Google Pixel 9 : గూగుల్​ పిక్సెల్​ 9లో అదిరిపోయే ‘ఏఐ’ ఫీచర్స్​..-google pixel 9 ai features leaked magic composer autofill smart reply know whats coming ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Pixel 9 : గూగుల్​ పిక్సెల్​ 9లో అదిరిపోయే ‘ఏఐ’ ఫీచర్స్​..

Google Pixel 9 : గూగుల్​ పిక్సెల్​ 9లో అదిరిపోయే ‘ఏఐ’ ఫీచర్స్​..

Sharath Chitturi HT Telugu
Apr 19, 2024 11:15 AM IST

Google Pixel 9 features : స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థల మధ్య ప్రస్తుతం ఆర్టిఫీషియల్​ ఇంటెలజెన్స్​ వార్​ నడుస్తోంది. ఇక కొన్ని నెలల్లో లాంచ్​ అయ్యే గూగుల్​ పిక్సెల్​ 9లో అదిరిపోయే ఏఐ ఫీచర్స్​ ఉంటాయని టాక్​ నడుస్తోంది.

గూగుల్​ పిక్సెల్​ 9లో సూపర్​ ఏఐ ఫీచర్స్​..!
గూగుల్​ పిక్సెల్​ 9లో సూపర్​ ఏఐ ఫీచర్స్​..! (Shaurya Tomer/HT Tech> Representative image)

Google Pixel 9 release date : గూగుల్​ పిక్సెల్​ 9పై ఈ మధ్య కాలంలో చాలా లీక్స్​ బయటకు వస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్​లో లాంచ్​ అయ్యే ఈ సిరీస్​లో నాలుగు మోడల్స్​ ఉంటాయని టాక్​ నడుస్తోంది. ఫలితంగా.. స్మార్ట్​ఫోన్​ లవర్స్​లో హైప్​ మరింత పెరిగిపోయింది. ఇక ఇప్పుడు.. ఈ గూగుల్​ పిక్సెల్​ 9పై ఒక వార్త బయటకు వచ్చింది. ఈ గ్యాడ్జెట్​ ఆన్-డివైజ్ ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ ఏఐ ఫీచర్లను సూచించే కొత్త లీక్ చక్కర్లు కొడుతోంది. గెలాక్సీ ఏఐ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్​లో ఒకటిగా నిలవగా.. యాపిల్, గూగుల్ వంటి కంపెనీలు కూడా అత్యాధునిక ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు ఎంతో కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ సంవత్సరం గూగుల్ పిక్సెల్ 9 సిరీస్​కు అధునాతన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను తీసుకురానున్నట్లు రూమర్స్​ వచ్చాయి. రాబోయే గూగుల్ పిక్సెల్​ 9లో మనం ఎలాంటి ఆన్-డివైజ్ ఏఐ ఫీచర్లను ఆశించవచ్చో ఇక్కడ చూద్దాము..

గూగుల్ పిక్సెల్ 9 ఆన్-డివైస్ ఏఐ ఫీచర్లు..

పిక్సెల్ 9 డివైజ్​లో ఊహాజనిత ఏఐ ఫీచర్లను వెల్లడిస్తూ అసెంబుల్ డెబగ్ అనే టిప్​స్టర్ ఒక ఎక్స్ (ట్విట్టర్​) పోస్ట్​ను షేర్​ చేశాడు. పిక్సెల్ 9 సిరీస్ మెరుగైన ఆన్-డివైజ్ ఏఐ సామర్థ్యాలతో వస్తుందని భావిస్తున్నారు. గూగుల్ ఏఐ కోర్ యాప్ తాజా వెర్షన్, గూగుల్ మెసేజెస్ బీటా నుంచి ఈ ఫీచర్లు వెల్లడయ్యాయి. పిక్సెల్ 9 సిరీస్ ఏఐ ఫీచర్లలో టెక్స్ట్-టు-ఇమేజ్ కన్వర్షన్స్, మ్యాజిక్ కంపోజర్, ఆటోఫిల్ స్మార్ట్ రిప్లై, సారాంశం, ప్రూఫ్ రీడింగ్స్​, టెక్స్ట్ కేటగరైజేషన్​ వంటివి ఉంటాయి. అదనంగా, ఈ ఆన్-డివైజ్ ఏఐ ఫీచర్లు క్లౌడ్ కనెక్షన్​పై ఆధారపడవని తెలుస్తోంది..

Google Pixel 9 pro price in India : ప్రస్తుతం ఇవి రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. లాంచ్ అయ్యే వరకు అనేక మార్పులు జరిగే అవకాశం ఉన్నందున.. డివైజ్ ఈ ఫీచర్​ను సపోర్ట్ చేయగలదా? లేదా? అనేది తెలియరాలేదు. గూగుల్​ పిక్సెల్​ 9లోని ఏఐ ఫీచర్స్​పై ఆ సంస్థ కూడా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ వీటిల్లో చాలా వరకు అమల్లోకి వస్తాయని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం గెలాక్సీ ఎస్ 24 సిరీస్​లో అందుబాటులో ఉన్న కొన్ని గెలాక్సీ ఏఐ ఫీచర్లను.. పిక్సెల్ 9 సిరీస్ సపోర్ట్ చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందువల్ల, సెప్టెంబర్ లేదా అక్టోబర్​లో ప్రముఖ బ్రాండ్లు యాపిల్, గూగుల్ నుంచి వచ్చే ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్స్​లో ఉండే అధునాతన ఏఐ సామర్థ్యాలపై మనకి ఓ క్లారిటీ రావొచ్చు.

Google Pixel 9 latest leaks : యాపిల్ తన ఏఐ ఫీచర్లను జూన్​లో జరిగే డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్​లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఐఫోన్ 16 సిరీస్ అధికారిక లాంచ్.. సెప్టెంబర్​లో జరుగుతుంది. మరోవైపు, గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ అక్టోబర్​లో నాలుగు మోడళ్లతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్స్​లో అందుబాటులో ఉంది! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం.. వాట్సాప్​లో హెచ్​టీ తెలుగు పేజ్​ని ఫాలో అవ్వండి..

Whats_app_banner

సంబంధిత కథనం