Donald Trump convicted : పోర్న్​ స్టార్​ కేసులో దోషిగా తేలిన డొనాల్డ్​ ట్రంప్​..-donald trump found guilty on all 34 counts in new york hush money case ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Donald Trump Convicted : పోర్న్​ స్టార్​ కేసులో దోషిగా తేలిన డొనాల్డ్​ ట్రంప్​..

Donald Trump convicted : పోర్న్​ స్టార్​ కేసులో దోషిగా తేలిన డొనాల్డ్​ ట్రంప్​..

Sharath Chitturi HT Telugu
May 31, 2024 06:19 AM IST

Donald Trump convicted : పోర్న్​ స్టార్​ కేసులో.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ దోషిగా తేలారు. ఆయనపై మోపిన మొత్తం 34 నేరాభియోగాలు నిజమేనని 12 మంది సభ్యులతో కూడిన జ్యూరీ పేర్కొంది.

డొనాల్డ్​ ట్రంప్​..
డొనాల్డ్​ ట్రంప్​.. (AFP)

Donald Trump hush money case : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు మరో షాక్​! పోర్న్​ స్టార్​ స్టార్మీ డేనియల్స్​తో సంబంధం బయటపడకుండా అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారన్న కేసులో.. ట్రంప్​ దోషిగా తేలారు. ఈ మేరకు.. ఆయనపై మోపిన మొత్తం 34 నేరాభియోగాలు నిజమేనని న్యూయార్క్​ జ్యూరీ తీర్పును వెలువరించింది.

ఇంకో 5 నెలల్లో జరగనున్న 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి, తిరిగి అధ్యక్ష పదవి చేపట్టాలని చూస్తున్న డొనాల్ట్​ ట్రంప్​కు.. తాజా తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. సంబంధిత కేసు కోసం మాన్​హాటన్​లోని కోర్టుకు వెళ్లిన ట్రంప్​.. జడ్జి మాటలు వింటూ మౌనంగా ఉండిపోయారు. కానీ.. కోర్టు బయటకు వచ్చి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ప్రభుత్వం తన మీద చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. కోర్టులో కూడా రిగ్గింగ్​ జరిగిందని.. కానీ నవంబర్​లో జరిగే అధ్యక్ష ఎన్నికల అనంతరం ప్రజలే నిజమైన తీర్పును ఇస్తారని ట్రంప్​ వ్యాఖ్యానించారు.

Donald Trump latest news : అమెరికాలో మాజీ అధ్యక్షుడు దోషిగా తేలడం చాలా అరుదైన ఘటన. కానీ.. దోషిగా తేలినప్పటికీ, చట్టాల ప్రకారం ట్రంప్​.. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. పోర్న్​ స్టార్​తో కేసులో ఆయనకు జైలు శిక్ష పడినా.. అధ్యక్ష ఎన్నికల బరిలో దిగొచ్చు.

ఈ కేసుకు సంబంధించి.. జులై 11న కీలక తీర్పును వెలువరించనుంది న్యూయార్క్​ కోర్టు. సరిగ్గా అందుకు కొన్ని రోజుల ముందే.. మిల్వాకీలో రిపబ్లికెన్​ నేషనల్​ కన్వెన్షన్​ జరగనుంది. ఈ ఈవెంట్​లో.. డెమొక్రటిక్​ అభ్యర్థి బైడెన్​పై పోటీకి.. డొనాల్డ్​ ట్రంప్​ని రిపబ్లిక్​ పార్టీ అధికారికంగా ఎంపిక చేసే అవకాశం ఉంది!

మరోవైపు.. పోర్న్​ స్టార్​ కేసులో ట్రంప్​ దోషిగా తేలడంపై బైడెన్​ బృందం స్పందించింది. 'చట్టానికి ఎవరూ అతీతం కాదని రుజువైంది' అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. "ప్రజాస్వామ్యానికి ట్రంప్​ పెను ముప్పుగా మారారు," అని ఆ ప్రకటన వివరించింది.

Donald Trump convicted : పోర్న్​ స్టార్​ హష్​ మనీ కేసులో.. రెండు రోజుల్లో 11 గంటల పాటు చర్చించిన 12 సభ్యుల జ్యూరీ.. చివరికి.. 34 నేరాభియోగాల్లో ట్రంప్​ దోషి అని ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. ఇంతటి ఒత్తిడితో కూడిన కఠినమైన టాస్క్​ని తీసుకున్న జ్యూరీకి.. జస్టిస్​ మెర్చన్​ ధన్యవాదాలు తెలిపారు.

అంతేకాదు.. పోర్న్​ స్టార్​ కేసు ఆద్యంతం.. సంబంధిత జ్యూరీ సభ్యుల ఐడెంటిటీని రహస్యంగా దాచి పెట్టారు! ఇది చాలా అరుదైన విషయం. మాఫియా, హింసపూరిత కేసుల్లోనే ఇలా జరుగుతుంది.

స్టార్మీ డేనియల్స్​తో ట్రంప్​ కేసు ఏంటి?

డొనాల్డ్​ ట్రంప్​ తనతో 2006లో శృంగారంలో పాల్గొన్నట్టు పోర్న్​ స్టార్​ స్టార్మీ డేనియల్స్​ చెప్పారు. అయితే.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఇది మైనస్​ అవుతుందని భావించిన డొనాల్డ్​ ట్రంప్​.. ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ఆమెకు డబ్బులు ఇచ్చినట్టు, సంబంధిత రికార్డులను ధ్వంసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఆరోపణల చుట్టూ ప్రాసిక్యూషన్​ బలమైన కేసును బిల్డ్​ చేసింది! ట్రంప్​ తన నిజమైన వ్యక్తిత్వాన్ని ప్రజల ముందు దాచిపెట్టారని ఆరోపించింది. ట్రంప్​ తరఫు న్యాయవాదులు మాత్రం.. ఈ వాదనను కొట్టిపారేశారు. ఎన్నికలను ప్రభావితం చేయడం అనేది ప్రజాస్వామ్యంలో భాగమని అన్నారు.

Donald Trump |tormy Daniels : కాగా.. పోర్న్​ స్టార్​ స్టార్మీ డేనియల్స్​తో తాను ఎప్పుడూ సెక్స్​ చేయలేదని చెబుతూ వస్తున్నారు ట్రంప్​. కానీ.. అదే విషయాన్ని కోర్టులో టెస్టిఫై చేసేందుకు ముందుకు రాలేదు!

ట్రంప్​ కేసు.. అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం ఎంత?

డొనాల్డ్​ ట్రంప్​ హష్​ మనీ కేసు.. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేస్తుందా? అన్న విషయంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కైథ్​ గడ్డీ స్పందించారు. "ఇదంతా చూసి ప్రజల మనసు మార్చుకోకపోవచ్చు. కానీ కొన్ని స్వింగ్​ స్టేట్స్​లో ఓటర్లు ఆలోచనల్లో పడొచ్చు. ట్రంప్​ మార్జిన్లు ప్రభావితం అవ్వొచ్చు," అని చెప్పుకొచ్చారు.

ఈ కేసుతో పాటు 2020 ఎన్నికల్లో అలజడులు సృష్టించారన్న కేసులోనూ డొనాల్డ్​ ట్రంప్​ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం