Iran President : హెలికాప్టర్​లో ప్రయాణం.. ఆరోగ్యానికి హానికరం! నాడు సంజయ్​ గాంధీ- నేడు రైసీ..-irans president raisi died list of prominent leaders killed in helicopter crashes ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iran President : హెలికాప్టర్​లో ప్రయాణం.. ఆరోగ్యానికి హానికరం! నాడు సంజయ్​ గాంధీ- నేడు రైసీ..

Iran President : హెలికాప్టర్​లో ప్రయాణం.. ఆరోగ్యానికి హానికరం! నాడు సంజయ్​ గాంధీ- నేడు రైసీ..

Sharath Chitturi HT Telugu
May 20, 2024 12:48 PM IST

Iran president helicopter crash : హెలికాప్టర్​ ప్రమాదంలో ఇరాన్​ అధ్యక్షు రైసీ మరణించారు. ఇలా జరగడం ఇది తొలిసారి కాదు! హెలికాప్టర్​ ప్రమాదాల్లో మరణించిన పలువురు ప్రముఖ రాజకీయ నేతల వివరాలను ఇక్కడ చూడండి..

నాడు సంజయ్​ గాంధీ.. నేడు రైసీ! హెలికాప్టర్​ ప్రమదాల్లో ప్రముఖులు మృతి
నాడు సంజయ్​ గాంధీ.. నేడు రైసీ! హెలికాప్టర్​ ప్రమదాల్లో ప్రముఖులు మృతి

Raisi Iran helicopter crash : ఇరాన్​ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంతో హెలికాప్టర్​ ప్రమాదాలు మరోమారు చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచంలో ఏదో ఒక మూల నిత్యం హెలికాప్టర్​ ప్రమాదాలు జరుగుతూనే ఉంటుండటం ఆందోళనకు గురిచేస్తున్న విషయం. ఇలాంటి ప్రమాదాల్లోనే భారత్​తో పాటు పలువురు ప్రముఖ విదేశీ నేతలు గతంలో ప్రాణాలు విడిచారు. వారి వివరాలను ఇక్కడ చూడండి..

1. ఇబ్రహీం రైసీ- ఇరాన్​ అధ్యక్షుడు..

అజర్​బైజాన్​ నుంచి తిరిగొస్తుండగా.. రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్​.. ఆదివారం క్రాష్​ అయ్యింది. వాతావరణం సరిగ్గా లేకపోవడం ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఆదివారం ఈ ప్రమాదం జరగ్గా.. రైసీ మరణించారని సోమవారం ఇరాన్​ వెల్లడించింది.

2. సెబాస్టియన్​ పినేరా- చిలీ మాజీ అధ్యక్షుడు..

Ebrahim Raisi death news : చిలీ దేశ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్​ పినేరా.. ఫిబ్రవరి 2024లో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించారు. దక్షిణ చిలీలోని ఓ చెరువులోకి హెలికాప్టర్​ పడటంతో ఆయన ప్రాణాలు విడిచారు. చిలీ రాజకీయాల్లో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు.

3. మాధవ్​రావ్​ సింథియా- కాంగ్రెస్​ నేత..

భారత దేశ ప్రస్తుతం విమానయానశాఖ మంత్రి జ్యోతిరాథిత్య సింథియా తండ్రి, ప్రముఖ కాంగ్రెస్​ నేత మాధవ్​రావ్​ సింథియా.. 2001 సెప్టెంబర్​ 30న జరిగిన హెలికాప్టర్​ క్రాష్​లో ప్రాణాలు విడిచారు. ఉత్తర్​ ప్రదేశ్​ మెయిన్​పూర్​ల ఉండగా.. ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేట్​ బీచ్​క్రాఫ్ట్​ కింగ్​ ఎయిర్​ సీ90లో మంటలు చెలరేగాయి.

4. మహమ్మద్​ జియా ఉల్​ హక్​- పాకిస్థాన్​ మాజీ అధ్యక్షుడు..

Iran President death latest news : పాకిస్థాన్​ 6వ అధ్యక్షుడు జనరల్​ మహమ్మద్​ జియా ఉల్​ హక్​.. 1998 ఆగస్ట్​లో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న సీ-130 హెర్క్యులిస్​ ఎయిర్​క్రాఫ్ట్​.. బహవల్​పూర్​ నుంచి గాలిలోకి ఎగిరిన కొంత సేపటికే కూలిపోయింది. ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. హెలికాప్టర్​లో లోపాల కారణంగా మరణించారా? లేక ఎవరైనా కావాలనే ఆయన్ని చంపారా? అన్నది ఇప్పటివరకు తెలియరాలేదు.

5. రషీద్​ కరామి- లెబెన్​ మాజీ ప్రధాని..

లెబనాన్​ మాజీ ప్రధాని రషీద్​ కరామీ.. 1987 జూన్​ 1న జరిగిన ప్రమాదంలో మరణించారు. బైరూట్​కు వెళుతుండగా.. హెలికాప్టర్​లో ఉన్న బాంబు పేలుడు జరిగింది.

6. సంజయ్​ గాంధీ- కాంగ్రెస్​ నేత..

Politicans killed in Helicopter crash : భారత దేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తనయుడు, కాంగ్రెస్​ నేత సంజయ్​ గాంధీ.. 1980 జూన్​ 23న జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దిల్లీ సఫ్దార్​జంగ్​ ఎయిర్​పోర్ట్​లో విమానాన్ని నడుపుతుండగా.. అదుపు కోల్పోవడంతో అది క్రాష్​ అయిపోయింది.

7. అబ్దుల్​ సలామ్​ ఆరిఫ్​- ఇరాక్​ మాజీ అధ్యక్షుడు..

ఇరాక్ దేశ​ రెండో అధ్యక్షుడు అబదుల్​ సలామ్​ ఆరిఫ్​.. 1966 ఏప్రిల్​ 13న జరిగిన ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్​ ఫోర్స్​ ప్లేన్​.. బస్రా అనే ప్రాంతంలో క్రాష్​ అయ్యింది. ఆయన సోదరుడు.. అధ్యక్షుడు అయ్యారు.

Whats_app_banner

సంబంధిత కథనం