Rakhi Sawant husband Adil Arrest: భర్తను అరెస్టు చేయించిన రాఖీ సావంత్.. క్షమించే ప్రసక్తే లేదని వెల్లడి
Rakhi Sawant husband Adil Arrest: బాలీవుడ్ ముద్దుగుమ్మ రాఖీ సావంత్.. తన భర్త ఆదిల్ ఖాన్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనను తీవ్రంగా మోసం చేశాడని ఆరోపించిన రాఖీ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.
govబాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ తన భర్త ఆదిల్ ఖాన్ దురానీపై షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అతడు వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకోవడమే కాకుండా, తన నిధులను దుర్వినియోగం చేశాడని ఆరోపించింది. తన తల్లి జయ సావంత్‌ను చూసుకోవాలని అతడిని కోరగా.. ఆ డబ్బును తీసుకుని పట్టించుకోలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో మంగళవారం నాడు ఆదిల్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అతడిని అరెస్టు ముంబయిలోని ఓషివారా పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.
ట్రెండింగ్ వార్తలు
తను బిగ్‌బాస్ మరాఠీలో పాల్గొన్నందుకు అందుకున్న రూ.10 లక్షల చెక్‌ను తన తల్లి జయ సావంత్ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టాలని ఆదిల్‌ను కోరినట్లు రాఖీ సావంత్ సోమవారం నాడు తెలిపింది. అయితే ఆ సొమ్మును సమయానికి ఖర్చు పెట్టకపోవడంతో తన తల్లి మరణించిందని, ఇందుకు ఆదిలే కారణమని ఆరోపించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం నాడు ఆమెను కలిసేందుకు వచ్చిన ఆదిల్‌ను పోలీసులు అదుపులో తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయంపై రాఖీ స్పందించింది.
"ఇదేమి డ్రామా కాదు. అతడు నా జీవితాన్ని నాశనం చేశాడు. నన్ను కొట్టడమే కాకుండా ఖురాన్‌పై ఒట్టేసి నా డబ్బును దొంగిలించాడు. నన్ను తీవ్రంగా మోసం చేశాడు. ఇది నిజమని నిరూపించేందుకు నా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి." అని రాఖీ సావంత్ ఆరోపించంది.
ఇదిలా ఉంటే సోమవారం నాడు ఆదిల్, రాఖీ తమ స్మేహితులతో కలిసి ఓ డిన్నర్‌లో కనిపించారు. ఆ వీడియోలో రాఖీకి ఆదిల్ భోజనం తినిపించడం కూడా చూడవచ్చు. కానీ అయిష్టంగానే ఆమె అంగీకరించినట్లు అర్థమవుతుంది. ఈ విషయంపై మాట్లాడిన రాఖీ.. “అతడు క్షమాపణ చెప్పడానికి వచ్చాడు. కానీ నేను ఎప్పటికీ అతడిని క్షమించను. నేను అతడికి ఇంట్లో తినిపించేదాన్ని, కానీ ఇదే చివరి సారి అవుతుందని ఎవరికి తెలుసు. ఈ రోజు నేను అతడికి ఆహారం ఇచ్చాను. శత్రువులు ఇంటికి వచ్చినప్పుడు వారికి కూడా భోజనం పెడతాము. అతడు నా భర్త, నేను చనిపోయే వరకు అతడిని ప్రేమిస్తాను. కానీ అస్సలు క్షమించను." అని రాఖీ సావంత్ తెలిపింది.