తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Earthquake In Lucknow : లక్నోలో భూకంపం.. అందరు నిద్రపోతుండగా..!

Earthquake in Lucknow : లక్నోలో భూకంపం.. అందరు నిద్రపోతుండగా..!

Sharath Chitturi HT Telugu

20 August 2022, 9:29 IST

google News
    • Earthquake in Lucknow : ఉత్తర భారతంలో ఇటీవలి కాలంలో భూకంపాల ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లక్నోలో సైతం శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.
ఉత్తర్​ప్రదేశ్​లో భూకంపం
ఉత్తర్​ప్రదేశ్​లో భూకంపం (Twitter/ National Center for Seismology)

ఉత్తర్​ప్రదేశ్​లో భూకంపం

Earthquake in Lucknow : ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లక్నోలో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేషనల్​ సెంటర్​ ఫర్​ సీస్మోలాజీ ప్రకారం.. రిక్టార్​ స్కేలుపై భూకంపం తీవ్రత 5.2గా నమోదైంది. భూమి నుంచి 82 కిలోమీటర్ల దిగువన భూప్రకంపనలు నమోదయ్యాయి. లక్నోలోని ఉత్తర- ఈశాన్య ప్రాంతాల్లో భూమి కంపించింది.

లక్నో భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.

శనివారం 1:12 గంటలకు లక్నో భూకంపం నమోదైంది.

Lucknow earthquake : ఉత్తర భారతంలో ఈ మధ్య కాలంలో భూప్రకంపనలు పెరిగిపోతున్నాయి! ఒక రోజు ముందే.. అంటే శుక్రవారమే ఉత్తరాఖండ్​లోని పితోర్​గఢ్​ ప్రాంతంలో భూమి కంపించింది. భూ ప్రకంపనలు రిక్టార్​ స్కేలుపై 3.6గా నమోదయ్యాయి. మిట్ట మధ్యాహ్నం భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.

జమ్ముకశ్మీర్​లోనూ 3.1 మ్యాగ్నిట్యూడ్​తో భూకంపం సంభవించింది.

తీవ్రత ఆధారంగా..

2.0- అంతకన్నా తక్కువ తీవ్రతతో కూడిన భూకంపాన్ని మైక్రో ఎర్త్​క్వేక్​ అని పిలుస్తారు. వాటిని గుర్తించడం కష్టం. తీవ్రత.. 3-3.9 మధ్యలో ఉంటే.. మైనర్​ ఎర్త్​క్వేక్​ అని అంటారు. 4-4.9 మధ్యలో తీవ్రత ఉంటే.. లైట్​ ఎర్త్​క్వేక్​ అంటారు. 5-6 తీవ్రత ఉంటే.. ప్రజలకు కాస్త నష్టం జరగవచ్చు. ఇక తీవ్రత 7 దాటితే.. భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆకస్మిక వరదలు..

Dehradun cloudburst : ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్​వాసులు ఉలిక్కిపడ్డారు. డెహ్రాడూన్​ జిల్లాలోని రాయ్​పూర్​లో శనివారం తెల్లవారుజామున భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా వరదలు ఆ ప్రాంతాన్ని ముంచ్చేత్తాయి. రంగంలోకి దిగిన రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం.. సహాయక చర్యలు చేపట్టింది.

ఆకస్మిక వరదల్లో సార్కెట్​ గ్రామం ప్రజలు చిక్కుకుపోయారు. ప్రస్తుతం వారిని రక్షించేందుకు సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి.

మరోవైపు.. భారీ వర్షాలతో జమ్ముకశ్మీర్​లో మాతా వైష్ణోదేవి ఆలయం వద్ద ఆకస్మిక వరదలు సంభవించాయి. ఫలితంగా భక్తుల దర్శనాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం.

"ఆకస్మిక వరదల కారణంగా.. వైష్ణోదేవీ ఆలయ దర్శనాన్ని నిలిపివేశాము. భక్తులను కాట్రా వద్దే ఆపేస్తున్నాము. భక్తుల రక్షణే ఇప్పుడు ప్రథమం. పోలీసులు, సీఆర్​పీఎఫ్​ సభ్యులు నిత్యం శ్రమిస్తున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు," అని అధికారులు వెల్లడించారు.

జులైలో.. అమర్​నాథ్​ గుహల వద్ద ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.

తదుపరి వ్యాసం