Google Pixel 8 features : గూగుల్​ పిక్సెల్​ 8లో ఉన్న అద్భుతమైన ఫీచర్స్​ ఇవే..!-google pixel 8 is an ai powerhouse check these 8 mindblowing features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Pixel 8 Features : గూగుల్​ పిక్సెల్​ 8లో ఉన్న అద్భుతమైన ఫీచర్స్​ ఇవే..!

Google Pixel 8 features : గూగుల్​ పిక్సెల్​ 8లో ఉన్న అద్భుతమైన ఫీచర్స్​ ఇవే..!

Sharath Chitturi HT Telugu
Oct 06, 2023 01:40 PM IST

Google Pixel 8 features : గూగుల్​ పిక్సెల్​ 8లో కొన్ని క్రేజీ ఫీచర్స్​ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు టెక్​ వర్గాల్లో తెగ చర్చలు జరుగుతున్నాయి. ఆ ఫీచర్స్​పై మీరూ ఓ లుక్కేయండి..

గూగుల్​ పిక్సెల్​ 8లో ఉన్న అద్భుతమైన ఫీచర్స్​ ఇవే..!
గూగుల్​ పిక్సెల్​ 8లో ఉన్న అద్భుతమైన ఫీచర్స్​ ఇవే..! (Google)

Google Pixel 8 features : మచ్​ అవైటెడ్​ గూగుల్​ పిక్సెల్​ 8 వచ్చేసింది. ఈ స్మార్ట్​ఫోన్​ ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది. ఇక ఇప్పుడు.. ఈ మొబైల్​లో వస్తున్న 8 క్రేజీ ఫీచర్స్​ గురించి ఇక్కడ తెలుసుకుందాము..

కాల్​ అసిస్టెంట్​:- ఇది నిజంగానే ఒక కూల్​ ఫీచర్​. మీరు ఎలాంటి కాల్స్​ని పిక్​ చేయాలి, చేయకూడదు.. అన్న విషయాన్ని ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ) చెబుతుంది. కాల్స్​ వస్తే.. దాని అంతట అదే స్క్రీన్​ చేసుకుటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. అవతలి వ్యక్తితో.. మీకన్నా ముందు, ఈ ఏఐ మాట్లాడేస్తుంది!

ఫొటో అన్​బ్లర్​:- ఫొటో క్వాలిటీని పెంచుకునేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఫొటోలు పాతవైనా, కొత్తవైనా, లైటింగ్​ సరిగ్గా లేకపోయినా, ఇతర ఫోన్స్​లో తీసినా.. ఏం పర్లేదు! క్వాలిటీని ఎన్హాన్స్​ చేసుకోవచ్చు. కెమెరా షేక్​ అయినప్పుడు తీసిన ఫొటోలను కూడా దీనితో కరెక్ట్​ చేసుకోవచ్చు. బ్లర్​గా ఉన్న ఇమేజ్​లను అప్లోడ్​ చేస్తే చాలు.. ఈ ఫీచర్​ దాని పని అది మొదలుపెడుతుంది. రిజల్ట్​ని మీకు చూపిస్తుంది. అప్పుడు కూడా అవసరమైన అడ్జెస్ట్​మెంట్స్​ చేసుకోవచ్చు. ఆ తర్వాత డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

బెస్ట్​ టేక్​:- గూగుల్​ పిక్సెల్​ 8లోని ఈ ఫీచర్​.. వివిధ ఫొటోల నుంచి ఎక్స్​ప్రెషన్స్​ని తీసుకుని, ఒక పర్ఫెక్ట్​ గ్రూప్​ ఫొటోను తయాచేస్తుంది. ఇందులోనూ ఏఐ పని ఉంటుంది. ఉదాహరణకు.. మీకు ఐదుగురు సభ్యుల గ్రూప్​ ఫొటో ఒకటి కావాలి అని అనుకుంటే.. వారికి సంబంధించిన ఐదు వేరువేరు ఫొటోలను అప్లోడ్​ చేస్తే చాలు. గ్రూప్​ ఫొటో వచ్చేస్తుంది!

మ్యాజిక్​ ఎడిటర్​:- ఇందులో కూడా ఏఐ టూల్​ ఉంటుంది. ఫొటో ఎడిటింగ్​ టాస్క్​ను మరింత సింపుల్​ చేసేస్తుంది. సైజ్​, పొజిషన్​ను అడ్జెస్ట్​ చేయడంతో పాటు లైటింగ్​- బ్యాక్​గ్రౌండ్​ని కూడా మార్చుకోవచ్చు.

ఆడియో మ్యాజిక్​ ఎరేసర్​:- ఈ ఫీచర్​తో వీడియోలోని అనవసరమైన ఆడియోను డిలీట్​ చేసేయవచ్చు! పిక్సెల్​ 6లో తొలిసారిగా పరిచయం చేసిన మ్యాజిక్​ ఎరేసర్​ ఫీచర్​తో ఇది పోలి ఉంటుంది.

సమ్మరైజ్​ వెబ్​ పేజ్​:- వివిధ వెబ్​పేజ్​లకు సంబంధించిన సమ్మరీని ఈ ఫీచర్​ ఇస్తుంది. ముఖ్యమైన విషయాలే ఇందులో ఉంటాయి. మీ స్టైల్​కి తగ్గట్టు దీనిని మార్చుకోవచ్చు. కీ పాయంట్స్​, సమ్మరీ, వాదనలు, ఓవరాల్​ వ్యూ వంటివి చూసుకోవచ్చు.

జూమ్​ ఎన్హాన్స్​:- ఈ ఫీచర్​తో మీ ఏ ఫొటోనైనా జూమ్​ చేయవచ్చు. ఫొటోను ఎలాగైనా క్రాప్​ చేసుకోవచ్చు. ఇందులోనూ ఏఐ టూల్​ ఉంటుంది.

జీబోర్డ్​:- గూగుల్​ కీబోర్డ్​ చాలా ఫేమస్​. ఇప్పుడు దీనికి ఏఐ టచ్​ ఇచ్చింది గూగుల్​ సంస్థ. ఏవైనా తప్పులు రాస్తే కరెక్ట్​ చేయడంతో పాటు గజిబిజిగా రాసినా.. దానిని సరిచేస్తూ.. వేరువేరు లైన్లను చూపిస్తుంది. ఈమెయిల్స్​ రాయడానికి, సోషల్​ మీడియా పోస్ట్​లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం