SCR: ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్ పరిధిలో ఈ రైళ్లు రద్దు, వివరాలివే
Traines Cancelled: సికింద్రాబాద్ పరిధిలో ఇవాళ, రేపు పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
Traines Cancelled in Secunderabad Region: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అగ్నిపథ ఆందోళనల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. శుక్రవారం భారీ స్థాయిలో విధ్వంసం జరగటంతో దాదాపు 9 గంటల పాటు రైళ్లన్నీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సిగ్నలింగ్ వ్యవస్థ పునరుద్ధరణ తరువాత రాకపోకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు కూడా పలు రద్దైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంకొన్ని రైలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేశారు. మరికొన్నింటిని రీషెడ్యూల్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి....
జూన్ 18న మన్మాడ్- సికింద్రాబాద్ అజంతా ఎక్స్‌ప్రెస్(నెం.17063) రైలు రద్దు
జూన్ 18న సాయినగర్ షిర్డి- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (నెం.17001) రైలు రద్దు
జూన్ 19న త్రివేండ్రం సెంట్రల్ -సికింద్రాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్ (నెం.17229) రైలు రద్దు
జూన్ 19న దనాపూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (నెం.12792) రైలు రద్దు
జూన్ 18,19 తేదీల్లో భువనేశ్వర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17015) రైలు రద్దు
జూన్ 19న శాలిమార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (18045) రైలు రద్దు
జూన్ 18న విశాఖపట్టణం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ (17240) రైలు రద్దు
జూన్ 17న కేఎస్ఆర్ బెంగళూరు- దనాపూర్ సంగమిత్ర ఎక్స్‌ప్రెస్ (12295) రైలు రద్దు
జూన్ 18న కాకినాడ పోర్ట్-విశాఖపట్టణం మెము (17267) రైలు రద్దు
జూన్ 19న విశాఖపట్టణం-కాకినాడ పోర్ట్ మెము (17268) రైలు రద్దు
పాక్షికంగా రద్దు అయిన రైళ్ల వివరాలు...
3 రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు చేశారు అధికారులు. గురువారం రాత్రి 11.45 గంటకు సికింద్రాబాద్ నుంచి మణుగూరు వెళ్లాల్సిన 12745 రైలు.. అర్ధరాత్రి తర్వాత 02.45 గంటలకు బయలుదేరి వెళ్లింది. ఇవాళ సికింద్రాబాద్ నుంచి దనాపూర్ వెళ్లే 12791 రైలు ఉదయం 09.25 గంటలకు కాకుండా.. మధ్యాహ్నం 3.25 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఇవాళ కాకినాడ పోర్ట్ నుంచి సాయినగర్ షిర్డీ వెళ్లే 17206 రైలు ఉదయం 6 గంటలకు కాకుండా.. 07.30 గంటలకు బయలుదేరింది. మరోవైపు ఇవాళ నడవాల్సి ఉన్న పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. బీదర్-హైదరాబాద్ రైలు (17009), హైదరాబాద్-విశాఖపట్టణం (12728), హైదరాబాద్-చెన్నై సెంట్రల్ (12604), హైదరాబాద్-తాంబరం (12760), విశాఖపట్ణణ-హైదరాబాద్ (12727), తాంబరం-హైదరాబాద్ (12759) రైళ్లను పునరుద్ధరించారు. ప్రయాణికులు తాజా వివరాల ఆధారంగా రాకపోకలను కొనసాగించాలని కోరారు.
ఇవాళ, రేపు ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య 9 రైళ్లు, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 9, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 7, లింగపల్లి-ఫలక్‌నుమా మధ్య 7, సికింద్రాబాద్-లింగపల్లి రూట్లో ఒక రైలు, లింగంపల్లి-సికింద్రాబాద్ మధ్య ఒక రైలును రద్దు చేసింది.
విశాఖ పరిధిలోనూ రైళ్లు రద్దు… వివరాలివే
అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో విశాఖ నుంచి ఆదివారం నడిచే పలు రైళ్లు కూడా రద్దయ్యాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు వివరాలను వెల్లడించారు.
రద్దు అయిన రైళ్లు...
జూలై 19వ తేదీన నడిచే (train No. 18045) షాలిమార్ - సికింద్రాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ రద్దు అయింది.
ఇవాళ నడిచే train No. 17240 విశాఖ - గుంటూరు ఎక్స్ ప్రెస్ రద్దు చేశారు.
రేపు నడిచే train No. 17239 గుంటూరు - విశాఖ ఎక్స్ ప్రెస్ రద్దు అయింది.
ఇవాళ నడిచే కాకినాడ- విశాఖ ఎక్స్ ప్రెస్ తో పాటు విశాఖ - కాకినాడ ట్రైన్ రద్దు అయింది. విశాఖ- రాయగడ్డ, రాయగడ్డ - విశాఖ మధ్య సర్వీస్ రద్దు చేసినట్లు అధికారుల వెల్లడించారు.