Nepal Earthquake : నేపాల్‌లో భూకంపం.. బిహార్‌లో ప్రకంపనలు
31 July 2022, 13:20 IST
- Nepal Earthquake : నేపాల్‌లో 5.5 తీవ్రతతో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. బిహార్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి.
నేపాల్‌లో భూకంపం.. బిహార్‌లో ప్రకంపనలు
Nepal Earthquake : ఆదివారం ఉదయం సంభవించిన భూకంపంతో నేపాల్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. రిక్టార్ స్కేల్‌పై 5.5 తీవ్ర నమోదైంది.
రాజధాని ఖాట్మాండుకు 147కిలోమీటర్ల దూరంలో.. ఉదయం 8:13 గంటలకు భూకంపం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
కానీ నేపాల్‌లో భూకంపాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. 2015 ఏప్రిల్ 25న సంభవించిన భూకంపాన్ని ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. ఖాట్మాండు- పోఖారా మధ్యలో రికార్ట్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ఘటనలో 8,964మంది ప్రాణాలు కోల్పోయారు. 22వేల మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.
ఆ తర్వా త కూడా నేపాల్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి.
బిహార్‌లో ప్రకంపనలు..
Bihar earthquake today : ఆదివారం నేపాల్‌లో భూకంపం సంభవించగా.. ఆ ప్రకంపనలు బిహార్ వరకు వచ్చాయి. బిహార్‌లోని ఉత్తర భాగంలో ఆదివారం ఉదయం 8గంటల ప్రాంతంలో భూమి కంపించింది.
దర్భంగ, సుపౌల్, కిషన్‌గంజ్, కతిహార్, సితామర్హి, సమస్తపూర్, బిగిసార, ముజఫర్‌పూర్, అరారియా ప్రాంతాల్లోని ప్రకంపనలు వచ్చాయి. ప్రకంపనల ధాటికి.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Earthquake today Darbhanga : "ఉదయం 8గంటలకు నేను పేపర్ చదువుతున్నాను. ఒక్కసారిగా భూమి కంపించినట్టు అనిపించింది. బల్బ్‌కు ఊగింది. నా కుటుంబసభ్యులను తీసుకుని బయటకు పరుగులు తీశాను. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది," అని కిషన్‌గంజ్ నివాసి ఒకరు వెల్లడించారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.