Criminal charges against Trump : డొనాల్డ్ ట్రంప్‌పై క్రిమినల్ కేసుకు రంగం సిద్ధం!
criminal charges against Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై క్రిమినల్ కేసు వేసేందుకు రంగం సిద్ధమైంది! యూఎస్ క్యాపిటల్ హింసాకాండపై దర్యాప్తు చేపట్టిన ఓ బృందం.. ఆయనపై కేసు పెట్టాలని న్యాయశాఖకు సిఫార్సు చేసింది.
criminal charges against Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై క్రిమినల్ కేసు పడే సూచనలు కనిపిస్తున్నాయి. 2021 యూఎస్ క్యాపిటల్ హింసాకాండపై దర్యాప్తు చేపట్టిన ఓ కమిటీ.. ట్రంప్ చేసిన తప్పులను, ఆయన ఉల్లంఘించిన చట్టాలను లేవనెత్తుతూ, ఆయనపై క్రిమినల్ ఛార్జీలు వేయాలని సిఫార్సు చేయడమే ఇందుకు కారణం.
తిరుగుబాటు, అధికార కార్యకలాపాల అడ్డగింత, అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడం, తప్పుడు ఆరోపణలు చేయడం వంటి నేరాల కింద.. డొనాల్డ్ ట్రంప్‌పై క్రిమినల్ కేసులు వేయాలని న్యాయశాఖకు అభ్యర్థించింది హౌజ్ ప్యానెల్. క్రిమినల్ కేసులు వేసేందుకు బలమైన ఆధారాలు ఉన్నట్టు, రాజ్యంగం పరంగా ప్రశాంతంగా జరగాల్సిన అధికార మార్పిడిని అడ్డుకునేందుకు.. ట్రంప్ తన సాయశక్తులా ప్రయత్నించారని ఆరోపించింది.
Donald trump latest news : ఈ ప్యానెల్ రూపొందించిన నివేదికను.. అటార్నీ జనరెల్ మారిక్ గార్లాండ్ నియమించే స్పెషల్ కౌన్సిల్ పరిశీలిస్తుంది. ఆ తర్వాత ట్రంప్‌పై కేసు వేసే విషయాన్ని నిర్ణయిస్తుంది.
అవన్ని తప్పుడు ఆరోపణలు..
ప్యానెల్ నివేదికపై డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. అవన్నీ తప్పుడు ఆరోపణలని పేర్కొన్నారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తనను పోటీ చేయనివ్వకుండా అడ్డుకునేందుకే చట్టసభ్యులు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
Donald Trump criminal case : "ఈ పూర్తి ప్రక్రియ అంతా అభిశంసనలాగానే ఉంది. నన్ను పక్కకు తప్పించడానికి, రిపబ్లిక్ పార్టీని పక్కకు నెట్టడానికి ఇలాంటివి చేస్తున్నారు," అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
యూఎస్ క్యాపిటల్ హింసాకాండ..
US Capitol riots : 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించారు. 2021 జనవరి 6న ఆయన ప్రభుత్వ కొలువుదీరింది. ఈ సమయంలోనే అమెరికా వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు.. అమెరికా కాంగ్రెస్ భవనమైన క్యాపిటల్‌లోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు. అమెరికా చరిత్రలో ఇదొక చీకటి రోజుగా మిగిలిపోయింది. ప్రజలను ట్రంప్ రెచ్చగొట్టారని, ఆయన చర్యల వల్లే తీవ్రస్థాయిలో విధ్వంసం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్