తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Turkey Earthquake Today : టర్కీలో మళ్లీ భూకంపం.. భయం గుప్పిట్లో ప్రజలు!

Turkey earthquake today : టర్కీలో మళ్లీ భూకంపం.. భయం గుప్పిట్లో ప్రజలు!

Sharath Chitturi HT Telugu

10 February 2023, 9:00 IST

google News
  • Turkey earthquake today : టర్కీలో మరోమారు భూకంపం సంభవించింది. మాలత్య ప్రాంతానికి 19కి.మీల దూరం రిక్టార్​ స్కేల్​పై 4.6 తీవ్రతతో భూమి కంపించింది.

మాలత్య ప్రాంతంలో తాజా పరిస్థితులు..
మాలత్య ప్రాంతంలో తాజా పరిస్థితులు.. (AP)

మాలత్య ప్రాంతంలో తాజా పరిస్థితులు..

Turkey earthquake today : వరుస భూకంపాలు సృష్టించిన అలజడులతో చిన్నాభిన్నమైన టర్కీలో మరోమారు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. టర్కీలోని మాలత్య ప్రాంతంలో శుక్రవారం భూకంపం సంభవించింది. తాజా ఘటనతో ప్రజల్లో భయం మరింత పెరిగింది.

యూరోపియన్​ మెడిటరేనియన్​ సీస్మోలాజికల్​ సెంటర్​ ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 5:03 గంటలకు టర్కీలోని మాలత్యలో భూకంపం సంభవించింది. రిక్టార్​ స్కేల్​పై 4.6 తీవ్రత నమోదైంది. భూమికి 2 కి.మీల అడుగున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మాలత్య ప్రాతానికి నైరుతి దిశగా 19కి.మీల దూరంలో భూకంపం సంభవించింది.

21,000 దాటిన మృతుల సంఖ్య..!

Turkey earthquake death toll : టర్కీలో కొన్ని రోజుల క్రితం వరుస భూకంపాలు వినాశనాన్ని సృష్టించాయి. ఆయా ఘటనల్లో మృతుల సంఖ్య 21వేలను దాటింది. అనేక నగరాల్లో భవనాలు పేకమేడల్లా కూలాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు నాలుగు రోజులుగా సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది.

అధికారిక గణాంకాల ప్రకారం.. టర్కీలో 17,674మంది, సిరియాలో 3,377 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద మృతుల సంఖ్య 21,051కి చేరింది. ఆయా ప్రాంతాల్లో గాయపడిన వారి సంఖ్య 75వేల కన్నా ఎక్కువగానే ఉంటుంది అంచనా. మరోవైపు వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Turkey earthquake latest updates : అధికారిక లెక్కల ప్రకారం.. ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కేంద్రాలను కలుపుకుని 7 నగరాల్లో మొత్తం మీద 3వేల భవనాలు నేలకూలాయి. పలు చోట్ల భవనాల్లో మంటలు చెలరేగాయి.

అటు నివాసాలు కోల్పోయిన ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. వారందరు ఆకలి, చలి మధ్య బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఎవరో ఒకరు వచ్చి తమకు సహాయం చేస్తారని కోటి ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు.

భారత్​ 'దోస్త్'​..

India Turkey Operation Dost : ఆపదలో ఉన్న టర్కీని ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. భారత దేశం ఈ విషయంలో ముందు వరుసలో ఉంది. ఆపరేషన్​ దోస్త్​ పేరుతో టర్కీ, సిరియాలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది భారత సైన్యం. ఆయా దేశాలకు అన్ని విధాలుగా సాయం అందిస్తోంది. ఇండియా నుంచి పట్టికెళ్లిన వైద్య పరికరాలు సైతం ఉపయోగపడుతున్నాయి.

టర్కీ, సిరియాకు సాయం చేసేందుకు అత్యవసరంగా 85 మిలియన్​ డాలర్లను ప్రకటించింది అమెరికా. ప్రజల ఆకలి తీర్చేందుకు, వారికి చికిత్స, గూడును అందించేందుకు ఈ నిధులను ఉపయోగించినట్టు స్పష్టం చేసింది.

తదుపరి వ్యాసం