తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Donald Trump: ట్రంప్ నకు ఊరట; పోర్న్ స్టార్ కు షాక్

Donald trump: ట్రంప్ నకు ఊరట; పోర్న్ స్టార్ కు షాక్

HT Telugu Desk HT Telugu

05 April 2023, 19:28 IST

  • Donald trump wins: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) నకు స్థానిక కోర్టులో కొంత ఊరట లభించింది. ఆయనపై పోర్న్ స్టార్ స్టార్మీ డేనయల్స్ వేసిన పరువు నష్టం కేసు తీర్పు ట్రంప్ నకు అనుకూలంగా వచ్చింది.

నటి స్టార్మీ డేనయల్స్
నటి స్టార్మీ డేనయల్స్ (AP)

నటి స్టార్మీ డేనయల్స్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) అరెస్ట్ కు కారణమైన పోర్న్ స్టార్ స్టార్మీ డేనయల్స్ (porn star Stormy Daniels) కు స్థానిక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ పై ఆమె వేసిన పరువునష్టం కేసులో ఆమె ఓడిపోయింది.

Donald trump wins:1.21 లక్షల డాలర్ల జరిమానా

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) న్యాయవాదులకు 1.21 లక్షల డాలర్లను చెల్లించాలని స్టార్మీ డేనయల్స్ ను కాలిఫోర్నియాలోని తొమ్మిదవ సర్క్యూట్ కోర్టు ఆదేశించింది. స్టార్మీ డేనయల్స్ (Stormy Daniels) తో లైంగిక సంబంధం కారణంగా మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాలన్న ట్రంప్ ఆశ నెరవేరని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఆ సంబంధాన్ని బహిర్గతం చేయకుండా ఉండడం కోసం ట్రంప్ (Donald trump) తన న్యాయవాదుల ద్వారా 2015 లో 1.3 లక్షల డాలర్లను ఆమెకు చెల్లించారన్న ఆరోపణ సహా మొత్తం 34 తీవ్రమైన నేరారోపణలను ట్రంప్ (Donald trump) ఎదుర్కొంటున్నారు. మన్ హటన్ లోని ఒక కోర్టులో మంగళవారం ఆయన లొంగిపోవడం, అరెస్ట్ కావడం, ఆ తరువాత విడుదల కావడం వరుసగా, నాటకీయంగా జరిగిన విషయం తెలిసిందే. అదే రోజు, స్మార్మీ డేనియల్స్ (Stormy Daniels) ను ట్రంప్ న్యాయవాదులకు 1.21 లక్షల డాలర్లను లీగల్ ఫీజుగా చెల్లించాలని కాలిఫోర్నియాలోని తొమ్మిదవ సర్క్యూట్ కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను కంగ్రాచ్యులేషన్స్ ట్రంప్’ అంటూ ట్రంప్ (Donald trump) న్యాయవాది హర్మీత్ కే ధిల్లాన్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇప్పటికే 5 లక్షల డాలర్లను ట్రంప్ న్యాయవాదులకు ఫీజుగా చెల్లించాలని గతంలో స్టార్మీ డేనియల్స్ ను కోర్టు ఆదేశించింది. అంటే, మొత్తంగా, ట్రంప్ న్యాయవాదుల బృందానికి స్టార్మీ డేనియల్స్ (Stormy Daniels) 6 లక్షల డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ట్రంప్ నకు మంచి విజయమని భావిస్తున్నారు. ‘హుష్ మనీ (hush money)’ కేసు ద్వారా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను ఎదుర్కొంటున్న అమెరికా తొలి మాజీ దేశ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald trump) నిలిచారు.

తదుపరి వ్యాసం