Google Pixel 8a : గూగుల్​ పిక్సెల్​ 8ఏ లాంచ్​ త్వరలోనే! ఫీచర్స్​ ఇవే..-google pixel 8a to launch soon specs camera and all details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Pixel 8a : గూగుల్​ పిక్సెల్​ 8ఏ లాంచ్​ త్వరలోనే! ఫీచర్స్​ ఇవే..

Google Pixel 8a : గూగుల్​ పిక్సెల్​ 8ఏ లాంచ్​ త్వరలోనే! ఫీచర్స్​ ఇవే..

Sharath Chitturi HT Telugu
Apr 06, 2024 06:41 AM IST

Google Pixel 8a price : గూగుల్​ పిక్సెల్​ 8ఏ లాంచ్​కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​పై ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

గూగుల్​ పిక్సెల్​ 8ఏ లాంచ్​ డేట్​ ఇదే!
గూగుల్​ పిక్సెల్​ 8ఏ లాంచ్​ డేట్​ ఇదే! (Representative image)

Google Pixel 8a release date : గూగుల్ పిక్సెల్ 8ఏ లాంచ్ దగ్గరపడుతున్న కొద్దీ.. ఈ స్మార్ట్​ఫోన్​ స్పెసిఫికేషన్లు, లాంచ్ వివరాలకు సంబంధించిన వివరాలు ఆన్​లైన్​లో లీక్ అవుతూనే ఉన్నాయి. ఈ గ్యాడ్జెట్​ డిస్​ప్లే, కెమెరా సెటప్, బ్యాటరీ కెపాసిటీ, లాంచ్ టైమ్​లైన్​పై తాజా లీక్స్​ని ఇక్కడ చూసేయండి..

గూగుల్ పిక్సెల్ 8ఏ స్పెసిఫికేషన్లు..

ప్రముఖ టిప్​స్టర్ యోగేష్ బ్రార్ ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 8ఏలో 6.1 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ ఓఎల్​ఈడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ స్మార్ట్​ఫోన్​.. పిక్సెల్ 8 సిరీస్​లో కనిపించే టెన్సార్ జీ3 చిప్​సెట్​ను పోలి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. కెమెరాల పరంగా చూస్తే.. ఇందులో ఓఐఎస్​తో కూడిన 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, సెల్ఫీ- వీడియో కాల్స్​ కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రెంట్ కెమెరా ఉండొచ్చు. పిక్సెల్ 8ఏ స్మార్ట్​ఫోన్​లో 27వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది.

లాంచ్ టైమ్​లైన్- ధర..

Google Pixel 8a launch date in India : పిక్సెల్ 8ఏ స్మార్ట్​ఫోన్​.. మే 14న గూగుల్ ఐ / ఓ 2024 ఈవెంట్​లో లాంచ్​ అవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ధర విషయానికొస్తే, ఇది 500 డాలర్ల నుంచి 550 డాలర్ల మధ్యలో ఉండొచ్చు. అంటే.. భారతదేశంలో సుమారు రూ .41,635 వరకు ఉంటుంది!

ఇదీ చూడండి:- OnePlus Nord CE 4 sale: భారత్ లో వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 సేల్ ప్రారంభం; ధర, ఆఫర్స్ వివరాలు ఇవే

పిక్సెల్ 7ఏతో పోలిక..

లీకైన స్పెసిఫికేషన్లు చూస్తుంటే.. మునుపటి వర్షెన్​ పిక్సెల్ 7ఏ కంటే గూగుల్ పిక్సెల్ 8ఏలో.. గణనీయమైన అప్​గ్రేడ్​లను సూచిస్తున్నాయి. డిస్​ప్లే పీక్ బ్రైట్​నెస్​ 1400 నిట్స్, హెచ్​డీఆర్ సపోర్ట్- టెన్సర్ జీ3 చిప్​సెట్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. మాలీ-జీ 715 జీపీయూ గణనీయమైన మెరుగుదలను చూపిస్తుంది. డిజైన్ పరంగా.. వైజర్ లాంటి కెమెరా స్ట్రిప్, కర్వ్డ్ అంచులు ఉన్నాయి.

Google Pixel 8a price in India : పిక్సెల్ 8ఏ విడుదలకు సిద్ధంగా ఉన్నందున, దీని స్పెసిఫికేషన్లు, ధర, లభ్యత గురించి గూగుల్ నుంచి అధికారిక ధృవీకరణ కోసం స్మార్ట్​ఫోన్​ లవర్స్​ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్మార్ట్​ఫోన్​ మార్కెట్లో గూగుల్ తదుపరి ఆఫర్ ఏమిటనే దానిపై లీక్​లు అంతర్దృష్టిని అందిస్తూనే ఉన్నాయి.

మరి ఈ గూగుల్ పిక్సెల్ 8ఏ క్లిక్​ అవుతుందా? స్మార్ట్​ఫోన్​ ప్రియులను ఆకర్షిస్తుందా? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. లాంచ్​ వరకు ఎదురుచూడాల్సిందే!

ఇంకో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి ఎటువంటి నవీకరణలను మీరు మిస్ కాకుండా ఉండటానికి మమ్మల్ని అక్కడ అనుసరించండి.వాట్సప్ లో హెచ్ టి తెలుగు ఛానల్​ను అనుసరించడండి.

సంబంధిత కథనం