Ebrahim Raisi death : ఇరాన్ అధ్యక్షుడు రైసీని ఇజ్రాయెల్ చంపేసిందా?
Iran President Raisi Israel : ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణం వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇందుకు ఓ కారణం.
Iran President Raisi death : హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించారని ఆ దేశ మీడియా ధ్రువీకరించింది. కాగా.. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనే ఆయన హెలికాప్టర్ క్రాష్ అవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనుక.. ఇజ్రాయెల్ హస్తం ఉండి ఉండొచ్చని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇదీ జరిగింది..
అజర్‌బైజాన్‌కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో.. ఇరాన్ అధ్యక్షుడు రైసీ, విదేశాంగశాఖ మంత్రి అమీర్‌తో పాటు పలువురు ఇతర అధికారులు ప్రయాణిస్తున్న బెల్ 212 హెలికాప్టర్.. ఆదివారం సాయంత్రం హార్డ్ ల్యాండింగ్ అయ్యింది. అనంతరం రైసీ గురించి ఎలాంటి సమాచారం వెలువడలేదు. తీవ్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టిన ఇరాన్.. చివరికి.. హెలికాప్టర్ శిథిలాలు ఉన్న చోటకు చేరుకోగలిగింది. అనంతరం.. హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ మరణించారని సోమవారం ధ్రువీకరించింది.
కానీ.. రైసీ తన జీవితం మొత్తం మీద చాలా వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉన్నారు. అందుకే.. ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైసీ మరణం వెనుక కుట్ర ఏదైనా ఉండి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Raisi helicopter crash : "ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ.. హెలికాప్టర్ ప్రమాదం మరణించారు. కానీ దీని వెనుక కుట్ర ఉందని నేను భావిస్తున్నాను. మరి దీనిపై ఇరాన్ దర్యాప్తు చేస్తుందో లేదో చూడాలి. దీని వెనుక ఇజ్రాయెల్ పాత్ర ఉందని నా నమ్మకం," అని ఓ సోషల్ మీడియా యూజర్ చెప్పుకొచ్చారు.
"ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రాక్సీ వార్‌లో రైసీది కీలక పాత్ర. ఎంతో మందిని కిరాతకంగా తొక్కుకుంటూ పైకి వచ్చారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని చంపుకుంటూ వచ్చారు," అని రైసీ గురించి మరో నెటిజన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
రైసీ మరణం తర్వాత బయటకు వచ్చిన ఓ రిపోర్ట్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది.
Iran President Raisi : "వాతావరణం సరిగ్గా లేకపోవడం, వర్షం- మంచు వల్ల విజిబిలిటీ తగ్గిపోవడం, పైలట్ తప్పిదం వల్ల హెలికాప్టర్ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు చెబుతున్నప్పటికీ.. రైసీ మరణం వెనుక కుట్ర కోణం దాగి ఉందని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి," అని ఆ నివేదిక పేర్కొంది.
'మేమేం చేయలేదు..'
ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణం వెనుక తమ హస్తం ఉందన్న ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది. 'మేము కాదు. మేమేం చేయలేదు,' అని ఓ అధికారి స్పష్టం చేశారు.
రైసీ మరణంపై ఇజ్రాయెల్ మీద అనుమానాలు వ్యక్తం అవ్వడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. ఈ రెండు దేశాల మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు.
Iran President Raisi Israel : పైగా.. ఇరాన్ ఉన్నతాధికారులను హత్య చేసిన హిస్టరీ ఇజ్రాయెల్ సొంతం. అనేక ఇరానీయన్ మిలిటరీ అధికారులు, న్యూక్లియర్ సైంటిస్ట్లను ఇజ్రాయెల్ చంపిందని ఊహాగానాలు ఉన్నాయి.
అయితే.. ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో ఇజ్రాయెల్ హస్తం ఉందంటూ.. ఇప్పటికైతే ఎలాంటి అధారాలు వెలువడలేదు.
సంబంధిత కథనం