Zomato : మాల్​లో 'జొమాటో సీఈఓ'కి నో- ఎంట్రీ.. మానవత్వం ఉండాలని ట్వీట్​! అసలేం జరిగిందంటే..-zomatos deepinder goyal hits out at malls says need to be more humane ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Zomato : మాల్​లో 'జొమాటో సీఈఓ'కి నో- ఎంట్రీ.. మానవత్వం ఉండాలని ట్వీట్​! అసలేం జరిగిందంటే..

Zomato : మాల్​లో 'జొమాటో సీఈఓ'కి నో- ఎంట్రీ.. మానవత్వం ఉండాలని ట్వీట్​! అసలేం జరిగిందంటే..

Sharath Chitturi HT Telugu
Oct 07, 2024 10:08 AM IST

Deepinder Goyal Zomato : జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ అక్టోబర్ 6, ఆదివారం ఒక రోజు డెలివరీ పార్ట్​నర్​గా పని చేసి, తన అనుభవాన్ని సోషల్​ మీడియాలో పంచుకున్నారు. మాల్స్​లో డెలివరీ బాయ్స్​ కష్టాలను ఆయన లేవనెత్తారు.

జొమాటో సీఈఓ దీపిందర్​ గోయల్​..
జొమాటో సీఈఓ దీపిందర్​ గోయల్​..

భారత దేశ అతిపెద్ద ఫుడ్​టెక్​ కంపెనీ జొమాటో సీఈఓ దీపిందర గోయల్​ అక్టోబర్​​ 6న డెలివరీ బాయ్​గా మారిన విషయం తెలిసిందే. రెస్టారెంట్స్​ నుంచి ఆర్డర్స్​ కలెక్ట్​ చేసుకుని, ఆయన సొంతంగా కస్టమర్స్​కి డెలివరీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక మాల్​లో డెలివరీ బాయ్​గా తనకు ఎదురైన సంఘటనను సోషల్​ మీడియా వేదికగా తాజాగా పంచుకున్నారు. మాల్స్​లో డెలివరీ బాయ్స్​కి మరిన్ని సౌకర్యాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ జరిగింది..

జొమాటో సీఈఓ దీపిందర్​ గోయల్ ఎక్స్​లో ఓ వీడియో షేర్​ చేశారు. డెలివరీ బాయ్​గా తన రెండో డెలివరీ కోసం ఆయన గురుగ్రామ్​లోని ఓ మాల్​కి వెళ్లడం ఆ వీడియోలో ఉంది.

మాల్​లో డెలివరీ బాయ్స్​ లిఫ్ట్​ని వాడటానికి అనుమతి లేదని దీపిందర్​ గోయల్​ వీడియో ద్వారా తెలిసింది. ఆయన స్వయంగా మూడు ఫ్లోర్​లు నడుచుకుంటూ పైన ఉన్న రెస్టారెంట్​కి వెళ్లారు. ఆ తర్వాత కూడా.. డెలివరీ బాయ్స్​ వెయిటింగ్​ కోసం సరైన సౌకర్యాలు లేవని ఆయనకు అర్థమైంది. వాస్తవానికి మూడో ఫ్లోర్​క వెళ్లినా, మాల్​లోకి డెలివరీ బాయ్స్​కి ఎంట్రీ లేదని ఆయన తెలుసుకున్నారు. మెట్ల దగ్గరే నేల మీద కూర్చుని ఉన్న ఇతర డెలివరీ పార్ట్​నర్స్​తో ఆయన సంభాషించారు.

ఈ సంఘటనను తన పోస్ట్​లో ప్రస్తావించారు జొమాటో సీఈఓ.

"నా రెండొవ ఆర్డర్ సమయంలో ఓ సంఘటన ఎదురైంది. డెలివరీ పార్ట్​నర్స్​ వర్కింగ్​ పరిస్థితులను మెరుగుపరచాలని ఆ సంఘటనతో నాకు అర్థమైంది. ఈ విషయంపై మాల్స్​తో కలిసి పనిచేయాలి. మాల్స్ కూడా డెలివరీ భాగస్వాముల పట్ల మరింత మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది,' అని ఎక్స్​లో గోయల్​ పోస్ట్​ చేశారు.

జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్, ఆయన భార్య గ్రేసియా మునోజ్ గురుగ్రామ్​లో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్​గా బాధ్యతలు చేపట్టారు. డెలివరీ పార్ట్​నర్స్​, కస్టమర్స్​ నుంచి విలువైన ఫ్యీడ్​బ్యాక్​ తీసుకున్నారు!

గోయల్​ని చూసి నేర్చుకో..!

ఓలా ఎలక్ట్రిక్​ సర్వీస్​ విభాగాన్ని విమర్శిస్తూ ప్రముఖ స్టాండప్​ కమీడియన్​ కునాల్​ కమ్రా ట్వీట్​ చేయడం, దానిపై సంస్థ సీఈఓ భవిష్​ అగర్వాల్​ అగ్రెసివ్​గా స్పందించడంతో ఈ వార్త ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. ఆయన ఎంచుకున్న పదాలను నెటిజన్లు తప్పుపడుతున్నారు. జొమాటో సీఈఓ దీపిందర్​ గోయల్​ని చూసి నేర్చుకో అని సలహా ఇస్తున్నారు.

"మీరు much@kunalkamra88 చాలా శ్రద్ధ వహిస్తారు కాబట్టి, వచ్చి మాకు సహాయం చేయండి! ఈ పెయిడ్ ట్వీట్ కోసం లేదా మీ విఫలమైన కామెడీ కెరీర్ నుంచి మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ నేను చెల్లిస్తాను! లేదంటే మౌనంగా కూర్చో," అని కునాల్​ కమ్రాపై భవిష్​ అగర్వాల్​ మండిపడ్డారు.

భవిష్​ అగర్వాల్​ వర్సెస్​ కునాల్​ కమ్రా వ్యవహారంపై పూర్తి వివరాలు తెలుసుకనేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఈ వ్యవహారంపై నెటిజన్ల కామెంట్లు ఇలా ఉన్నాయి.

"భారతదేశంలో ఒక ధనిక వ్యాపారవేత్తగా, ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్ వంటి ప్రాడక్ట్​తో బహిరంగంగా అహంకారంగా ఉండటం ఎంత ఖరీదైనదో భవీష్ అగర్వాల్ త్వరలోనే నేర్చుకుంటారు," అని ఎక్స్ యూజర్ ఒకరు అభిప్రాయపడ్డారు.

జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తన వారాంతాన్ని ఎలా గడిపారో హైలైట్ చేస్తూ మరో ఎక్స్ యూజర్ ఈ పోస్ట్​పై స్పందించారు. “గోయల్ తన భార్య గ్రేసియా మునోజ్​తో కలిసి సిగ్నేచర్ జొమాటో రెడ్ యూనిఫామ్​ ధరించి డెలివరీ పార్టనర్​గా వ్యవహరించారు. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్​ల పని పరిస్థితులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి, మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. గోయల్​ని చూసి నేర్చుకో,” అని మరొకరు వ్యాఖ్యానించారు.

Whats_app_banner

సంబంధిత కథనం