తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Turkey, Syria Earthquake: పేకమేడల్లా కుప్పకూలిన భారీ భవనాలు: వీడియో

Turkey, Syria Earthquake: పేకమేడల్లా కుప్పకూలిన భారీ భవనాలు: వీడియో

07 February 2023, 15:23 IST

  • Turkey, Syria Earthquake Videos: భీకర భూకంపాలతో టర్కీ, సిరియా దేశాలు అంతలాకుతలం అయ్యాయి. 7.8 తీవ్రతతో సోమవారం (ఫిబ్రవరి 6) టర్కీలో సంభవించిన భారీ భూకంపం విధ్వంసం చేసింది. 24 గంటల వ్యవధిలో మరో రెండు భూకంపాలు కూడా వచ్చాయి. దీంతో టర్కీతో పాటు సమీపంలో ఉన్న సిరియాలో వేలాది ఇళ్లు కుప్పకూలాయి. ఐదు వేలకు మందికి పైగా ప్రజలు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. ఇంకా చాలా మంది శిథిలాల కిందే ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం కూడా సహాయక సిబ్బందిని టర్కీకి పంపింది. కాగా, భూకంపం సంభవించిన సమయంలో టర్కీ, సిరియాలో భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. రెప్పపాటులో నేలమట్టం అయ్యాయి. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. వివరాల కోసం ఈ వీడియో చూడండి.