Turkey thanks ‘dost’ India: ‘దోస్త్’ భారత్ కు టర్కీ హార్ట్ ఫుల్ థ్యాంక్స్-afternoon brief quake hit turkey thanks dost india for funds within 24 hours ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Turkey Thanks ‘Dost’ India: ‘దోస్త్’ భారత్ కు టర్కీ హార్ట్ ఫుల్ థ్యాంక్స్

Turkey thanks ‘dost’ India: ‘దోస్త్’ భారత్ కు టర్కీ హార్ట్ ఫుల్ థ్యాంక్స్

HT Telugu Desk HT Telugu
Published Feb 07, 2023 02:58 PM IST

Turkey thanks ‘dost’ India: ప్రకృతి విలయంతో చేష్టలుడిగిన టర్కీకి 24 గంటల్లోపే సహాయ సామగ్రి పంపిన భారత్ కు టర్కీ కృతజ్ఞతలు తెలిపింది.

భూకంపంతో కుప్పకూలిన భవనం వద్ద సహాయ కార్యక్రమాలు
భూకంపంతో కుప్పకూలిన భవనం వద్ద సహాయ కార్యక్రమాలు (REUTERS)

Turkey thanks ‘dost’ India: భారీ భూకంపం (Turkey earthquake) బారిన పడిన టర్కీకి భారత్ సహాయ సామగ్రిని పంపించింది. భూకంపం సంభవించిన 24 గంటల్లోపే స్పందించిన భారత్ కు టర్కీ ధన్యవాదాలు తెలిపింది.

Turkey thanks ‘dost’ India: విదేశాంగ సహాయ మంత్రి పరామర్శ

భారత్ తక్షణ స్పందనపై టర్కీ ధన్యవాదాలు తెలిపింది. భారత్ లో టర్కీ రాయబారి ఫిరాత్ సునేల్ భారత్ ను అవసరానికి ఆదుకునే నిజమైన స్నేహితుడని అభివర్ణించారు. భారత్ లో, టర్కీలో ‘దోస్త్’ అనేది కామన్ వర్డ్ అని పేర్కొన్నారు. ‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ (a friend in need is a friend indeed) అని అర్థమొచ్చే ‘దోస్త్ కరే గూండే బెల్లి ఓలూర్’ అనే టర్కీ సామెతను ఉదహరిస్తూ ‘దోస్త్ భారత్ కు మన:పూర్వక కృతజ్ఞతలు’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు, టర్కీ రాయబార కార్యాలయానికి భారత విదేశాంగా శాఖ సహాయమంత్రి మురళీధరన్ స్వయంగా వెళ్లి సహానుభూతి వ్యక్తం చేశారు.

Turkey thanks ‘dost’ India: సహాయ సామగ్రి, డాగ్ స్క్వాడ్ తో మరో ఫ్లైట్

భారీ భూకంపం (Turkey earthquake) బారిన పడి తీవ్రంగా ఆస్తి, ప్రాణ నష్టాలతో కుదేలైన టర్కీని ఆదుకోవడానికి భారత్ సహాయ సామగ్రితో మరో ఫ్లైట్ ను టర్కీ కి పంపించింది. వైద్యులు, సుశిక్షితులైన పారామెడికల్ సిబ్బంది, అత్యవసర ఔషధాలు, డాగ్ స్క్వాడ్, ఒక్కో బృందంలో వంద మంది ఉండే మరో రెండు ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలను భారత్ టర్కీకి పంపించింది.

Turkey thanks ‘dost’ India: 4800 మృతి

అత్యంత భారీ భూకంపాల్లో ఒకటిగా పరిగణిస్తున్న టర్కీ భూకంపంలో (Turkey earthquake) 4800 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. భవనాలు క్షణాల్లో, చూస్తుండగానే పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. ప్రాణ భయంతో ప్రజలు రహదారులపైకి పరుగులు తీశారు. కొద్ది గంటల వ్యవధితో తీవ్రమైన మూడు భూకంపాలు, ఆ తరువాత వచ్చిన సుమారు 24 స్వల్ప స్థాయి ప్రకంపనలు టర్కీ, సిరియాలను శిధిలాల దిబ్బలుగా మార్చేశాయి. ఈ భూకంపాల ప్రకంపనలు లెబనాన్, సైప్రస్, గ్రీస్, జోర్డాన్, ఇరాక్ లతో వందల కిమీల దూరాన ఉన్న రొమేనియా, జార్జియా, ఈజిప్ట్ ల్లోనూ ప్రభావం చూపాయి.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.