Google Pixel 9 series: త్వరలో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్; ఏయే ఫోన్స్ రానున్నాయంటే..?-google pixel 9 series may have 3 smartphones this year check expected features specs and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Google Pixel 9 Series: త్వరలో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్; ఏయే ఫోన్స్ రానున్నాయంటే..?

Google Pixel 9 series: త్వరలో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్; ఏయే ఫోన్స్ రానున్నాయంటే..?

HT Telugu Desk HT Telugu
Mar 30, 2024 08:18 PM IST

Google Pixel 9 series: గూగుల్ ఈ ఏడాది పిక్సెల్ 9 తో సహా మూడు కొత్త పిక్సెల్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ గూగుల్ పిక్సెల్ 9 లైనప్ లో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ఉండవచ్చు.

గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్స్ (ప్రతీకాత్మక చిత్రం) (Google)

Google Pixel 9 series: ఈ సంవత్సరం గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కానున్నాయి. ఒకటి కాదు రెండు కాదు మొత్తం మూడు కొత్త ఫ్లాగ్ షిప్ పిక్సెల్ ఫోన్లను ఈ ఏడాది గూగుల్ విడుదల చేయనుంది. మునుపటిలా కాకుండా, గూగుల్ మూడు వేర్వేరు పిక్సెల్ (Google Pixel) మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా కొనుగోలుదారులకు మరిన్ని ఎంపికలను అందించవచ్చు.

లైనప్ లో మూడు స్మార్ట్ ఫోన్స్

2024 లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లో మొత్తం 3 స్మార్ట్ ఫోన్స్ ను గూగుల్ లాంచ్ చేయనుంది. అవి గూగుల్ పిక్సెల్ 9 (Pixel 9), పిక్సెల్ 9 ప్రో (, Pixel 9 Pro), పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ (Pixel 9 Pro XL). వివిధ ధరల వద్ద ఆప్షన్లతో విస్తృత శ్రేణి వినియోగదారులను తీర్చే దిశగా గూగుల్ కొత్త స్మార్ట్ ఫోన్స్ ఉండనున్నాయని భావిస్తున్నారు. ఈ మూడు ఫోన్లు ఈ ఏడాది ద్వితీయార్థంలో లాంచ్ కానున్నాయి. అయితే, ఈ మోడల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.

డ్యూయల్ వర్సెస్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్స్

గూగుల్ పిక్సెల్ 9 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుందని, ప్రో మోడళ్లలో ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. అదనంగా, ఇది ఫ్లాట్ డిస్ ప్లే, పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా ఆప్షన్ తో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కుడి వైపున పవర్, వాల్యూమ్ బటన్లు ఉండవచ్చు. 6.03 అంగుళాల డిస్ ప్లేతో గూగుల్ పిక్సెల్ 9 ఇతర ఫ్లాగ్ షిప్ ఫోన్ల కంటే చిన్నదిగా ఉండనుంది. పిక్సెల్ 9 సిరీస్ ఫోన్స్ నలుపు రంగు సహా మరిన్ని కలర్ ఆప్షన్లలో లభిస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఇందులో కొత్త టెన్సర్ చిప్ సహా హార్డ్ వేర్ అప్ గ్రేడ్లు ఉండవచ్చని భావిస్తున్నారు.

భారత్ లో ఎప్పుడు?

మరి గూగుల్ ఈ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేస్తుందా?, ఒకవేళ ఇండియాలో లాంచ్ చేస్తే, ఎప్పుడు లాంచ్ చేస్తుంది? వాటి ధర ఎలా ఉంటుందో చూడాలి. సెగ్మెంట్ లోని ప్రత్యర్థుల కన్నా చవకగా అందించగలిగితే, గూగుల్ పిక్సెల్ (Google Pixel) లైనప్ ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించవచ్చు.

Whats_app_banner