తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maharashtra News: ‘ఇంపోర్టెడ్ మాల్’ అంటూ బీజేపీ నాయకురాలిపై ఉద్ధవ్ సేన నాయకుడి అవాకులు; కేసు నమోదు

Maharashtra news: ‘ఇంపోర్టెడ్ మాల్’ అంటూ బీజేపీ నాయకురాలిపై ఉద్ధవ్ సేన నాయకుడి అవాకులు; కేసు నమోదు

Sudarshan V HT Telugu

01 November 2024, 18:04 IST

google News
  • Maharashtra news: శివసేన ఉద్ధవ్ వర్గం నేత, ఎంపీ అరవింద్ సావంత్ పై ముంబైలో కేసు నమోదైంది. బీజేపీ యువ నాయకురాలు షైనా ఎన్సీ శుక్రవారం ముంబైలోని నాగ్పడా పోలీస్ స్టేషన్ లో శివసేన (UBT) నేత, ఎంపీ అరవింద్ సావంత్ పై ఫిర్యాదు చేశారు.

మహారాష్ట్ర బీజేపీ నాయకురాలు షైనా ఎన్సీ
మహారాష్ట్ర బీజేపీ నాయకురాలు షైనా ఎన్సీ

మహారాష్ట్ర బీజేపీ నాయకురాలు షైనా ఎన్సీ

Maharashtra assembly election 2024: ముంబాదేవి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన భారతీయ జనతా పార్టీ యువనేత షైనా ఎన్ సి పై శివసేన (UBT) నేత, ఎంపి అరవింద్ సావంత్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా బీజేపీలో ఉంటూ, ఇప్పుడు షిండే శివసేన పార్టీ తరఫున షైనా ఎన్సీ పోటీ చేయడంపై సావంత్ స్పందిస్తూ.. ‘ఇంపోర్టెడ్ మాల్ ఇక్కడ పనిచేయదు’’ అని అన్నారు.

ప్రచారంలో వ్యాఖ్యలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra assembly election 2024) ముంబాదేవి నుంచి బరిలో ఉన్న మిత్రపక్షం కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అమీన్ పటేల్ తరఫున సావంత్ ప్రచారం చేశారు. ఆ సందర్భంగా ఈ ‘ఇంపోర్టెడ్ మాల్’ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వైరల్ గా మారింది. "ఆమె పరిస్థితి చూడండి. మొదట్నుంచీ బీజేపీలో ఉన్న ఆమె ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్లి, ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అలా దిగుమతి చేసుకున్న 'మాల్' ఇక్కడ పనిచేయదు, అసలు 'మాల్' మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది’’ అని సావంత్ ఆ ప్రచారంలో వ్యాఖ్యానించారు.

కేసు నమోదు..

కాగా, తనపై శివసేన యూబీటీ నేత సావంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ముంబైలోని నాగ్పడా పోలీస్ స్టేషన్ లో షైనా ఎన్సీ ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంగా అక్కడికి భారీగా వచ్చిన మహిళా కార్యకర్తలు సావంత్ క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. ‘‘మీరు స్త్రీని గౌరవించలేరు. రాజకీయాల్లో ఉన్న సమర్థురాలైన మహిళపై ఇలాంటి పదాలు వాడుతున్నారు. ఇప్పుడు మీరు ఆ మహిళను 'మాల్' అని పిలిచారు కాబట్టి మీరు 'బేహాల్' అవుతారు’’ అని షైనా ఎన్సీ అన్నారు.

షిండే వర్గం నేతల విమర్శలు

మరోవైపు శివసేన ఎంపీ, ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ కూడా అరవింద్ సావంత్ పై విమర్శలు గుప్పించారు. అరవింద్ సావంత్ మా అభ్యర్థిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమెను 'ఇంపోర్టెడ్ మాల్' అని పిలిచాడు. వారు ఎప్పుడూ మహిళలపై ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలను ఉపయోగిస్తారని ఇది చూపిస్తుంది. వారు స్వభావరీత్యా మహిళా వ్యతిరేకులు " అని విమర్శించారు.

ముంబాదేవి నియోజకవర్గం గురించి

- ముంబై సిటీ లోని 10 నియోజకవర్గాలలో ముంబాదేవి ఒకటి.

- ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో అమీన్ పటేల్ 2009 నుంచి గెలుస్తున్నారు.

- 2019లో శివసేన (అవిభాజ్య) అభ్యర్థి పాండురంగ్ సక్పాల్ ను 23,000 ఓట్ల తేడాతో ఓడించారు.

- ముంబై దక్షిణ లోక్ సభ స్థానాన్ని ఇటీవలి ఎన్నికల్లో శివసేన (యూబీటీ) అభ్యర్థి అరవింద్ సావంత్ గెలుచుకున్నారు. శివసేనకు చెందిన యామినీ జాదవ్ ను ఓడించారు.

తదుపరి వ్యాసం