Arvind Kejriwal CBI : లిక్కర్​ స్కామ్​తో కేజ్రీవాల్​కున్న లింక్​ ఏంటి? సీఎంను సీబీఐ ఎందుకు పిలిచింది?-delhi cm arvind kejriwal gets cbi summons in delhi liquor scam here s why ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Arvind Kejriwal Cbi : లిక్కర్​ స్కామ్​తో కేజ్రీవాల్​కున్న లింక్​ ఏంటి? సీఎంను సీబీఐ ఎందుకు పిలిచింది?

Arvind Kejriwal CBI : లిక్కర్​ స్కామ్​తో కేజ్రీవాల్​కున్న లింక్​ ఏంటి? సీఎంను సీబీఐ ఎందుకు పిలిచింది?

Sharath Chitturi HT Telugu
Apr 15, 2023 07:52 AM IST

Arvind Kejriwal CBI : ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసు విచారణకు రావాలని సీఎం కేజ్రీవాల్​కు పిలుపునిచ్చింది సీబీఐ. ఈ స్కామ్​తో కేజ్రీవాల్​కు ఉన్న లింక్​ ఏంటి?

ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​
ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ (HT_PRINT)

Arvind Kejriwal Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో భాగంగా.. ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​కు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) పిలుపునివ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా.. ఇదే కేసులో ఇప్పటికే ఆరెస్టైన్​ నేపథ్యంలో.. 16న ఏం జరగుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు కేజ్రీవాల్​పై కుట్ర జరుగుతోందని ఆమ్​ ఆద్మీ నేతలు ఆరోపిస్తుంటే.. మరోవైపు ఢిల్లీ సీఎంకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలున్నట్టు సీబీఐ చెబుతోంది. ఢిల్లీ లిక్కర్​ స్కామ్​కు సీఎంకు లింక్​ ఏంటి? సీబీఐ ఆయన్ని ఎందుకు పిలిచింది?

అరవింద్​ కేజ్రీవాల్​ పాత్ర ఉందా..?

ఈడీ ఇటీవలే దాఖలు చేసిన ఛార్జ్​షీట్​ ప్రకారం.. ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో ప్రధాన నిందితుడు, వ్యాపారవేత్త సమీర్​ మహంద్రుతో ఫేస్​టైమ్​లో మాట్లాడారు అరవింద్​ కేజ్రీవాల్​. ఆప్​ కమ్యూనికేషన్​ ఇన్​ఛార్జ్​ విజయ్​ నాయర్​పై నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

Arvind Kejriwal CBI : కాగా.. గతేడాది నవంబర్​ 12-15న సమీర్​ మహంద్రును ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆ సమయంలో కొన్ని కీలక విషయాలు వెల్లడించాడు సమీర్​. విజయ్​ నాయర్​.. అరవింద్​ కేజ్రీవాల్​తో తనకు మీటింగ్​ ఫిక్స్​ చేసినట్టు పేర్కొన్నాడు. కానీ అది జరగలేదని వెల్లడించాడు. అనంతరం ఫేస్​టైమ్​లో ఇద్దరం వీడియో కాల్స్​లో మాట్లాడుకున్నట్టు వెల్లడించాడు.

"ఈ వీడియో కాల్​లో విజయ్​ నాయర్​ను నమ్మమని అరవింద్​ కేజ్రీవాల్​ సమీర్​కు చెప్పారు. విజయ్​తో మంతనాలు జరపాలని సమీర్​కు సూచించారు," అని ఈడీ ఆరోపిస్తోంది. ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో మరో నిందితుడుగా ఉన్నారు విజయ్​ నాయర్​. వీరిద్దరు కలిసీ లిక్కర్​ పాలసీ స్కామ్​కు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Delhi liquor scam latest news : కేజ్రీవాల్​ చెప్పినప్పటి నుంచి విజయ్​ నాయర్​కు సమీర్​ దగ్గరైనట్టు, వీరిద్దరు కలిసి పనులు పూర్తిచేసినట్టు ఈడీ చెబుతోంది. ఈ క్రమంలోనే అనేకమంది రాజకీయ నేతలు, లిక్కర్​ వ్యాపారులను కలిసినట్టు ఆరోపిస్తోంది.

Delhi liquor scam case explained : "ఈ క్రమంలో విజయ్​ నాయర్​పై సమీర్​ మహేంద్రుకు నమ్మకం పెరిగింది. ఫ్రెంచ్​ లిక్కర్​ కంపెనీ పెర్నాండ్​ రిచర్డ్ తన హోల్​సేల్​ కోసం​.. సమీర్​ను ఎంచుకునే స్థాయిలో విజయ్​కు కనెక్షన్లు ఉన్నట్టు సమీర్​కు అర్థమైంది. దీని బట్టి విజయ్​కు ఆప్​ పెద్దల నుంచి ఎంత మద్దతు ఉందో తెలుస్తోంది. పార్టీ పెద్ద, ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న కేజ్రీవాల్​కు కూడా ఇందులో హస్తం ఉంది," అని ఈడీ ఆరోపించింది. లిక్కర్​ ట్రేడ్​లో భాగంగా ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఢిల్లీలో కేజ్రీవాల్​ కలిసినట్టు ఈడీ పేర్కొంది.

Whats_app_banner

సంబంధిత కథనం