టర్కీకి భారత్ ఆపన్న హస్తం.. రెస్క్యూ సిబ్బంది, సామాగ్రితో బయలుదేరిన విమానం-india to help turkey earthquake victims plane took off with rescue personnel and supplies ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  టర్కీకి భారత్ ఆపన్న హస్తం.. రెస్క్యూ సిబ్బంది, సామాగ్రితో బయలుదేరిన విమానం

టర్కీకి భారత్ ఆపన్న హస్తం.. రెస్క్యూ సిబ్బంది, సామాగ్రితో బయలుదేరిన విమానం

Feb 07, 2023, 11:14 AM IST HT Telugu Desk
Feb 07, 2023, 11:14 AM , IST

  • భూకంపం కారణంగా టర్కీ, సిరియాలో మరణించిన వారి సంఖ్య 4,365 మందికి పెరిగింది. ఈ రెండు దేశాలకు వివిధ దేశాలు తమ సహాయ హస్తాన్ని అందించాయి. టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపాలపై నిన్న జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆ తర్వాత భారత విమానం టర్కీకి వెళ్లింది. ఇందులో రిలీఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఉన్నారు.

భారతదేశం నుండి 100 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందిని సహాయక చర్యల కోసం టర్కీకి పంపారు. అంతేకాకుండా ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ కూడా పాల్గొంటుంది. భారత వైమానిక దళానికి చెందిన విమానం మందులు, డ్రిల్లింగ్ మిషన్లు, ఇతర అవసరమైన వస్తువులతో టర్కీకి వెళ్లింది.

(1 / 5)

కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ టర్కీ ఎంబసీని సందర్శించి విపత్తుపై సంతాపం తెలిపారు. ఈ పరిస్థితిలో సహాయం చేసినందుకు టర్కీ భారతదేశానికి ధన్యవాదాలు తెలిపింది. భారత్‌లో టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ మాట్లాడుతూ ‘టర్కీ, హిందీలో 'దోస్త్' అనేది చాలా సాధారణ పదం. టర్కిష్ సామెత చెప్పినట్లుగా ఆపన్న సమయంలో స్నేహ హస్తం అందించినవాడు నిజమైన స్నేహితుడు. భారత్‌కు చాలా ధన్యవాదాలు.' అని అన్నారు.

(2 / 5)

సోమవారం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:17 గంటలకు టర్కీ మొదటిసారిగా కంపించింది. ఆ సమయంలో ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. ఆ తర్వాత దేశంలో వందలాది అనంతర ప్రకంపనలు, కనీసం మూడు బలమైన ప్రకంపనలు సంభవించాయి. ఈ పరిస్థితిలో ఈరోజు తెల్లవారుజామున సహాయ సామాగ్రితో భారత విమానం టర్కీకి బయలుదేరింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.

(3 / 5)

అరిందమ్ బాగ్చి ట్వీట్ చేస్తూ 'భారతదేశం నుండి సహాయాన్ని అందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్‌డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌లు, వైద్య పరికరాలు, డ్రిల్లింగ్ మెషీన్లు, ఇతర అవసరమైన పరికరాలతో కూడిన విమానం టర్కీకి బయలుదేరింది. భూకంపం వల్ల దెబ్బతిన్న దేశానికి సహాయక సామగ్రి ఇందులో పంపాం..’ అని వివరించారు.

(4 / 5)

మరోవైపు టర్కీ, సిరియాలో సంభవించిన భూకంప మృతుల సంఖ్య 4,365కి చేరింది. టర్కీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 2,921 మందికి పెరిగింది. 15 వేల 834 మంది గాయపడ్డారు. మరోవైపు, సిరియాలో ఇప్పటివరకు 1,444 మంది మరణించారు. 3 వేల 411 మంది గాయపడ్డారు.

(5 / 5)

మరోవైపు టర్కీ, సిరియాలో సంభవించిన భూకంప మృతుల సంఖ్య 4,365కి చేరింది. టర్కీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ దేశంలో మరణించిన వారి సంఖ్య 2,921 మందికి పెరిగింది. 15 వేల 834 మంది గాయపడ్డారు. మరోవైపు, సిరియాలో ఇప్పటివరకు 1,444 మంది మరణించారు. 3 వేల 411 మంది గాయపడ్డారు.(REUTERS)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు