తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Summer Temperature : ఈసారి వేసవిలో.. భరించలేని విధంగా భానుడి 'భగభగలు'!

Summer temperature : ఈసారి వేసవిలో.. భరించలేని విధంగా భానుడి 'భగభగలు'!

Sharath Chitturi HT Telugu

05 March 2024, 13:09 IST

google News
    • Summer temperature in India : ప్రపంచ వాతావరణంపై డబ్ల్యూఎంఓ కీలక వ్యాఖ్యలు చేసింది. రానున్న నెలలు కఠినంగా ఉంటుందని పేర్కొంది.
రానున్న కొన్ని నెలల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి!
రానున్న కొన్ని నెలల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి!

రానున్న కొన్ని నెలల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి!

El Nino effect in India : ఇండియాలో సమ్మర్​ సీజన్​ ప్రారంభమైపోయింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూటీఓ) చేసిన కొన్ని వ్యాఖ్యలు.. సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. ఎల్​ నీనో ప్రభావం తగ్గుముఖం పడుతోందని, కానీ రానున్న కొన్ని నెలల పాటు ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై నెగిటివ్​ ఎఫెక్ట్​ కొనసాగుతుందని వ్యాఖ్యానించింది.

"ఎల్​ నీనో బలహీనపడుతున్నప్పటికీ.. మార్చ్​- మే వరకు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగానే నమోదవుతాయని అంచనా వేస్తున్నాము," అని డబ్ల్యూటీఓ వెల్లడించింది.

మార్చ్​- మే మధ్యలో ఎల్​ నీనో ఎఫెక్ట్​ కనిపించే అవకాశం 60శాతం ఉందని డబ్ల్యూటీఓ లేటెస్ట్​ అప్డేట్స్​ చెబుతున్నాయి. కానీ ఏప్రిల్​- జూన్​ మధ్యలో ఎల్​ నీనో- లా నీనో ప్రభావాలు ఉండని అవకాశాలు 80శాతం అని పేర్కొంది.

మధ్య తూర్పు ట్రాపికల్​ పెసిఫిక్​ సముద్రంలో (సీ సర్ఫేస్​ టెంపరేచర్​) ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటే దానిని ఎల్​ నీనో అంటారు. సౌత్​ అమెరికా దగ్గర ఉండే ట్రాపికల్​ వెస్ట్​ కోస్ట్​లో సీ సర్ఫేస్​ టెంపరేచర్​ సాధారణం కన్నా తక్కువగా ఉంటే లానీనో అని పిలుస్తారు.

El Nino effect world wide : దాదాపు ఏడాది పాటు ఎల్​ నీనో సమస్య ప్రపంచాన్ని భయపెట్టింది. కాగా.. ఈ ఏడాది చివర్లో లా నీనో ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ దీనిపై ఇప్పుడే ఏం చెప్పలేమని అంటున్నారు.

ఇండియాలో భానుడి భగభగలు తప్పవు!

ఇండియాపై ఎల్​ నీనో ప్రభావం ఈసారి కూడా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మే వరకు భానుడి భగభగలు తప్పవని హెచ్చరిస్తున్నారు. జూన్​ నుంచి ఎల్​ నీనో ప్రభావం తగ్గుముఖం పడుతుందని అంటున్నారు. సెప్టెంబర్​ నాటికి లా నీనో ఎఫెక్ట్​ మొదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇండియాలో వేసవి కాలం కఠినంగానే ఉంటుందని భారత వాతావరణశాఖ కూడా అభిప్రాయపడింది.

Summer in India : "ఈసారి దేశవ్యాప్తంగా సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలే కనిపించొచ్చు. హీట్​వేవ్​లు పెరగొచ్చు. హీట్​వేవ్​తో ఇబ్బంది పడే రోజులు సైతం.. గతంలో కన్నా పెరగొచ్చు," అని ఐఎండీ వెల్లడించింది.

"ఎల్​ నీనో అనేది సగటున 2-7ఏళ్ల మధ్యలో సంభవిస్తుంది. 9 నుంచి 12 నెలల పాటు ఉంటుంది. ఇది సాధారణంగా జరిగే వాతావరణ మార్పు. సెంట్రల్​, ఈస్టెర్న్​ ట్రాపికల్​ పెసిఫిక్​ ఓషన్​ సర్ఫేస్​ వేడిగా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుంది," అని డబ్ల్యూఎంఓ వెల్లడించింది.

"2023 జూన్​ నుంచి ప్రతి నెల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. 2023 ఏడాది.. చరిత్రలోనే అతి వేడైన సంవత్సరంగా నిలిచిపోయింది. దీనికి కారణం ఎల్​ నీనో. మొత్తం తప్పు ఎల్​ నీనోపైనే వేయకూడదు. వాతావరణానికి ముప్పు కలిగిస్తున్న గ్రీన్​హౌజ్​ గ్యాస్​ల బాధ్యత కూడా ఉంది," అని డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్​ సెలిస్టే సులో తెలిపారు.

ఎల్​ నీనో సంభవించిన రెండో ఏడాదికి దాని ప్రభావం పీక్స్​లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ లెక్కన చూసుకుంటే.. ఈసారి రెండో ఏడాది 2024!

మరోవైపు నవంబర్​- జనవరి సమయంలో ఎల్​ నీనో పీక్​ అయ్యిందని నిపుణులు చెబుతున్నారు. 1991 నుంచి 2020 సగటు ఓషెన్​ సర్ఫేస్​ టెంపరేచర్​తో పోల్చుకుంటే.. 2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదైందని డబ్ల్యూఎంఓ చెప్పింది.

తదుపరి వ్యాసం