Satya Nadella : గూగుల్‌పై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల ఫైర్..!
Satya Nadella on Google : గూగుల్‌పై సంచలన ఆరోపణలు చేశారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల. గూగుల్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కోర్టు విచారణకు హాజరైన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Satya Nadella on Google : గూగుల్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల. గూగుల్ అన్యాయమైన వ్యూహాలను ఉపయోగించుకోవడం వల్లే సెర్చ్ ఇంజిన్‌గా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యూహాల కారణంగానే.. తమ కంపెనీకి చెందిన 'బింజ్' పోటీలో లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫబెట్పై అమెరికాలో అనేక కేసులు ఉన్నాయి. తాజాగా.. వీటిపై విచారణ జరిగింది. ఇందులో భాగంగా వాషింగ్టన్‌లోని కోర్టుకు హాజరైన మైక్రోసాఫ్ట్ సీఈఓ.. గూగుల్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు.
ఆల్ఫబెట్పై ఉన్న కేసుల్లో ప్రధానమైనది గూగుల్ సెర్చ్ ఇంజిన్. పోటీని, ఇన్నోవేషన్‌ని అణచివేసే విధంగా గూగుల్ చర్యలు తీసుకుందని, ఇది కస్టమర్లకు నష్టం కలిగించిందనేది ప్రధాన ఆరోపణ.
Google vs Microsoft : తమ సెర్చ్ ఇంజిన్ని డీఫాల్ట్ బ్రౌజర్‌గా ఉంచేందుకు స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్ తయారీ సంస్థలతో గూగుల్ ఒప్పందాలు కుదుర్చుకుందని, అందుకే ఆధిపత్యాన్ని చెలాయిస్తోందని సత్య నాదేళ్ల వ్యాఖ్యానించారు.
అయితే ఈ వాదనలను గూగుల్ తరపు న్యాయవాదులు తప్పుపట్టారు. 'మైక్రోసాఫ్ట్ బింజ్ కూడా డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉన్న కంప్యూటర్లు ఉన్నాయి. కానీ చాలా మంది బింజ్ నుంచి గూగుల్‌కి మారిపోయినట్టు డేటా చెబుతోంది. మైక్రోసాఫ్ట్ చేసిన తప్పుల వల్లే బింజ్ హిట్ అవ్వలేదు. దానికి, గూగుల్‌కి సంబంధం లేదు,' అని న్యాయవాదులు వాదనలు వినిపించారు.
మార్కెట్ షేర్ పెరిగిందా..?
Satya Nadella latest news : విచారణలో భాగంగా.. సెర్చ్ ఇంజిన్ విషయంలో ఇరు సంస్థల మార్కెట్ షేరు అంశం ప్రస్తావనకు వచ్చింది.
"కృత్రిమ మేథ కారణంగా బింజ్ ప్రభావం పెరిగిందనేది అవాస్తవం," అని సత్య నాదేళ్ల చెప్పగా.. "చాట్ జీపీటీ వంటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్ కారణంగా సెర్చ్ ఇంజిన్ మార్కెట్లో పోటీ మరింత తీవ్రమైందని," గూగుల్ వాదించింది.
గూగుల్‌పై అవిశ్వాసానికి సంబంధించిన కేసులపై అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జ్ అమిత్ మెహ్తా.. గత నాలుగు వారాలుగా విచారణ జరుపుతున్నారు. సెర్చ్ ఇంజిన్ విషయంలో యాపిల్‌తో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలతో గూగుల్ కుదుర్చున్న ఒప్పందాల చుట్టూ ఈ విచారణ జరుగుతోంది. ఇప్పటికే అనేక మంది కోర్టు ఎదుట హాజరయ్యారు. తాజాగా.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల కూడా వాదనలు వినిపించారు.
Google Anti trust case : 1990 దశకంలో మైక్రోసాఫ్ట్ కూడా ఇలాంటి కేసులో ఎదుర్కొనడం గమనార్హం. నాడు.. విండోస్ సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్స్‌లో డీఫాల్ట్‌గా ఇన్స్టాల్ చేసేందుకు.. అనేక సంస్థలతో మైక్రోసాఫ్ట్ ఒప్పందాలు కుదుర్చుకుందని, వీటి వల్ల ఇతర సంస్థలు అణచివేతకు గురయ్యాయని ఆరోపణలు వచ్చాయి.
సంబంధిత కథనం