Zomato Shares : 2 ఏళ్లలో 369 శాతం రాబడి ఇచ్చిన జొమాటో షేర్లు.. ఇప్పుడు కొనుగోలు చేయడం తెలివైన పనేనా?-zomato share 369 percentage gains in 2 years should you buy more or book profit heres what experts say ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato Shares : 2 ఏళ్లలో 369 శాతం రాబడి ఇచ్చిన జొమాటో షేర్లు.. ఇప్పుడు కొనుగోలు చేయడం తెలివైన పనేనా?

Zomato Shares : 2 ఏళ్లలో 369 శాతం రాబడి ఇచ్చిన జొమాటో షేర్లు.. ఇప్పుడు కొనుగోలు చేయడం తెలివైన పనేనా?

Anand Sai HT Telugu
Sep 24, 2024 12:20 PM IST

Zomato Shares : జొమాటో షేర్లు లిస్టింగ్ అయినప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్శిస్తు్న్నాయి. అయితే ఈ షేర్లు 2 సంవత్సరాలో మంచి రాబడిని అందించాయి. ఈ సమయంలో ఇందులో పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయమేనా? నిపుణులు ఏమంటున్నారు?

జొమాటో షేర్లు
జొమాటో షేర్లు (REUTERS)

జొమాటో ఇష్టమైన ఆహారాన్ని ఒక్క క్లిక్‌తో మన చేతికి అందిస్తోంది. ఆహార ప్రియులకు బాగా కనెక్ట్ అయిన యాప్ ఇది. అలాగే జొమాటో స్టాక్ కూడా మంచి రాబడులను ఇస్తోంది. జొమాటో స్టాక్ మార్కెట్ నుండి గత రెండేళ్లలో 369 శాతం వృద్ధిని సాధించింది. గత సంవత్సరంలోనే 200 శాతం సాధించింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ స్టాక్‌ ప్రతి నెలా గ్రీన్‌లోనే కొనసాగుతోంది. మే నెలలో మాత్రమే స్టాక్ స్వల్ప క్షీణతను చూసింది.

స్టాక్ పెరగడానికి కారణం గత కొన్ని నెలలుగా JP మోర్గాన్, CLSA, జెఫరీస్ వంటి అనేక గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు జోమాటో స్టాక్‌పై తమ టార్గెట్ ధరలను పెంచాయి. కంపెనీ వాణిజ్య వ్యాపారం Blinkitపై సానుకూల అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఇతర వ్యాపారాల్లో కంపెనీ ప్రవేశించడం కంపెనీకి కొత్త ఆదాయాన్ని అందిస్తుందని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి.

ఫుడ్ డెలివరీ నుండి క్విక్ కామర్స్, సినిమా టిక్కెట్ల వరకు జొమాటో నిపుణులు, పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది.

ఆదాయంలో పెరుగుదల

కొన్ని త్రైమాసికాల్లో జొమాటో ఆదాయ వృద్ధి కూడా అద్భుతంగా ఉంది. ఈ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఆదాయం అంతకు ముందు సంవత్సరం రూ.2,597 కోట్ల నుంచి రూ.4,442 కోట్లుగా ఉంది. మార్కెట్ నిపుణుడు అతుల్ పరాఖ్ జోమాటో స్టాక్ టర్న్‌అరౌండ్‌కు బలమైన ఆదాయ వృద్ధి, సానుకూల మొమెంటం, పెట్టుబడిదారులలో ఆశావాదం కారణమని చెప్పారు.

స్టాక్ మార్కెట్ పనితీరు

జొమాటో స్టాక్ ప్రస్తుతం (11.00 AM) NSEలో రూ. 293.90గా ఉంది. గత ఐదు రోజుల్లో ఈ షేరు దాదాపు 8.10 శాతం లాభపడింది. తాజాగా కొంత క్షీణత చూసింది. ఒక నెల వ్యవధిలో ఈ షేరు 13.40 శాతం లాభపడింది. జొమాటో స్టాక్ ఆరు నెలల్లో 61 శాతం, 2024 ఇప్పటి వరకూ 136.27 శాతం లాభపడింది. 52 వారాల గరిష్టం రూ.298.25. 97.75 స్టాక్‌లో 52 వారాల కనిష్టంగా ఉంది.

జొమాటో స్టాక్ ఇటీవల ఒక నెల కన్సాలిడేషన్ దశ నుండి బయటపడింది. దాని ఊపు కొనసాగుతుందని రెలిగేర్ బ్రోకింగ్‌లోని SVP రీసెర్చ్ అజిత్ మిశ్రా చెప్పారు. పెట్టుబడిదారులు రూ.320 లక్ష్యంతో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. స్టాప్ లాస్ రూ.280గా పెట్టాలని చెప్పారు.

దీర్ఘకాలంలో జోమాటో స్టాక్ లాభపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొనుగోలుదారులు షేరు ధరలో కొంత కరెక్షన్ కోసం వేచి ఉండాలని మార్కెట్ నిపుణులు అంటున్నారు. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (RSI) 69.2 వద్ద ఉంది. ఇది పెరుగుతున్న కొనుగోళ్ల ఊపును సూచిస్తుంది. ఇది పైకి ట్రెండ్ అవుతోంది.

గమనిక : ఇది నిపుణుల అభిప్రాయం మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. ఇన్వెస్ట్ చేసేముందుకు మీకు తెలిసిన నిపుణులను సంప్రదించండి.