Ganesh Chaturthi 2022 : గణేశ్ నిమజ్జనం కోసం 162 కృత్రిమ చెరువుల ఏర్పాటు!
02 September 2022, 10:46 IST
- Ganesh Chaturthi 2022 : గణేశ్ నిమజ్జనం కోసం 162 కృత్రిమ చెరువులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు బీఎంసీ ఓ ప్రకటన చేసింది.
గణేశ్ నిమజ్జనం కోసం 162 కృత్రిమ చెరువుల ఏర్పాటు!
Ganesh Chaturthi 2022 : గణేశ్ నిమజ్జం వేళ కాలుష్యాన్ని తగ్గించేందుకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) చర్యలు చేపట్టింది. ఈ ఏడాది గణేశ్ నిమజ్జనం కోసం 162 కృత్రిమ చెరువులను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. వీటితో పాటు గణేశ్ నిమజ్జనం కోసం మరో 73 ప్రాంతాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు స్పష్టం చేసింది.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీఓపీ)తో తయారు చేసిన గణేశ్ విగ్రహాల నిమజ్జనంతో కాలుష్యం పెరిగిపోతోందని గత కొన్నేళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ.. వినాయక విగ్రహాల్లో ఇంకా పీఓపీని వినియోగిస్తున్నారు. దీనిని గ్రహించిన బీఎంసీ.. కృత్రిమ చెరువులను ఏర్పాటు చేస్తోంది. పీఓపీతో తయారు చేసిన గణేశ్ విగ్రహాలను కృత్రిమ చెరువుల్లో నిమజ్జనం చేయాలని పిలుపునిస్తోంది.
Ganesh visarjan : "ప్రకృతి పరంగా ఏర్పడిన 73 ప్రాంతాలతో పాటు ఈసారి 162 కృత్రిమ చెరువులను కూడా గణేశ్ నిమజ్జనం కోసం ఏర్పాటు చేశాము. లైఫ్‌గార్డులు, క్రేన్లతో పాటు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకున్నాము. నగరవాసులు కృత్రిమ చెరువులను వినియోగించుకోవాలి," అని బీఎంసీ పిలుపునిచ్చింది.
దేశవ్యాప్తంగా ఆగస్టు 31న వినాయక చవితి వేడుకలను నిర్వహించారు. కాగా.. ముంబైలో ఒక్క గురువారమే 22,687 గణేశ్ విగ్రహాల నిమజ్జం కృత్రిమ చెరువుల్లో జరిగింది.
జియోమార్ట్‌లో ప్రసాదాలు..
Prasad in Jiomart : ముంబైలో లాల్బాగ్చా రాజా గణేశ్ చాలా ప్రసిద్ధి. ఆ విగ్రహాన్ని చూసేందుకు వేలాది మంది ప్రజలు ముంబైకి తరలివెళాతరు. అయితే.. ఈసారి పీటీఎం, జియోమార్ట్‌తో కలిసిన సిబ్బంది.. భక్తులకు ఆన్లైన్ సేవలను అందిస్తోంది.
Ganesh Prasad in Paytm : జియోమార్ట్‌లో రెండు లడ్డూలు.. ప్రసాదాలుగా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ముంబై, నవీ ముంబై, ఠాణె ప్రాంతాల వారికే ఈ ఆన్లైన్ సేవలు ఇస్తున్నారు. ఇక ప్రసాదాల కోసం పేటీఎంలో ఆర్డర్ చేసుకోవచ్చు. 250గ్రాముల డ్రైఫ్రూట్ లడ్డూ లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
గణేశ్ మండపం కోసం రూ. 316కోట్ల బీమా..!
GSB seva mandal insurance : ముంబైలో గణేశ్ ఉత్సవాల హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే.. ముంబైలోని జీఎస్బీ సేవా మండల్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ జీఎస్బీ సేవా మండల్.. గణేశ్ ఉత్సవాల కోసం ఏకంగా రూ. 316.40కోట్లు విలువ చేసే బీమాను తీసుకుంది!
ముంబై కింగ్ సర్కిల్లోని అత్యంత సంపన్నమైన వినాయకుడి మండపాల్లో ఈ జీఎస్బీ సేవా మండల్ ఒకటి. ఉత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తులు.. ఇక్కడి గణేశుడిని దర్శించుకుంటారు. అందుకు తగ్గట్టుగానే జీఎస్బీ సేవా మండల్ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తారు. ఈ క్రమంలోనే కార్యకలాపాలకు సంబంధించి బీమాలు కూడా తీసుకుంటారు. ఈసారి అత్యధికంగా.. రూ. 316.40కోట్ల బీమాను తీసుకున్నారు. జీఎస్బీ సేవా మండల్ చరిత్రలో ఇదే అత్యధిక బీమా మొత్తం అని సభ్యులు వివరించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టాపిక్