Defence Stocks : ఈ 3 పబ్లిక్ సెక్టార్ స్టాక్‌లపై నిపుణులు చెప్పే సలహాలు ఇవే
Stock Market : పబ్లిక్ సెక్టార్ స్టాక్‌లు కొన్నిసార్లు ఊహించని లాభాలను తెచ్చి పెడుతాయి. మరికొన్నిసార్లు నష్టాలను కూడా చూపిస్తాయి. అయితే మరికొద్ది రోజుల్లో మంచి రాబడి తెప్పించే మూడు డిఫెన్స్ స్టాక్స్ గురించి నిపుణులు సలహా ఇస్తున్నారు. వాటి గురించి ఓసారి ఆలోచించండి.
కొద్ది రోజులుగా రక్షణ రంగ షేర్లు కరెక్షన్‌ను ఎదుర్కొంటున్నాయి. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, బిఇఎంఎల్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అనే మూడు స్టాక్‌లు స్వల్పకాలంలో మంచి రాబడిని అందించగలవని మార్కెట్ నిపుణుడు కునాల్ వి పరార్ చెప్పారు. దానికి కారణం ఏంటో పరిశీలిద్దాం.
గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్
సోమవారం ఎన్‌ఎస్‌ఈలో గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ షేర్లు రూ.1799.95 వద్ద ముగిసింది. గత ఐదు రోజుల్లో ఈ షేరు 2.35 శాతం లాభపడగలిగింది. ఒక నెలలో స్టాక్ కేవలం 2 శాతం మాత్రమే లాభపడింది. ఆరు నెలల్లో 127 శాతం లాభంతో ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించగలిగింది.
టార్గెట్ ధర : రూ. 2,000-2,230, స్టాప్ లాస్: రూ. 1,670
రోజువారీ చార్టులో స్టాక్ మునుపటి కనిష్ట స్థాయిల వద్ద మద్దతును పొందిందని మార్కెట్ నిపుణుడు పరార్ చెబుతున్నారు. ఇది తిరిగి వచ్చే అవకాశాన్ని సూచిస్తుందని అంటున్నారు. గార్డెన్ రీచ్ స్టాక్ దాని 100-రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ (EMA) వద్ద మద్దతును పొందింది. ఇది పుంజుకునే అవకాశాన్ని బలపరుస్తుందని చెప్పారు.
కొచ్చిన్ షిప్‌యార్డ్
కొచ్చిన్ షిప్‌యార్డ్ స్టాక్ ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో రూ.1789 వద్ద ట్రేడవుతోంది. ఐదు రోజుల్లో ఈ షేరు 0.8 శాతం నష్టపోయింది. ఒక నెల క్షీణత 14.20 శాతం. అదే సమయంలో ఆరు నెలల్లో పెట్టుబడిదారులకు 100 శాతం లాభాలను అందించగలిగింది.
టార్గెట్ ధర : రూ. 2,010-2,280, స్టాప్ లాస్: రూ. 1,630
రోజువారీ చార్ట్‌లో కొచ్చిన్ షిప్‌యార్డ్ స్టాక్ 200-రోజుల మూవింగ్ యావరేజ్‌తో బలమైన మద్దతుతో ట్రేడవుతోంది. ఇది రీబౌండ్‌ను సూచిస్తుంది. 61.80 శాతం ఫిబొనాక్సీ రీట్రేస్‌మెంట్ స్థాయిలో స్టాక్‌కు బలమైన మద్దతు ఉంది. రోజువారీ మొమెంటం సూచిక RSI డౌన్‌ట్రెండ్ లైన్ నుండి బయటపడింది. ఇది స్టాక్‌కు సానుకూల మొమెంటాన్ని సూచిస్తుందని కునాల్ వి పరార్ చెప్పారు.
బీఈఎంఎల్
BEML షేర్ ప్రస్తుత ధర NSEలో రూ. 3,831.75. గత ఒక నెలలో, స్టాక్ 2.16 శాతం క్షీణతను ఎదుర్కొంది. స్టాక్ 2024లో ఇప్పటివరకు 34 శాతం లాభపడగలిగింది.
టార్గెట్ ధర : రూ. 3,890-4,150, స్టాప్ లాస్: రూ. 3,540
BEML స్టాక్ రోజువారీ చార్ట్‌లో దాని 200-రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌లో మద్దతుని పొందింది. ఇది తిరిగి వచ్చే అవకాశాన్ని సూచిస్తుందని పరార్ పేర్కొన్నారు.
గమనిక : ఇది కేవలం నిపుణుల అభిప్రాయం మాత్రమే. పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది.