iPhone 16 leaks: ఐ ఫోన్ 16 లో స్క్రీన్ సైజ్ పెరుగుతోంది.. ఏఐ కేపబిలిటీ సహా మరికొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్..
iPhone 16 leaks: ప్రతీ సంవత్సరం యాపిల్ లాంచ్ చేసే ఐ ఫోన్ లేటెస్ట్ సిరీస్ స్మార్ట్ ఫోన్ లపై అందరికీ ఆసక్తి ఉంటుంది. కొత్త సిరీస్ లో ఎలాంటి ఫీచర్స్ ఉండబోతున్నాయన్న విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంది. ఐఫోన్ 16 సిరీస్ ఈ ఏడాది చివర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
(1 / 5)
ఆపిల్ 2024 లో విడుదల అయ్యే ఐ ఫోన్ 16 ప్రొ మోడల్స్ లో స్క్రీన్ సైజ్ పెరగవచ్చని ఆపిల్ ప్రొడక్ట్స్ ను విశ్లేషించే రాస్ యంగ్ చెబుతున్నారు. అంటే ఐఫోన్ 16 ప్రోలో 6.3 అంగుళాల డిస్ ప్లే, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ లో 6.9 అంగుళాల డిస్ ప్లే ఉండే అవకాశం ఉంది. వనిల్లా ఐఫోన్ 16 వేరియంట్లలో ప్రస్తుత సైజ్ లే కొనసాగించే అవకాశం ఉంది.(Unsplash)
(2 / 5)
ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లో కృత్రిమ మేథ (AI) సామర్థ్యాలు కూడా ఉండవచ్చు. మునుపటి కంటే ఎక్కువ కోర్స్ కలిగిన న్యూరల్ ఇంజిన్ కలిగిన ఎ 18 చిప్ సెట్ ను ఇందులో అమర్చనున్నట్లు సమాచారం. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ పనులను నిర్వహించడానికి అంకితమైన ఆపిల్ చిప్ సెట్ లలో న్యూరల్ ఇంజిన్ ఒక కీలకమైన భాగం.(Unsplash)
(3 / 5)
91మొబైల్ క్యాడ్ రెండర్ల ప్రకారం, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మాదిరిగానే ఐఫోన్ 16 ప్రో లో కూడా టైటానియం ఫ్రేమ్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇందులో కొత్త క్యాప్చర్ బటన్, పెద్ద యాక్షన్ బటన్ ను చేర్చనున్నారు. ఈ ఐ ఫోన్ 16 సిరీస్ ఫోన్స్ లో పలుచని బెజెల్స్, మరింత కర్వ్డ్ ఎడ్జెస్ ఉండవచ్చు.(Pixabay)
(4 / 5)
వెనీలా ఐఫోన్ 16 మోడళ్లలో ఈ ఏడాది కొత్త కెమెరా లేఅవుట్ వచ్చే అవకాశం ఉంది. వీటిలో వర్టికల్ కెమెరా సెటప్ ను ఉండవచ్చు. స్పేషియల్ వీడియో రికార్డింగ్ వంటి కొత్త సదుపాయాలు ఉండవచ్చు. (Shaurya Tomer/HT Tech)
ఇతర గ్యాలరీలు