US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..-us layoffs uscis issues guidelines for laid off h 1b visa holders ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Us Layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

HT Telugu Desk HT Telugu
May 15, 2024 04:45 PM IST

US layoffs:2024 లో మేజర్ టెక్ కంపెనీలు సహా దాదాపు అన్ని కంపెనీలు లే ఆఫ్స్ బాట పట్టాయి. ఆదాయం తగ్గడంతో నిర్వహణ ఖర్చులను అదుపులో పెట్టుకోవడం కోసం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అయితే, లే ఆఫ్ తరువాత, 2 నెలల అనంతరం కూడా యూఎస్ లో ఉండేందుకు వీలుగా యూఎస్సీఐఎస్ (USCIS) కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది.

ఉద్యోగం కోల్పోయిన హెచ్ 1 బీ వీసాదారుల ముందున్న ఆప్షన్స్
ఉద్యోగం కోల్పోయిన హెచ్ 1 బీ వీసాదారుల ముందున్న ఆప్షన్స్ (Freepik)

US layoffs: అమెరికాలోని టెక్ ఇమ్మిగ్రేషన్ ఉద్యోగులకు దాదాపు గత ఏడాది కాలంగా కష్ట కాలం కొనసాగుతోంది. గూగుల్, టెస్లా, వాల్మార్ట్, ఆమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రధాన సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగించాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన వలసదారుల అమెరికన్ కలలపై నీళ్లు చల్లాయి. భారతీయులు సహా అమెరికాలోని చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు ప్రత్యామ్నాయాలను కనుగొనడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే, యూఎస్ లో ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లోపు దేశం విడిచి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని తప్పుగా భావించే వారి కోసం యుఎస్సీఐఎస్ (USCIS) కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.

హెచ్ 1బీ వీసాదారులకు ఆప్షన్లు

అనూహ్యంగా తమ ఉద్యోగాన్ని కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులు తమ ముందున్న ఆప్షన్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. జాబ్ పోగానే, 2 నెలల్లోపు దేశం విడిచి వెళ్లాలన్న సాధారణ అపోహలకు విరుద్ధంగా, దేశం విడిచి వెళ్ళడానికి ముందు వారు అన్వేషించడానికి అనేక మార్గాలు ఉన్నాయన్న విషయాన్ని వారు తెలుసుకోవాలి.

60 రోజుల తరువాత కూడా యూఎస్ లో ఉండవచ్చు..

ఈ క్రింద పేర్కొన్న ఎంపికలతో 60 రోజుల గ్రేస్ పీరియడ్ దాటి ఉండవచ్చు:

  • నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు దాఖలు చేయండి.
  • స్టేటస్ సర్దుబాటు కోసం అప్లికేషన్ ఫైల్ చేయండి.
  • ఉద్యోగ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కొరకు దరఖాస్తు చేయండి.
  • యజమానిని మార్చడానికి నాన్ ప్రైవల్ పిటిషన్ లబ్ధిదారుగా ఉండండి.

గ్రేస్ పీరియడ్ తరువాత..

గ్రేస్ పీరియడ్ లో ఈ అప్లికేషన్స్ లో ఒకదాన్ని దాఖలు చేయడం వల్ల వారు తమ మునుపటి వలసేతర హోదాను కోల్పోయినప్పటికీ, అమెరికాలో ఉండేందుకు వీలు కల్పించే అధీకృత స్టేను పొడిగించుకోవచ్చు. కొత్త హెచ్-1బీ పిటిషన్ దాఖలైన వెంటనే అర్హులైన హెచ్-1బీ నాన్ ఇమ్మిగ్రెంట్స్ కొత్త ఉద్యోగి కోసం పనిచేయడం ప్రారంభించవచ్చు. స్టేటస్ అప్లికేషన్ ను సర్దుబాటు చేయడం ద్వారా 180 రోజుల పెండింగ్ స్టేటస్ తర్వాత కొత్త ఆఫర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ కు బదిలీ చేయవచ్చు.

స్టేటస్ మార్పు కోరుతూ దరఖాస్తు

స్టేటస్ మార్పు కోరుతూ నాన్ ఫ్రివోలస్ దరఖాస్తును (non-frivolous application to change status) దాఖలు చేయడం మరొక ఆప్షన్. డిపెండెంట్ స్టేటస్, స్టూడెంట్ స్టేటస్ లేదా విజిటర్ స్టేటస్ కు మారడం ఇందులో ఉంటుంది. సెల్ఫ్-పిటిషన్డ్ ఇమ్మిగ్రెంట్ వీసా పిటిషన్లకు అర్హులైన కార్మికులు స్టేటస్ అప్లికేషన్ సర్దుబాటుకు కూడా ఏకకాలంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పెండింగ్ దరఖాస్తులపై తుది నిర్ణయం వెలువడే వరకు యూఎస్ లో ఉండటానికి, ఈఏడీని పొందడానికి అనుమతి ఉంటుంది. ఎంప్లాయిమెంట్ బేస్డ్ ఇమ్మిగ్రెంట్ వీసా ఉన్నవారు ఏడాది పాటు ఈఏడీకి అర్హత పొందవచ్చు. లే ఆఫ్ ముప్పును ఎదుర్కొంటున్న హెచ్-1బీ వీసాదారులు ఈ ఆప్షన్స్ ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

Whats_app_banner