తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  అబార్షన్, ఎకానమీ.. ట్రంప్, కమలా హారిస్ తొలి డిబేట్‌లో ఎవరు ఆధిపత్యం వహించారు?

అబార్షన్, ఎకానమీ.. ట్రంప్, కమలా హారిస్ తొలి డిబేట్‌లో ఎవరు ఆధిపత్యం వహించారు?

Anand Sai HT Telugu

11 September 2024, 12:47 IST

google News
    • Donald Trump Kamala Harris First Debate : డోనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ ముగిసింది. ఈ డిబేట్ లో డోనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పోటాపోటీగా మాట్లాడారు. పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ ఇద్దరిలో ఎవరు ఆధిపత్యం సాధించారు?
డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్
డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్

డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్

డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన తొలి డిబేట్ ముగిసింది. నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఈ చర్చ తీవ్ర ప్రభావం చూపనుంది. ట్రంప్, కమలా హారిస్ మధ్య గట్టి పోటీ ఉందని పలు సర్వేలు వెల్లడించాయి. అటువంటి పరిస్థితిలో ఈ చర్చ నిర్ణయాత్మకంగా ఉంటుంది. ఈ డిబేట్ లో కమలా హారిస్, ట్రంప్ పలు అంశాలపై మాట్లాడారు. ఓటర్ల మదిలో మెదిలే అంశాలపై ఇరువురు అభ్యర్థులు తమ వాదనను వినిపించారు.

బైడెన్‌తో ట్రంప్ గతంలో జరిపిన డిబేట్లను కమలా హారిస్ అధిగమించారని డెమొక్రాట్లు చెబుతుండగా, ట్రంప్ మాత్రం ఇదే తనకు జరిగిన అత్యుత్తమ డిబేట్ అని పేర్కొన్నారు. వివిధ అంశాలపై ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు పలు వాదనలు వినిపించాయి.

ఎప్పుడూ కలుసుకోని కమలా హారిస్, ట్రంప్ ఒకరినొకరు ఎలా పలకరించుకుంటారనేది ముందుగా ఆసక్తికరంగా మారింది. పోడియంపై ఉన్న ట్రంప్ దగ్గరకు వెళ్లి చేయి చాచి తనను తాను పరిచయం చేసుకున్నారు కమలా హారిస్. కమలా హారిస్ తనను తాను దూరదృష్టి గల అభ్యర్థిగా అభివర్ణించారు.

చర్చ ప్రారంభ నిమిషాల్లో ట్రంప్, కమలా హారిస్ ఆర్థిక వ్యవస్థపై చర్చించారు. చిన్న స్టార్టప్ లకు గణనీయమైన రుణాలు సహా ఇటీవలి వారాల్లో తాను ప్రారంభించిన ఆర్థిక విధానాలను కమలా హారిస్ వివరించారు. అదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను విదేశీ పోటీ నుంచి కాపాడతానని ట్రంప్ చెప్పారు. కమలా హారిస్ వ్యాఖ్యల అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. వారికి ప్రణాళిక లేదు అని కామెంట్ చేశారు.

అబార్షన్ విషయంలో కూడా ఇద్దరు అభ్యర్థుల మధ్య తీవ్రంగా మాటల యుద్ధం నడిచింది. ఈ అంశంపై కమలా హ్యారిస్‌దే పైచేయి అని పలు సర్వేలు చెబుతున్నాయి. 'అమెరికాను ట్రంప్ మార్చేశారు. అబార్షన్ కు రాజ్యాంగపరమైన రక్షణలను నిలిపివేస్తూ 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. అబార్షన్ కు రాజ్యాంగబద్ధమైన హక్కును డెమొక్రాట్లు ఎప్పటి నుంచో సమర్థిస్తున్నారు.' అని కమలా హారిస్ అన్నారు.

'నేను చాలా బాగా చేశాను. అందుకు ధైర్యం కావాలి. కొన్ని రాష్ట్రాలు పుట్టిన తర్వాత పిల్లలకు అబార్షన్లకు అనుమతిస్తున్నాయి.' అని ట్రంప్ వాదించారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై కమలా హారిస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు కోరుకునేది ఇదేనా అని ఎమర్జెన్సీ గదుల్లో వైద్యం అందడం లేదన్నారు.

తమ శత్రువులను పట్టుకునేందుకు న్యాయశాఖను ఉపయోగించుకున్నారని ట్రంప్, కమలా హారిస్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. తాను రెండోసారి గెలిస్తే శత్రువులపై చర్యలు తీసుకుంటానని ట్రంప్ హామీ ఇచ్చారని కమలా హారిస్ తెలిపారు. 'రాజ్యాంగాన్ని రద్దు చేయబోతున్నానని బాహాటంగానే చెప్పిన వ్యక్తి గురించి ఊహించుకోండి.' అని హారిస్ అన్నారు.

ఇజ్రాయెల్‌పై చర్చ సందర్భంగా ఇజ్రాయెల్-గాజా యుద్ధం అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కమలా హారిస్ గెలిస్తే ఇజ్రాయెల్ అంతమవుతుందని ఈ సందర్భంగా ట్రంప్ అన్నారు. అదే సమయంలో ట్రంప్ వాదన తప్పని, పరిష్కారాలకు తాను మద్దతిస్తున్నానని కమలా హారిస్ అన్నారు.

తదుపరి వ్యాసం