Donald Trump Elon Musk : ‘హత్యాయత్నం తర్వాత దేవుడి మీద నమ్మకం పెరిగింది’- డొనాల్డ్​ ట్రంప్​-donald trump elon musk interview ex president says illegal immigration saved his life ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Donald Trump Elon Musk : ‘హత్యాయత్నం తర్వాత దేవుడి మీద నమ్మకం పెరిగింది’- డొనాల్డ్​ ట్రంప్​

Donald Trump Elon Musk : ‘హత్యాయత్నం తర్వాత దేవుడి మీద నమ్మకం పెరిగింది’- డొనాల్డ్​ ట్రంప్​

Sharath Chitturi HT Telugu

Donald Trump Elon Musk interview : తనపై హత్యాయత్నం జరిగినప్పటి నుంచి దేవుడిని ఎక్కువ నమ్మడం మొదలుపెట్టినట్టు డొనాల్డ్​ ట్రంప్​ తెలిపారు. ఎలాన్​ మస్క్​తో ఇంటర్వ్యూతో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

డొనాల్డ్​ ట్రంప్​- ఎలాన్​ మస్క్​ ఇంటర్వ్యూ.. (AFP)

తనపై హత్యాయత్నం జరిగినప్పటి నుంచి తాను దేవుడిని మరింత నమ్మడం మొదలుపెట్టినట్టు అమెరికా మాజీ అధ్యక్షుడు, 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికెన్​ పార్టీ అభ్యర్థి డొనాల్డ్​ ట్రంప్​ అన్నారు. అక్రమ వలసలే తనను కాపాడాయని పేర్కొన్నారు. ఈ మేరకు.. దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్​ మస్క్​తో ఎక్స్​లో జరిగిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా తీవ్ర సాంకేతిక లోపం కారణంగా ఈ ఇంటర్వ్యూ 40 నిమిషాలపై ఆలస్యమైంది. సాంకేతిక లోపాన్ని సైబర్​ దాడిగా మస్క్​ అభివర్ణించారు.

ట్రంప్​తో మస్క్​ చాట్​..

గత నెలలో పెన్సిల్వేనియా ర్యాలీలో డొనాల్డ్​ ట్రంప్​పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తన ఇంటర్వ్యూలో ఎలాన్​ మస్క్​ ప్రస్తావించారు.

తనపై జరిగిన హత్యాయత్నం గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘నా దగ్గర అంత రక్తం ఉందని నాకు తెలియదు! అదే సమయంలో నేను తీవ్రంగా గాయపడలేదు కాబట్టి ఈ విధంగా ఆలోచించడం ఉత్తమం,’ అని ట్రంప్​ అన్నారు.

"ఇప్పుడు నేను విశ్వాసిని. నేను దేవుడిని ఎక్కువగా నమ్ముతున్నాను,' అని ట్రంప్ అన్నారు.

ఇమ్మిగ్రేషన్ విషయంలో తన వైఖరి కారణంగానే తనను టార్గెట్ చేశారని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

జులై 13న హత్యాయత్నం నుంచి బయటపడిన పెన్సిల్వేనియాలోని బట్లర్​కు అక్టోబర్​లో తిరిగి వెళ్తానని మస్క్​తో ట్రంప్ చెప్పారను.

కాల్పులు జరగడానికి కొన్ని క్షణాల ముందు ట్రంప్ తన పొజిషనింగ్​ను సర్దుబాటు చేసుకోవడానికి ప్రేరేపించిన చార్ట్​లు తన ప్రాణాలను కాపాడాయని మస్క్ అన్నారు.

"మీ ధైర్యాన్ని చాలా మంది మెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను,' అని మస్క్ అన్నారు.

'అక్రమ వలసలు నా ప్రాణాలను కాపాడాయి,' అంటూ ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు.

కమలా హారిస్​ ఫేక్​.. 

ఈ ఇంటర్వ్యూలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ట్రంప్​. "నేను చేసిన ప్రతి పనిని ఆమె చేస్తోంది," అని పేర్కొన్నారు. ఆమె ఫేక్ అని, ఆమె కనుసన్నల్లోనే సరిహద్దులు దాటుతున్న అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిందని పునరుద్ఘాటించారు.

ట్రంప్​- ఎలాన్​ మస్క్​ చాట్​పై సైబర్​ దాడి..?

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ  ఎక్స్​లో సాంకేతిక లోపాల కారణంగా 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.

రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఇంటర్వ్యూకు పద్దెనిమిది నిమిషాల ముందు, మస్క్ ఎక్స్​లో భారీ డినయల్​ ఆఫ్​ సర్వీస్​ అటాక్ (డీడీఓఎస్)ను ఎదుర్కొంటున్నట్టు పోస్ట్ చేశారు. ఒక సైట్​ని పనిచేయనివ్వకుండా చేసేందుకు డేటాతో దానిని ఫ్లడ్​ చేయడం నేరం అని మస్క్​ తెలిపారు.

డొనాల్డ్​ ట్రంప్​ ఎలాన్​ మస్క్​ ఇంటర్వ్యూ కోసం లక్షలాది మంది ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఇంటర్వ్యూ ప్రారంభ సమయానికి వారు దానిని చూడలేకపోయారు. టెక్నికల్​ గ్లిచ్​ మెసేజ్​లు వచ్చాయి. ఫలితంగా మస్క్​ ఇంటర్వ్యూని ఆపేయాల్సి వచ్చింది.ధృవీకరించలేదు.

ఎక్స్ సర్వర్లలో భారీ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ అటాక్ (డీడీఓఎస్)' జరగడమే ఆలస్యానికి కారణమని ఎలన్ మస్క్ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్రంప్ చెప్పేది వినేందుకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనడానికి ఈ సైబర్ దాడి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్ని అవాంతరాలు ఎదురైనా ట్రంప్-మస్క్ ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా పది లక్షల మంది శ్రోతలను ఆకర్షించగలిగింది. ఎలాన్ మస్క్​ను అభినందించిన ట్రంప్ .. 'మీరు రికార్డులు బద్దలు కొట్టారు. పుస్తకంలోని ప్రతి రికార్డును బద్దలు కొట్టినందుకు అభినందనలు," అని అన్నారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.