Donald Trump: ట్రంప్ పుస్తకం ‘సేవ్ అమెరికా’..; రిలీజైన కొన్ని గంటల్లోనే అమెజాన్ బెస్ట్ సెల్లర్ గా రికార్డు-trumps book save america becomes amazon best seller just hours after release ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Donald Trump: ట్రంప్ పుస్తకం ‘సేవ్ అమెరికా’..; రిలీజైన కొన్ని గంటల్లోనే అమెజాన్ బెస్ట్ సెల్లర్ గా రికార్డు

Donald Trump: ట్రంప్ పుస్తకం ‘సేవ్ అమెరికా’..; రిలీజైన కొన్ని గంటల్లోనే అమెజాన్ బెస్ట్ సెల్లర్ గా రికార్డు

Sudarshan V HT Telugu
Sep 04, 2024 08:39 PM IST

‘సేవ్ అమెరికా’ పేరుతో డొనాల్డ్ ట్రంప్ కొత్త పుస్తకం సెప్టెంబర్ 3 మంగళవారం విడుదలైంది. ధర భారీగా ఉన్నప్పటికీ ఈ పుస్తకం పెద్ద సంఖ్యలో అమ్ముడవుతోంది. విడులైన ఒక రోజులోనే ‘సేవ్ అమెరికా’ అమెజాన్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది.

డొనాల్డ్ ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ (Getty Images via AFP)

సేవ్ అమెరికా పేరుతో డొనాల్డ్ ట్రంప్ కొత్త పుస్తకం సెప్టెంబర్ 3 మంగళవారం విడుదలైంది. అది ఇప్పటికే అమెజాన్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. భారీ ధర నిర్ణయించినప్పటికీ, మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష పదవికి పోటీ దారుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ పుస్తకం సేవ్ అమెరికా.. అమెజాన్ 'ప్రెసిడెంట్స్ & హెడ్స్ ఆఫ్ స్టేట్ బయోగ్రఫీస్' విభాగంలో నెం.1 స్థానంలో నిలిచింది. అలాగే, మొత్తంగా 13 వ స్థానంలో నిలిచింది . ఈ పుస్తకం హార్డ్ కవర్ పబ్లిషర్ ఇచ్చిన డిస్కౌంట్ అనంతరం $ 92.06 కు లభిస్తుంది. ఈ పుస్తకాన్ని విన్నింగ్ టీమ్ పబ్లిషింగ్ సంస్థ ప్రచురించింది.

సేవ్ అమెరికా పుస్తకానికి ట్రంప్ ప్రచారం

ట్రూత్ సోషల్ పోస్ట్ లో ట్రంప్ ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేస్తున్నారు. "నా కొత్త పుస్తకం ఈ రోజు వస్తుంది! మీ కాపీ దొరికిందా? వైట్ హౌస్ లో ఉన్నప్పటి నుంచి ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వరకు ప్రతి ఫొటోను ఎంపిక చేశాను. యు.ఎస్. చరిత్రపై, ముఖ్యంగా అమెరికా ఫస్ట్ పేట్రియాట్స్ కోసం ఈ పుస్తకం తప్పక ఉండాలి’’ అని ట్రంప్ ఆ పోస్ట్ లో రాశారు.

ఈ పుస్తకం దేని గురించి?

ట్రంప్ అధికారంలో ఉన్న కాలం, ఆయన అధ్యక్ష ఎన్నికల ప్రచారాలకు సంబంధించిన చిత్రాలు, చిన్న చిన్న సరదా సంఘటనలు, జ్ఞాపకాల సమాహారమే ఈ పుస్తకం. పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్ పై హత్యాయత్నం నుంచి బయటపడిన తర్వాత అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ పీటర్ తీసిన ఐకానిక్ చిత్రాన్ని ఈ పుస్తకానికి ముఖచిత్రంగా పెట్టారు.

మెర్కెల్, కిమ్ లతో..

ఈ పుస్తకం విడుదలకు ముందు దానిలోని కొన్ని భాగాలను ముందుగానే ఎంపిక చేసిన మీడియా సంస్థలకు విడుదల చేశారు. వాటిలో టైగర్ వుడ్స్, ఏంజెలా మెర్కెల్, కిమ్ జోంగ్ ఉన్ వంటి వ్యక్తులతో ట్రంప్ ఫోటోలు ఉన్నాయి. 2018లో హెల్సింకిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో తాను జరిపిన సమావేశాన్ని ట్రంప్ ఈ పుస్తకంలో సమర్ధించుకున్నారు.

ఐకానిక్ మూమెంట్స్

అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తన నాలుగేళ్ల చరిత్రను, తన తదుపరి పదవీకాలానికి ఒక దార్శనికతను ఈ పుస్తకంలో పొందుపరిచారని అమెజాన్ పేర్కొంది. సేవ్ అమెరికా"లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఐకానిక్ మూమెంట్స్ తో నిండి ఉందని పేర్కొంది. ప్రపంచ నాయకులతో చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశాల నుండి వైట్ హౌస్ నుండి స్పష్టమైన దృశ్యాల వరకు అందులో పొందుపర్చారని ప్రశంసించింది.