విద్యార్థులు ఏ విభాగంలో డిగ్రీలో పాస్ అయినా.. ఇకపై ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీలో అడ్మిషన్ పొందుతారు. అంతకుముందులాగానే.. కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టు నిర్వహణ బాధ్యలు ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. మే నెలాఖరుకల్లా టీఎస్ సీపీజీఈటీ 2022 (TS CPGET 2022) నోటిఫికేషన్ రానుంది.

అయితే ఉన్నత విద్యా మండలి.. వీసీలతో సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కూడా తీసుకుంది. 2022-23 విద్యాసంవత్సరానికి గానూ.. జీరో అడ్మిషన్లు నమోదైన కాలేజీలను, కోర్సులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఒక కోర్సులో 15 మంది కంటే.. తక్కువ విద్యార్థులు.. చేరితే.. వారిని ఇతర కోర్సులకు బదిలీ చేస్తారు. లేకుంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చేరే అవకాశం కల్పించాలని వీసీలకు ఉన్నత విద్యామండలి సూచించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్