తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Donald Trump Indicted : ట్రంప్​ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. రహస్య పత్రాల కేసులో అభియోగాలు!

Donald Trump indicted : ట్రంప్​ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. రహస్య పత్రాల కేసులో అభియోగాలు!

Sharath Chitturi HT Telugu

09 June 2023, 7:20 IST

  • Donald Trump indicted : రహస్య పత్రాల కేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై అభియోగాలు మోపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

డొనాల్డ్​ ట్రంప్​..
డొనాల్డ్​ ట్రంప్​.. (AP)

డొనాల్డ్​ ట్రంప్​..

Donald Trump indicted : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు కష్టకాలం కొనసాగుతోంది! 'పోర్న్​ స్టార్​' కేసులో ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా మరో షాక్​ తగిలింది. రహస్య పత్రాల కేసులో తనపై అభియోగాలు మోపినట్టు స్వయంగా ట్రంప్​ వెల్లడించారు. 2024 అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికెన్​ పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థిగా దూసుకెళుతున్న తరుణంలో క్రిమినల్​ కేసులు ట్రంప్​ను వెంటాడుతుండటం సర్వత్రా చర్చలకు దారితీసింది.

పేపర్ల మధ్యలో రహస్య పత్రాలు..!

2020 ఎన్నికల ఓటమి తర్వాత.. వైట్​ హౌజ్​ను ట్రంప్​ ఖాళీ చేశారు. అయినప్పటికీ ఆయన వద్ద ప్రభుత్వానికి చెందిన క్లాసిఫైడ్​ డాక్యుమెంట్లు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది ఆగస్టులో ఫ్లోరిడాలోని ట్రంప్​ నివాసమైన మార్​- ఎ- లాగో ఎస్టేట్​లో ఎఫ్​బీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. దేశానికి చెందిన అత్యంత రహస్యమైన పత్రాలను ఇతర మ్యాగజైన్​లు, వార్తా పత్రికల మధ్య కలిపేశారని అధికారులు వెల్లడించారు.

తాజా పరిణామాలపై తన సోషల్​ మీడియా ట్రూత్​ వేదికగా స్పందించారు డొనాల్డ్​ ట్రంప్​.

"ఈ అవినీతి బైడెన్​ ప్రభుత్వం.. నాపై మళ్లీ అభియోగాలు మోపింది. ఈ విషయం నా లాయర్లకు చెప్పింది. ఓ మాజీ అధ్యక్షుడికి.. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు," అని డొనాల్డ్​ ట్రంప్​ వెల్లడించారు. మయామీలోని ఫెడరల్​ కోర్టు హాజరుకావాలని తనకు పిలుపు వచ్చిందని వివరించారు. ఇదే నిజమైతే.. ఫెడరల్​ ఛార్జీలు ఎదుర్కొనున్న తొలి సిట్టింగ్​/ మాజీ కమాండర్​ ఇన్​ చీఫ్​గా ట్రంప్​.. అమెరికా చరిత్రలో నిలిచిపోనున్నారు.

ఈ విషయంపై అమెరికా న్యాయశాఖ నుంచి ఇంకా ఎలాంటి స్పందన లభించలేదు. కాగా ఈ వార్త నిజమేనని అమెరికాలోని కొన్ని ప్రముఖ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే.. ట్రంప్​పై ఎలాంటి ఛార్జీలు వేస్తున్నారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

కాగా.. మరో వారం రోజుల్లో 77ఏళ్ల వసంతంలోకి అడుగుపెట్టనున్న ట్రంప్​ మాత్రం.. తాను ఎలాంటి తప్పులు చేయలేదని తేల్చిచెబుతున్నారు.

"రహస్య పత్రాల గురించి నాకేం తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే. నేనే తప్పుచేయలేదు," అని ఇటీవలే ఓ కార్యక్రమంలో ట్రంప్​ వ్యాఖ్యానించారు.

కేసులే.. కేసులు..

Donald Trump classified documents case : హష్​ మనీ కేసులో ట్రంప్​పై అభియోగాలు ఉన్నాయి. రహస్య పత్రాల కేసులో ఆయనపై తాజాగా అభియోగాలు మోపారు. 2020 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో జరిగిన క్యాపిటల్​ హింసాకాండ కేసులోనూ ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు 10కిపైగా ఆర్థికపరమైన నేరాలకు సంబంధించిన కేసులు ట్రంప్​పై ఉన్నాయి.

తదుపరి వ్యాసం