తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Green Card : అమెరికా వర్సిటీల్లో చదువు పూర్తి చేస్తే.. ఇక ఆటోమెటిక్​గా గ్రీన్​ కార్డ్​!

US green card : అమెరికా వర్సిటీల్లో చదువు పూర్తి చేస్తే.. ఇక ఆటోమెటిక్​గా గ్రీన్​ కార్డ్​!

Sharath Chitturi HT Telugu

21 June 2024, 7:31 IST

google News
  • Donald Trump US green card : అమెరికాలో గ్రీన్​ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ సమయంలో.. అమెరికా ఇమ్మిగ్రేషన్​ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​!

ఇక ఆటోమెటిక్​గా గ్రీన్​ కార్డ్​లు!
ఇక ఆటోమెటిక్​గా గ్రీన్​ కార్డ్​లు!

ఇక ఆటోమెటిక్​గా గ్రీన్​ కార్డ్​లు!

US green card application : అమెరికాలో గ్రీన్​ కార్డుల కోసం ఎదురుచూస్తున్న విదేశీయుల సంఖ్య ప్రతి యేటా విపరీతంగా పెరిగిపోతోంది. యూఎస్​ పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మందికి నిరాశ ఎదురవుతోంది. ఈ వ్యవహారం.. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కేంద్రబిందువుగా మారింది. ఈ నేపథ్యంలో.. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికెన్​ పార్టీ నేత డొనాల్డ్​ ట్రంప్​ కీలక్​ వ్యాఖ్యలు చేశారు. అమెరికా వర్సిటీల నుంచి గ్రాడ్యుయేట్​ అయిన వెంటనే.. విదేశీ విద్యార్థులకు ఆటోమెటిక్​గా​ గ్రీన్​ కార్డ్​లు ఇవ్వాలని భావిస్తున్నట్టు ట్రంప్​ పేర్కొన్నారు. ఈ మేరకు.. ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

రూటు మార్చిన ట్రంప్​.. ఎందుకు?

"బెస్ట్​, బ్రైటెస్ట్​" ఉద్యోగులను కంపెనీలు ఇంపోర్ట్​ చేసుకునేందుకు ఎలాంటి ప్లాన్స్​ చేస్తున్నారు? అని సంబంధిత 'ఆల్​-ఇన్​' పాడ్​క్యాస్ట్​లో ట్రంప్​ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ట్రంప్​ ఈ విధంగా స్పందించారు.

"కాలేజ్​ నుంచి గ్రాడ్జ్యుయేట్​ అయితే.. మీ డిప్లొమాతో పాటు ఆటోమెటిక్​గా గ్రీన్​ కార్డ్​ పొంది దేశంలో ఉండిపోయే విధంగా నాకు చేయాలని ఉంది. జూనియర్​ కాలేజీలకు కూడా ఇది వర్తిస్తుంది," అని ట్రంప్​ అన్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే.. ఈ వ్యవహారంపై మొదటి రోజే చర్యలు తీసుకుంటానని అన్నారు ట్రంప్​.

Donald Trump on US green card : గతంలో వలసవాదులకు వ్యతిరేకంగా ప్రచారాలు చేసిన ట్రంప్​.. సడెన్​గా యూటర్న్​ తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 'అమెరికా ఫస్ట్​' నినాదంతో ముందుకు వెళ్లే ట్రంప్​.. ఇప్పుడు ఇమ్మిగ్రెంట్స్​కు సానుకూలంగా మాట్లాడుతుండటం ప్రధాన్యత సంతరించుకుంది.

అంతేకాదు.. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ట్రంప్​ నిర్వహిస్తున్న ప్రచారాల్లో ఇమ్మిగ్రేషన్​ కీలకంగా మారింది. ఆయన చెప్పింది నిజమే అయితే.. అమెరికా ఇమ్మిగ్రేషన్​ వ్యవస్థ మరింత విస్తరిస్తుంది. లక్షలాది మందికి లబ్ధి చేకూరుతుంది.

అయితే.. ఇమ్మిగ్రేషన్​ పాలసీలపై సానుకూలంగా మాట్లాడినప్పటికీ.. అక్రమంగా దేశంలోకి వస్తున్న వారిపై విరుచుకుపడ్డారు డొనాల్డ్​ ట్రంప్​. దేశంలో పెరుగుతున్న నేరాలు, ఉద్యోగాల దోపిడి, ప్రభుత్వ వనరుల అక్రమ ఉపయోగానికి ఇలాంటి వారే కారణమని మండిపడ్డారు. అక్రమంగా దేశంలో ఉంటున్న వారు.. అమెరికా రక్తాన్ని పిండేస్తున్నారని, వారిని బహిష్కరించేందుకు తాను చేపట్టే కార్యక్రమంలో దేశంలో అతి పెద్ద విషయంగా మారుతుందని అన్నారు.

Donald Trump latest news : అమెరికాలోకి లీగల్​గా వస్తున్న వారితో తమకు ఇబ్బందులు లేవని, అక్రమంగా వస్తున్న వారే సమస్యగా మారారని ట్రంప్​, రిపబ్లికెన్​ టీమ్​ అనాదిగా చెబుతూ వస్తోంది. కానీ.. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. లీగల్​ ఇమ్మిగ్రేషన్​పైనా ట్రంప్​ కఠినంగా వ్యవహరించారు. ఫ్యామిలీ అధారిత వీసాలు, వీసా లాటరీ ప్రోగ్రామ్​ వంటివి కొన్ని ఉదాహరణలు.

2017లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లల్లోనే.. 'బై అమెరికెన్​- హైయర్​ అమెరికెన్​' (అమెరికా వస్తువులే కొనండి- అమెరికెన్లే పనిలోకీ తీసుకొండి) అంటూ.. ఎగ్జిక్యూటివ్​ ఆర్డర్లు ఇచ్చారు టరంప్​. అమెరికా వర్కర్స్​ని రక్షించేందుకు.. ఉన్నతస్థాయి నైపుణ్యం కలిగిన వారినే తీసుకోవాలని వ్యాపారులకు తేల్చిచెప్పారు.

విదేశీయులకు ఉద్యోగాల కోసం ఇచ్చే హెచ్​1బీ వీసాలను సైతం గతంలో తీవ్రంగా విమర్శించారు అమెరికా మాజీ అధ్యక్షుడు​. తక్కువ జీతానికి వీదేశీయులను తీసుకుంటున్నాయని కంపెనీలపై మండిపడ్డారు.

2024 America presidential elections : కానీ ఇప్పుడు.. యూఎస్​ కాలేజ్​లో చదువు పూర్తి చేస్తే చాలు.. గ్రీన్​ కార్డులు ఇస్తామని ట్రంప్​ చెబుతుండటం సర్వత్రా చర్చకు దారితీసింది.

"ఉన్నత కాలేజీల నుంచి గ్రాడ్జ్యుయేట్​ అయినా, వీసా దొరకకపోవడంతో అమెరికాలో ఉండలేకపోయిన వారి కథలు నాకు తెలుసు. వారు వారి సొంత దేశాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది. వీరిలో ఇండియా, చైనా విద్యార్థులే అధికం. కానీ అలాంటి వారు.. మిలియనీర్లు అవుతారు. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఇలాంటి వారిని కంపెనీలు తీసుకోవాలి. వారు స్మార్ట్​గా ఉండాలి. స్మార్ట్​గా ఉన్నవారినే తీసుకోవాలి," అని ట్రంప్​ అన్నారు.

తదుపరి వ్యాసం