Donald Trump indicted : ‘పోర్న్ స్టార్‌కు ట్రంప్ డబ్బులిచ్చారు’- మాజీ అధ్యక్షుడిపై అభియోగాలు!
Donald Trump indicted : 2016 ఎన్నికలకు ముందు ఓ పోర్న్ స్టార్‌కు డొనాల్డ్ ట్రంప్ భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారన్న ఆరోపణలు రుజువయ్యాయి! ఇందుకు సంబంధించి.. న్యూయార్క్‌లోని గ్రాండ్ జ్యూరీ అమెరికా మాజీ అధ్యక్షుడిపై అభియోగాలు మోపింది.
Donald Trump indicted news : 'హష్ మనీ' కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభియోగాలు మోపేందుకు న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ సిద్ధమైంది. ఫలితంగా.. 2016 ఎన్నికలకు ముందు.. ట్రంప్ ఓ పోర్న్ స్టార్‌కు భారీ మొత్తంలో చెల్లింపులు చేశారన్న ఆరోపణలు నిజమయ్యాయి. ఓ మాజీ/ సిట్టింగ్ అధ్యక్షుడిపై వేసిన నేరారోపణలు రుజువైన తొలి వ్యక్తిగా.. డొనాల్డ్ ట్రంప్ దేశ చరిత్రలో నిలిచిపోనున్నారు.
త్వరలోనే డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్..!
ఈ అభియోగాలకు సంబంధించిన ఛార్జీలను మ్యాన్‌హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం ప్రస్తుతం సీల్డ్ కవర్లో ఉంచినట్టు, త్వరలోనే వీటిని ప్రకటించనున్నట్టు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇదే జరిగితే.. 2024 అధ్యక్ష ఎన్నికల రేసులో పాల్గొనాలని భావిస్తున్న ట్రంప్ ఆశలు ఆవిరైపోతాయి!
Donald Trump news latest : దశాబ్ద కాలం క్రితం.. డొనాల్డ్ ట్రంప్ తనతో లైంగికంగా కలిసినట్టు పోర్న్ స్టార్ స్టోర్మీ డేనియల్స్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు.. 2016 ఎన్నికలకు ముందు ట్రంప్ తనకు 1,30,000 డాలర్లు చెల్లించినట్టు ఆమె ఆరోపించారు. 2019లో ట్రంప్ మాజీ న్యాయవాది మైకెల్ కోహెన్.. ఈ వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ ఎదుట కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తరఫున తాను స్టోర్మీ డేనియల్స్‌కు డబ్బులు చెల్లించినట్టు తెలిపారు.
ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలను మ్యాన్‌హట్టన్‌లోని గ్రాండ్ జ్యూరీ ప్యానెల్ కొంత కాలం పాటు విచారణ జరిపింది. కేసుకు సంబంధించిన సాక్ష్యులను విచారించింది. కాగా.. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్‌పై మూడు పెద్ద కేసులు ఉన్నాయి. వీటిల్లో డొనాల్డ్ ట్రంప్ ఛార్జీలు ఎదుర్కొంటుండటం ఇదే మొదటిది. 2020 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో 2021 జనవరి 6న జరిగిన 'క్యాపిటల్' దాడి ఘటనలో డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి.
Donald Trump Stormy Daniels : తాజా పరిణామాలను డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. తనను రాజకీయ నేతలు కావాలనే వేటాడుతున్నారని ఆరోపించారు. తనను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉందని కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించారు.
Stormy Daniels Donald trump case : డొనాల్డ్ ట్రంప్‌పై నేరారోపణలు రుజవైన నేపథ్యంలో న్యూయార్క్ వాతావరణ వేడెక్కింది. ట్రంప్ మద్దతుదారులు నిరసనలు తెలిపే అవకాశం ఉందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను పెంచారు.
సంబంధిత కథనం