Ganga Pushkaralu 2023: గంగా పుష్కరాల కోసం ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు.. విశాఖ టు వారణాసి: ఈ తేదీల్లో!-special trains for ganga puskaralu from visakhapatnam to varanasi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ganga Pushkaralu 2023: గంగా పుష్కరాల కోసం ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు.. విశాఖ టు వారణాసి: ఈ తేదీల్లో!

Ganga Pushkaralu 2023: గంగా పుష్కరాల కోసం ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు.. విశాఖ టు వారణాసి: ఈ తేదీల్లో!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 13, 2023 07:45 AM IST

Ganga Pushkaralu 2023 - Special Trains: గంగా నదీ పుష్కరాల సందర్భంగా విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. వేసవి సీజన్ కోసం కూడా స్పెషల్ ట్రైన్స్ ఉండనున్నాయి.

Ganga Pushkaralu 2023: గంగా పుష్కరాల కోసం ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు
Ganga Pushkaralu 2023: గంగా పుష్కరాల కోసం ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు

Ganga Pushkaralu 2023 - Special Trains: గంగా నదీ పుష్కరాల కోసం భారతీయ రైల్వేస్ (Indian Railways) ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. తెలుగు ప్రజల కోసం విశాఖపట్నం (Visakhapatnam) నుంచి వారణాసి(Varanasi / Kashi)కి గంగా పుష్కరాల సందర్భంగా స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేయనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. “ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ప్రత్యేక కృషి వల్ల.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చొరవతో, గంగా పుష్కరాలతో పాటు వేసవి సీజన్‍లో విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే బోర్డు నిర్ణయించింది” అని రైల్వే బోర్డు ప్రకటించింది. వివరాలివే..

Ganga Pushkaralu 2023 - Special Trains: “తెలుగు కాశీ సమితి గంగా పుష్కరాల నిర్వాహక కమిటీ అధ్యక్షుడిగా ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గంగా పుష్కరాల కోసం వచ్చే యాత్రికుల సదుపాయాల విషయంపై ఆయన ప్రధాన మంత్రి కార్యాలయం, వారణాసి జిల్లా యంత్రాంగంతో ఆయన సంప్రదిస్తున్నారు” అని రైల్వే బోర్డు పేర్కొంది. విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లు షెడ్యూల్‍ను ప్రకటించింది.

ప్రత్యేక రైళ్లు షెడ్యూల్

Ganga Pushkaralu 2023 - Special Trains: “గంగా పుష్కరాల కోసం ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం నుంచి వారణాసికి ఏప్రిల్ 19, ఏప్రిల్ 26 తేదీల్లో బయలుదేరతాయి. ఆ ట్రైన్స్ మళ్లీ ఏప్రిల్ 20, ఏప్రిల్ 27వ తేదీల్లో విశాఖకు తిరిగివస్తాయి. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక రైళ్లు మే నెలలో ఐదు రోజులు, జూన్‍లో నాలుగు రోజులు కూడా నడుస్తాయి. అంటే మొత్తంగా 11 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి” అని రైల్వే శాఖ అధికారికంగా వెల్లడించింది.

“సమ్మర్ సీజన్‍లో ప్రత్యేక రైళ్ల కోసం వాల్తేర్ డివిజన్ గతంలో ప్రతిపాదనలు పంపింది. ఎంపీ జీవీఎల్ నరసింహా రావు జోక్యం చేసుకొని, స్పెషల్ ట్రైన్లను ప్రకటించాలని కోరారు. దీంతో వెంటనే విశాఖపట్నం నుంచి వారణాసికి ప్రత్యేక రైళ్లను వెంటనే ప్రకటించాం” అని రైల్వే బోర్డు పేర్కొంది.

విజయవాడ, తిరుపతి నుంచి కూడా వారణాసికి ప్రత్యేక రైళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని జీవీఎల్ నరసింహా రావు చెప్పారని రైల్వే బోర్డు వెల్లడించింది. విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్‍లోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాల కృషి చేస్తానని ఆయన చెప్పినట్టు పేర్కొంది.

గంగా పుష్కరాలు ఏప్రిల్ 22వ తేదీన మొదలై మే 3న ముగుస్తాయి. పుష్కరాల సమయంలో గంగా నదిలో పుణ్య స్నానాల కోసం లక్షలాది మంది భక్తులు వారణాసి సహా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉంది.

Whats_app_banner