Jawan Google Search: గూగుల్‍లో జవాన్ అని సెర్చ్ చేయండి.. స్క్రీన్‍పై సర్‌ప్రైజ్
Jawan Google: జవాన్ చిత్రం సూపర్ సక్సెస్ అవుతుండటంతో గూగుల్ ఓ సర్‌ప్రైజ్ తీసుకొచ్చింది. గూగుల్ సెర్చ్‌లో జవాన్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే స్క్రీన్‍పై ఓ మ్యాజిక్ కనిపిస్తుంది. ఆ వివరాలివే..
Jawan Google: ప్రస్తుతం అంతటా జవాన్ సినిమా ఫీవర్ నడుస్తోంది. బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం గురువారం (సెప్టెంబర్ 7) థియేటర్లలోకి రాగా.. తొలిరోజు భారీ కలెక్షన్లను దక్కించుకుంది. అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది. పాజిటివ్ టాక్‍తో రెండో రోజు కూడా భారీ బుకింగ్స్ జరిగాయి. దీంతో భారీ వసూళ్ల దిశగా జవాన్ ముందుకు సాగుతోంది. జవాన్ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా అదిరిపోవటంతో షారుఖ్ అభిమానులు ఫుల్ సంతోషంగా ఉన్నారు. ఇక జవాన్ సెలెబ్రేషన్లలో ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ కూడా భాగమైంది. గూగుల్ సెర్చ్‌లో జవాన్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే స్క్రీన్‍పై ఓ సర్‌ప్రైజ్ కనిపిస్తుంది. ఆ వివరాలివే..
గూగుల్ సెర్చ్‌లో Jawan అని టైప్ చేసి సెర్చ్ చేస్తే స్క్రీన్‍పై కింది భాగంలో ఓ వాకీటాకీ వస్తోంది. దానిపై క్లిక్ చేస్తే ‘రెడీ’ అని షారుఖ్ వాయిస్ వినిపిస్తోంది. ఆ తర్వాత స్క్రీన్‍పై రెండు పక్కల బ్యాండేజీలు వస్తున్నాయి. మళ్లీ వాకీటాకీపై క్లిక్ చేస్తే మరిన్ని బ్యాండేజీలు వస్తాయి. ఇలా వాకీటాకీపై క్లిక్ చేసుకుంటూ పోతే స్క్రీన్ మొత్తం బ్యాండేజ్ డిజైన్‍తో నింపేయవచ్చు.
ఇలా.. జవాన్ సక్సెస్‍ను గూగుల్ కూడా సెలెబ్రేట్ చేస్తోంది. గూగుల్ సెర్చ్‌లో ఇది అందుబాటులో ఉంది. ఈ సర్‌ప్రైజ్‍ను గూగుల్ ఒక రోజంతా అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. జవాన్ అని తెలుగులో టైప్ చేసినా ఈ ట్రిక్ వస్తోంది.
బాలీవుడ్ కింగ్ షారుఖ్‍ను తమిళ దర్శకుడు అట్లీ చూపించిన తీరు అభిమానులకు తెగ నచ్చేస్తోంది. రెండు రోల్స్, డిఫరెంట్ గెటప్‍ల్లో ఈ చిత్రంలో కనిపించారు షారుఖ్. యాక్షన్ సీక్వెన్సులు అదిరిపోయాయి. మొత్తంగా పక్కా యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షుకలను మెప్పిస్తోంది జవాన్. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్.. జవాన్ చిత్రానికి మరో పెద్ద ప్లస్‍గా నిలిచింది. ఎలివేషన్, యాక్షన్ సీన్లలో అనిరుధ్ బీజీఎం ఆకట్టుకుంది.
జవాన్ చిత్రంలో విలన్‍గా విజయ్ సేతుపతి యాక్టింగ్ అదిరిపోయింది. నయనతార హీరోయిన్‍గా చేయగా.. అతిథి పాత్రలో దీపికా పదుకొణ్ మెరిశారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా ఈ చిత్రంలో క్యామియో రోల్ చేశారు.