తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Acid Attack : ‘బట్టలు సరిగ్గా వేసుకోకపోతే యాసిడ్​ పోస్తా’- మహిళను బెదిరించి..

Bengaluru acid attack : ‘బట్టలు సరిగ్గా వేసుకోకపోతే యాసిడ్​ పోస్తా’- మహిళను బెదిరించి..

Sharath Chitturi HT Telugu

11 October 2024, 12:29 IST

google News
    • Nikith Shetty Etios : బెెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి, ఓ మహిళను బెదిరించాడు. “బట్టలు సరిగ్గా వేసుకోకపోతే యాసిడ్​ దాడి చేస్తాను,” అని మహిళ భర్తకు మెసేజ్​ చేశాడు. ఆ వ్యక్తి పని చేస్తున్న కంపెనీకి ఈ విషయం తెలిసి, అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.
నికిత్​ శెట్టి
నికిత్​ శెట్టి

నికిత్​ శెట్టి

బెంగళూరులో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. బట్టలు సరిగ్గా వేసుకోవాలని, లేకపోతే ముఖం మీద యాసిడ్​ పోస్తానని ఓ వ్యక్తి బెదిరించాడు. చివరికి అతను తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు.

ఇదీ జరిగింది..

ఎటియోస్ సర్వీసెస్ మాజీ ఉద్యోగి నికిత్ శెట్టి ఓ మహిళ దుస్తుల ఎంపికపై స్పందిస్తూ ఈ బెదిరింపునకు పాల్పడ్డాడు! ఈ విషయంపై మహిళ భర్త, జర్నలిస్ట్ షాబాజ్ అన్సార్ షేర్ చేసిన ఈ ట్వీట్ సోషల్​ మీడియాలో వెంటనే వైరల్​ అయ్యింది. నెటిజన్లు సంబంధిత వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తున్నారు.

ముఖ్యంగా కర్ణాటకలో తన భార్యకు తగిన దుస్తులు ధరించమని చెప్పాలని, లేదంటే ఆమె ముఖంపై యాసిడ్ పోస్తానని నికిత్ పంపిన సందేశం స్క్రీన్​షాట్​ని షాబాజ్ పోస్ట్​ చేశాడు.

ఆ ట్వీట్​ని ఇక్కడ చూడండి:

హింసాత్మక బెదిరింపుతో అప్రమత్తమైన మహిళ భర్త వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసి, ఎటువంటి హాని జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. బెంగళూరు పోలీసులు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్​లను ట్యాగ్ చేస్తూ షాబాజ్ ట్వీట్ చేశారు.

'మా ఉద్యోగి నికిత్ శెట్టి మరో వ్యక్తి దుస్తుల ఎంపిక గురించి బెదిరింపు ప్రకటన చేసిన సంఘటన మాకు చాలా బాధ కలిగించింది. ఈ ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. ఎటియోస్ సర్వీసెస్​లో మేము పాటించే ప్రధాన విలువలకు ఇది విరుద్ధం," అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం సంబంధిత వ్యక్తిని ఉద్యోగంలో నుంచి తొలగించిది.

ఎక్స్ యూజర్లు ఎలా రియాక్ట్ అయ్యారు?

తన ఇన్​స్టాగ్రామ్ డిస్​ప్లే పిక్చర్​లో ఎలాంటి బట్టలు లేకుండా ఉన్న సమయంలో శెట్టి ఒక మహిళ దుస్తుల గురించి ఫిర్యాదు చేయడం కపటత్వాన్ని ఎత్తిచూపుతోందని ఎక్స్​లో యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఓ దేవుడా, ఈ దేశం నాశనమైంది,' అని ఒక యూజర్ కామెంట్ చేయగా, 'అతన్ని వెంటనే అరెస్టు చేయాలి,' అని మరికొందరు డిమాండ్ చేశారు.

హత్యా బెదిరింపులు, హింసాత్మక బెదిరింపులు చేయడం తీవ్రమైన నేరమని పలువురు.. పరిస్థితి తీవ్రతను ఎత్తిచూపారు. కొందరు మరో అడుగు ముందుకేసి, ఇలాంటి ప్రవర్తన తీవ్రస్థాయి ప్రమాదాన్ని సూచిస్తుందని చెప్పుకొచ్చారు. ఒక యూజర్ ‘అతను రేపిస్ట్ కావచ్చు,’ అని పేర్కొన్నారు. దీనిపై అధికారులు సత్వర చర్యలు తీసుకుని దర్యాప్తు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.

ఉద్యోగానికి వెళుతూ..

బెంగళూరులో ఇటీవలే జరిగిన మరో ఘటన వార్తలకెక్కింది. బెంగళూరులో ఒక ప్రైవేటు సంస్థలో చిరుద్యోగం చేస్తున్న ఒక యువతి బీఎంటీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. బీఎంటీసీ బస్సు ఢీ కొని కింద పడిపోయిన ఆ యువతిపై నుంచి వెనుక నుంచి వేగంగా వస్తున్న క్యాబ్ వెళ్లింది. క్యాబ్ కింద చిక్కుకుపోయిన ఆ యువతిని క్యాబ్ దాదాపు 40 అడుగులు లాక్కు వెళ్లింది. ఈ ఘటనలో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం