తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aravind Kejriwal Cbi : సీబీఐ ఎదుట కేజ్రీవాల్​.. ఆప్​ నేతల నిరసనలు

Aravind Kejriwal CBI : సీబీఐ ఎదుట కేజ్రీవాల్​.. ఆప్​ నేతల నిరసనలు

Sharath Chitturi HT Telugu

16 April 2023, 13:13 IST

google News
  • Aravind Kejriwal CBI : లిక్కర్​ స్కామ్​ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​.. సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. మరోవైపు ఆమ్​ ఆద్మీ శ్రేణులు ఢిల్లీవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.

పంజాబ్​ సీఎం భగవంత్​ మన్​తో అరవింద్​ కేజ్రీవాల్​
పంజాబ్​ సీఎం భగవంత్​ మన్​తో అరవింద్​ కేజ్రీవాల్​ (Ayush Sharma)

పంజాబ్​ సీఎం భగవంత్​ మన్​తో అరవింద్​ కేజ్రీవాల్​

Aravind Kejriwal news : ఢిల్లీ సీఎం, ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) అధినేత అరవింద్​ కేజ్రీవాల్​.. సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి ఆదివారం ఉదయం వెళ్లిన సీఎంపై లిక్కర్​ స్కామ్​ కేసులో భాగంగా అధికారులు విచారణ చేపట్టారు.

"సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు నేను జవాబు చెబుతాను. కానీ నేను అరెస్ట్​ అవుతానని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీబీఐని బీజేపీ నియంత్రిస్తోందని స్పష్టమవుతోంది," అని దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు కేజ్రీవాల్​.

కేజ్రీవాల్​తో పాటు పంజాబ్​ సీఎం భగవంత్​ మన్​, ఢిల్లీ మంత్రులు, ఎంపీలు కూడా సీబీఐ కార్యాలయానికి వెళ్లారు.

మహాత్ముడికి నివాళి అర్పించి..

Aravind Kejriwal latest news : అంతకుముందు.. ఆదివారం ఉదయం తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు అరవింద్​ కేజ్రీవాల్​. ఈ సమావేశానికి ఆమ్​ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు హాజరయ్యారు. అక్కడి నుంచి బయలు దేరే ముందు మీడియాతో మాట్లాడారు కేజ్రీవాల్​.

"కొన్ని దేశ విద్రోహ శక్తులు.. దేశాభివృద్ధికి అడ్డుపడుతున్నాయి. ఇలా చేసే వారికి నేను ఒకటే చెబుతున్నా. దేశాభివృద్ధి కొనసాగుతుంది," అని కేజ్రీవాల్​ అన్నారు.

Delhi liquor scam latest updates : తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు.. రాజ్​ఘాట్​లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు కేజ్రీవాల్​. పంజాబ్​ సీఎం, కేజ్రీవాల్​తో కలిసి అక్కడికి వెళ్లారు.

మరోవైపు కేజ్రీవాల్​పై సీబీఐ చర్యలను వ్యతిరేకిస్తూ ఆమ్​ ఆద్మీ పార్టీ శ్రేణులు రోడ్లెక్కారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. వీరిని అదుపుచేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ పరిణామాలతో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులకు గురైనట్టు తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​..

Aravind Kejriwal liquor scam : ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా ఇప్పటికే అరెస్ట్​ అయ్యారు. ఈ కేసులో కేజ్రీవాల్​ హస్తం కూడా ఉందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. కాగా.. ఈడీ, సీబీఐలు తనను తప్పుగా ఇరికిస్తున్నాయని పలు మార్లు మండిపడ్డారు కేజ్రీవాల్​. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళతానని స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం