Stormy Daniels : ఎవరీ స్టార్మీ డేనియల్స్​? ట్రంప్​తో ఆమెకు ఉన్న 'సంబంధం' ఏంటి?-who is stormy daniels and what did she say that happened with trump ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Who Is Stormy Daniels And What Did She Say That Happened With Trump?

Stormy Daniels : ఎవరీ స్టార్మీ డేనియల్స్​? ట్రంప్​తో ఆమెకు ఉన్న 'సంబంధం' ఏంటి?

Sharath Chitturi HT Telugu
Mar 31, 2023 11:14 AM IST

Stormy Daniels Trump : స్టార్మీ డేనియల్స్​- డొనాల్డ్​ ట్రంప్​ వివాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఎవరీ స్టార్మీ డేనియల్స్​?

స్టార్మీ డేనియల్స్​
స్టార్మీ డేనియల్స్​ (Photo: AP)

Stormy Daniels interview : 'స్టార్మీ డేనియల్స్​'.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారిన పేరు ఇది. ఈమె వల్లే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై అక్కడి గ్రాండ్​ జ్యూరీ అభియోగాలు మోపింది. త్వరలోనే ఆయనపై క్రిమినల్​ ఛార్జీలు పడనున్నాయి. మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్​ ఛార్జీలు పడిన తొలి వ్యక్తిగా ట్రంప్​ నిలిచిపోనున్నారు. అసలు ఎవరీ స్టార్మీ డేనియల్స్​? ఈ పోర్న్​ స్టార్​కు ట్రంప్​నకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? వీరి మధ్య వివాదానికి గల కారణాలేంటి?

స్టార్నీ డేనియల్స్​.. అడల్ట్​ ఫిల్మ్​ స్టార్​..

ప్రముఖ పోర్న్​ స్టార్​ స్టార్మీ డేనియల్స్​.. 2018లో సీబీఎస్​ ఛానెల్​కు చెందిన '60 మినిట్స్​'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 2006లో తాను ట్రంప్​తో లైంగికంగా కలిసినట్టు ఆమె​ తెలిపారు. ఇది ట్రంప్​ మూడో పెళ్లి (మిలానియా) జరిగిన ఏడాది అనంతర ఘటన! సరిగ్గా ఇక్కడి నుంచి దశాబ్ద కాలం తర్వాత డొనాల్డ్​ ట్రంప్​.. అమెరికా అధ్యక్షుడయ్యారు.

Stormy Daniels Trump : అయితే.. తనకు స్టార్నీ డేనియల్స్​తో ఎలాంటి సంబంధం లేదన్న ట్రంప్​.. ఆమెకు డబ్బులు ఇచ్చిన మాత్రం విషయాన్ని అంగీకరించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయకుండా ఉండేందుకే డబ్బులు ఇచ్చినట్టు వివరించారు.

పోర్న్​ స్టార్​తో సెక్స్​..!

స్టార్నీ డేనియల్స్​ అసలు పేరు స్టెఫానీ క్లిఫోర్డ్​. అమె వయస్సు 44ఏళ్లు. ఆమె.. లూసియానాలోని బాటన్​ రోగ్​లో నివాసముంటున్నారు. రెండు దశాబ్దాల పాటు అడల్ట్​ ఫిల్మ్​ ఇండస్ట్రీలో ఉన్నారు. అనేక వీడియోలు కనిపించారు. పలు వీడియోలకు దర్శకత్వం కూడా వహించారు.

Donald Trump indicted : 2006లో ట్రంప్​తో తనకు తొలిసారి పరిచయం ఏర్పడిందని స్టార్నీ డేనియల్స్​ తెలిపారు. లేక్​ టహౌలో జరిగిన ఓ సెలబ్రిటీ గోల్ఫ్​ టోర్నమెంట్​లో ట్రంప్​ను కలిసినట్టు వివరించారు. ఆ తర్వాత.. ట్రంప్​ తన హోటల్​లో డిన్నర్​కు ఆహ్వానించినట్టు స్పష్టం చేశారు.

కొన్ని రోజుల తర్వాత తాను ట్రంప్​ హోటల్​ గదికి వెళ్లినట్టు అంగీకరించారు స్టార్మీ డేనియల్స్​. 'సెలబ్రిటీ అప్రెంటీస్​' అనే ప్రముఖ టీవీ షోలోకి వస్తావా? అని ట్రంప్​ తనను అడిగినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత ఇద్దరు.. ఏకాభిప్రాయంతో సెక్స్​ చేసినట్టు వివరించారు.

Criminal charges against Trump : ఈ ఘటన తర్వాత ట్రంప్​.. తనకు పలుమార్లు ఫోన్​ చేసినట్టు స్టార్మీ డేనియల్స్​ వెల్లడించారు. 

Who is Stormy Daniels : "2006 తర్వాత మేము చాలాసార్లు ఫోన్​లో మాట్లాడుకున్నాము. 2007 జులైలో లాస్​ ఏంజెల్స్​ బేవరలీ హిల్స్​ హోటల్​లో మళ్లీ కలిశాము. టీవీషోలో కనిపించడంపై చర్చిద్దాం అని ట్రంప్​ నన్ను పిలిచారు. కానీ నాతో సెక్స్​ కావాలన్నారు. నేను ఒప్పుకోలేదు. అది జరిగిన నెల తర్వాత నాకు ట్రంప్​ నుంచి ఫోన్​ వచ్చింది. టీవీషోలో కనిపించేందుకు అవకాశం లేదన్నారు," అని స్టార్మీ డేనియల్స్​ వెల్లడించారు.

2016 ఎన్నికలకు ముందు ఒప్పందం కుదుర్చుకుని..

లాస్​ ఎంజెల్స్​ ఫెడరల్​ కోర్ట్​లో దాఖలైన పత్రాల ప్రకారం.. 2016 అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల ముందు (అక్టోబర్​ 28).. స్టార్మీ డేనియల్స్​తో ట్రంప్​ ఒప్పందం కుదుర్చుకున్నారు. తనతో సంబంధం గురించి బహిరంగంగా చెప్పకూడదని ఆ ఒప్పందంలో ఉంది. ఇందుకోసం 1,30,000 డాలర్లు చెల్లించారు ట్రంప్​. ఈ ఒప్పందంపై స్టార్మీ డేనియల్స్​ లాయర్​ కైత్​ డేవిడ్​సన్​, ట్రంప్​ వ్యక్తిగత న్యాయవాది- ఫిక్సర్​ మైకెల్​ కోహెన్​ సంతకాలు చేశారు. ఒప్పందంపై ట్రంప్​ సంతకం చేయాల్సి ఉన్నా.. ఆయన ఎప్పుడు చేయలేదని తెలుస్తోంది.

2018లో ఈ ఒప్పందం గుప్పుమంది. దీనిపై వాల్​ స్ట్రీట్​ జర్నల్​ కథనాలు ప్రచురించింది. స్టార్మీ డేనియల్స్​కు డొనాల్డ్​ ట్రంప్​ పేమెంట్స్​ చేశారని రాసుకొచ్చింది. ఈ విషయంపై కోహెన్​ బహిరంగంగా స్పందించారు. ఈ ఒప్పందంతో ట్రంప్​నకు ఎలాంటి సంబంధం లేదని, తానే తన సొంత డబ్బులు చెల్లించినట్టు వివరించారు. అనంతరం ట్రంప్​, కోహెన్​పై స్టార్మీ కేసు వేశారు. ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

ట్రంప్​ ఈ ఒప్పందంపై ఎప్పుడు సంతకం చేయలేదు కాబట్టి.. దీనిని అమలు చేసేందుకు తాము ఒత్తిడి తీసుకురామని ఆయన తరఫు న్యాయవాదులు చెప్పారు. ఫలితంగా.. సమస్య పరిష్కారమైందంటు.. న్యాయమూర్తి ఈ కేసును కొట్టివేశారు.

ట్రంప్​పై పరువు నష్టం కేసు..

2018లో ట్రంప్​- స్టార్మీ మధ్య 'బంధం' మరింత ఉద్రిక్తంగా మారింది. ట్రంప్​ తనతో సెక్స్​ చేసిన విషయాన్ని బహిరంగంగా చెప్పినందుకు.. తనకు బెదిరింపులు వస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ పోర్న్​ స్టార్​. దీనిని ట్రంప్​ ఖండించారు. తనను మోసం చేసి, డబ్బులు పొందాలన్న కారణంతోనే స్టార్మీ అలా మాట్లాడుతున్నారని ట్వీట్​ చేశారు ట్రంప్​. ఈ ట్వీట్​ ఆధారంగా.. మాజీ అధ్యక్షుడిపై పరువు నష్టం దావా వేశారు డేనియల్స్​. అయితే.. ట్రంప్​ వ్యాఖ్యలు కించపరిచే విధంగా లేవని, ఫ్రీ స్పీచ్​ హక్కుల్లో భాగంగానే ఉన్నాయని ఓ జడ్జీ తీర్పునిచ్చారు. ఈ తీర్పునకు వ్యతిరేకంగా అమెరికా సూప్రీంకోర్టుకు వెళ్లారు స్టార్మీ డేనియల్స్​. కాగా.. అక్కడ కూడా ఆమెకు పరాజయం తప్పలేదు.

కాగా.. డేనియల్స్​కు డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలు మాత్రం మాజీ అధ్యక్షుడిని వెంటాడాయి. ఆ విషయంపై దాఖలైన కేసులో తాజాగా.. న్యూయార్క్​లోని గ్రాండ్​ జ్యూరీ ఆయనపై అభియోగాలు మోపింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం