Turkey Earthquake death toll : టర్కీలో భూకంపానికి అసలు కారణం ఇదే- 4వేల మంది బలి!-in pics thousands killed in turkey earthquake why was it so severe know the reason ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Turkey Earthquake Death Toll : టర్కీలో భూకంపానికి అసలు కారణం ఇదే- 4వేల మంది బలి!

Turkey Earthquake death toll : టర్కీలో భూకంపానికి అసలు కారణం ఇదే- 4వేల మంది బలి!

Published Feb 07, 2023 08:03 AM IST Sharath Chitturi
Published Feb 07, 2023 08:03 AM IST

  • Turkey Earthquake death toll : టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం ఘటనలో మృతుల సంఖ్య 4000 దాటింది! మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారి. కాగా.. టర్కీలో భూకంపానికి అసలు కారణంపై శాస్త్రవేత్తలు స్పందించారు.

వరుస భూకంపాలతో సోమవారం టర్కీ అల్లాడిపోయింది. అక్కడి విషాదకర దృశ్యాలు చూసి ప్రపంచ దేశాలు కన్నీరు పెట్టుకున్నాయి. భూకంపం ఘటనలో మృతుల సంఖ్య 4వేలను దాటింది.

(1 / 5)

(AFP)

భూకంపం ధాటికి అనేక నగరాల్లో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. తమ వారి ఆచూకీ కోసం ప్రజలు విలపిస్తున్నారు. 

(2 / 5)

(AP)

భూకంపం సమయంలో భవనాలు పేకమేడల్లాగా కుప్పకూలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఇక టర్కీకి సహాయాన్ని అందించేందుకు భారత్​ సహా అనేక దేశాలు ముందుకొచ్చాయి. తమ బృందాలను వెంటనే టర్కీకి పంపించాయి.

(3 / 5)

టర్కీ భూకంపం తీవ్రతకు అసలు కారణం "ఈస్ట్​ ఆంటోలియన్​ ఫాల్ట్​" అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సోమవారం ఈ ఫాల్ట్​ మీద, భూమికి 18కి.మీల లోతను భూకంపం సంభవించిందని వివరించారు. అక్కడి నుంచి ప్రకంపనలు మొదలై.. ఈశాన్య టర్కీ, సిరియావైపు రేడియేట్​ అయినట్టు స్పష్టం చేశారు. 

(4 / 5)

ఈస్ట్​ ఆంటోలియన్​ ఫాల్ట్​ అనేది ఒక స్ట్రిప్​- స్లిప్​ ఫాల్ట్​. ఈ సాలిడ్​ రాక్​ ప్లేట్స్​ ఒకటికి మరొకటి నిలువుగా అతకించినట్టు ఉంటాయి. అవి కదలడం మొదలుపెడితే భూప్రకంపనలు ప్రారంభమవుతాయి. చివరికి వాటిల్లో ఒకటి అడ్డంగా పడిపోవడంతో కారణంగా భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సోమవారం టర్కీలోనూ ఇదే జరిగిందని శాస్త్రేవేత్తలు స్పష్టం చేశారు. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు