Iran President Raisi death : హెలికాప్టర్​ ప్రమాదంలో ఇరాన్​ అధ్యక్షుడు రైసీ మృతి-iranian president raisi feared dead as helicopter wreckage found ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iran President Raisi Death : హెలికాప్టర్​ ప్రమాదంలో ఇరాన్​ అధ్యక్షుడు రైసీ మృతి

Iran President Raisi death : హెలికాప్టర్​ ప్రమాదంలో ఇరాన్​ అధ్యక్షుడు రైసీ మృతి

HT Telugu Desk HT Telugu
May 20, 2024 03:16 PM IST

Iranian President Raisi death : ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి చెందారు. హెలికాప్టర్ శకలాలు లభ్యమైన తర్వాత.. అధ్యక్షుడు మృతి చెందినట్టు ఇరాన్​ అధికారికంగా ధృవీకరించింది.

ఇరాన్ అధ్యక్షుడు రైసీ
ఇరాన్ అధ్యక్షుడు రైసీ (REUTERS)

Raisi Iran helicopter : ఇరాన్​ దేశ 8వ అధ్యక్షుడు, 63ఏళ్ల ఇబ్రహీం రైసీ.. ఆదివారం జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు.. ఇరాన్​ విదేశాంగ మంత్రి హొస్సైన్​ ఆమిర్​- అబ్దల్లాహియన్​, పలువురు అధికారులు వీరమణం పొందినట్టు.. ఇరాన్​ స్టేట్​ మీడియా సోమవారం కథనం ప్రచురించింది.

ఇదీ జరిగింది..

రెండు దేశాల మధ్య సంయుక్త ప్రాజెక్టు అయిన కిజ్-ఖలాసి ఆనకట్టను ప్రారంభించడానికి రైసీ.. ఆదివారం అజర్ బైజాన్ సరిహద్దుకు వెళ్లారు. అక్కడి నుంచి.. బెల్​ 212 హెలికాప్టర్​లో ఆయన తిరుగు పయణమయ్యారు. కానీ.. లోయలు, పర్వత ప్రాంతాలు ఉండే జోఫ్లా నగరంలో ఆ హెలికాప్టర్​ 'హార్డ్​ ల్యాండింగ్​' అయ్యింది.

తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్​లోని శిథిలాలను చేరుకోవడానికి సహాయక బృందాలు రాత్రంతా మంచు తుఫాను, క్లిష్టమైన భూభాగాలతో పోరాడాయి. ఈ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైంది. దురదృష్టవశాత్తు, ప్రయాణీకులందరూ మరణించినట్లు మీడియా చెప్పింది.

ఎవరు ఈ ఇబ్రహీం రైసీ..?

Iran President Raisi death : 63 ఏళ్ల రైసీ 2021లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధికారం చేపట్టినప్పటి నుంచి నైతిక చట్టాలను కఠినతరం చేయాలని, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేయాలని, ప్రపంచ దేశాలతో అణు చర్చల్లో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

అయితే.. ఇరాన్​లో అధ్యక్షుడి కన్నా సుప్రీమ్​ లీడర్​కే పవర్స్​ ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత సుప్రీమ్​ లీడర్​ అయతొల్లాహ్​ అలీ ఖమేనీ తర్వాత.. ఆ స్థానాన్ని రైసీ భర్తీ చేయడం ఖాయమని అక్కడి ప్రజలు భావించారు.

రైసీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు.. ఇరాన్​లో అనేక ఆర్థిక సంక్షోభాలు కనిపించాయి. ప్రజల జీవితాలు భారమయ్యాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. ఇరాన్​ కరెన్సీ క్రాష్​ అయ్యింది. ఇరాన్​ పెద్దల ప్రవర్తన కారణంగా.. అప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇరాన్​పై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించిది. ఇవన్నీ.. అక్కడి ప్రజలను చాలా ఇబ్బంది పెట్టాయి.

'బుచర్​ ఆఫ్​ టెహ్రాన్​..'

Ebrahim Raisi latest news : రాజకీయ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే వ్యక్తిగా, నిరసనలపై ఉక్కుపాదం మోపే వ్యక్తిగా ఇరాన్​ అధ్యక్షుడు రైసీకి పేరుంది. అంతేకాదు.. ఈయనకు 'బుచర్​ ఆఫ్​ టెహ్రాన్​'గా కూడా పేరుంది.

1980వ దశకంలో ఇరాన్​లో చెలరేగిన హింస అనంతర పరిణామాల్లో అరెస్ట్​ అయిన వేలాది మంది రాజకీయ ఖైదీలను ఉరి తీయాలని షాకింగ్​ ఆదేశాలిచ్చిన నలుగురు న్యాయమూర్తుల్లో ఈ రైసీ ఒకరు. ఇదే విషయంపై.. 2019లో యూఎస్​ ట్రెజరీ విభాగం రైసీపై ఆంక్షలు కూడా విధించింది.

రైసీ ‘వీరమరణం’ పొందారని ఇరాన్​ స్టేట్​ మీడియా చెబుతున్నా.. ఆయన మృతి చెందిన వార్త విని బాధపడేవారు చాలా తక్కువ మంది ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రధాని మోదీ స్పందన..

Ebrahim Raisi death : ఇరాన్​ అధ్యక్షుడు మృతి పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

“ఇస్లామిక్​ రిపబ్లిక్​ ఆఫ్​ ఇరాన్​ అధ్యక్షుడు డా. సయ్యెద్​ ఇబ్రహీమ్​ రైసీ మరణ వార్త విని షాక్​కు గురయ్యాను. చాలా బాధ కలిగింది. భారత్​- ఇరాన్​ ద్వైపాక్షిక మైత్రి కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుంటుంది,” అని మోదీ.. తన ట్వీట్​లో పేర్కొన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం