FBI raids on Trump estate | ట్రంప్ ఎస్టేట్‌పై ఎఫ్‌బీఐ దాడి
FBI raids on Trump estate | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫ్లొరిడాలో ఉన్న ``మేర్ ఎ లాగో`` ఎస్టేట్‌పై ఎఫ్‌బీఐ అధికారులు సోమవారం దాడి చేశారు. అధ్యక్షుడిగా ఉన్ననాటి రహస్య పత్రాలను, అధికారిక డాక్యుమెంట్లను రహస్యంగా దాచారన్న ఆరోపణలపై ఈ దాడి నిర్వహించారు.
FBI raids on Trump estate | అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరొ ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) అధికారులు సోమవావారం డొనాల్డ్ ట్రంప్ ప్రైవేట్ ఎస్టేట్‌పై దాడులు చేశారు. ఆ ఎస్టేట్‌లో ట్రంప్ ఇల్లు, ప్రైవేట్ క్లబ్ ఉన్నాయి. అధికారిక పత్రాలను అక్రమంగా దగ్గర పెట్టుకున్న ఆరోపణలపై జరుపుతున్న విచారణలో భాగంగా ఆ రెసిడెన్స్ లోని ఒక సీక్రెట్ లాకర్‌ను బద్దలు కొట్టారు. ఎఫ్‌బీఐ దాడులు చేస్తున్న సమయంలో ట్రంప్ అక్కడ లేరు. ఆయన న్యూయార్క్‌లో ఉన్నారని ఆయన సిబ్బంది తెలిపారు. నేషనల్ ఆర్కైవ్స్ ఆదేశాల మేరకు ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే, ట్రంప్ ప్రైవేట్ ఎస్టేట్‌పై సోదాల విషయంపై ఎఫ్‌బీఐ అధికారికంగా స్పందించలేదు.

FBI raids on Trump estate | ఇదంతా కుట్ర
ఫ్లొరిడాలోని తన ప్రైవేటు ఎస్టేట్‌పై ఎఫ్‌బీఐ దాడులపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇదంతా పెద్ద కుట్రలో భాగమన్నారు. తను 2024లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడాన్ని నిరోధించే కుట్రలో భాగంగా ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ``ఫ్లొరిడాలోని పామ్‌బీచ్‌లో ఉన్న నా అందమైన ఇంటిపై ఎఫ్‌బీఐ ఏజెంట్లు దాడి చేశారు. నా ప్రాపర్టీలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఏ మాజీ అధ్యక్షుడికి ఇలాంటి పరిస్థితి రాలేదు. ఇది దేశానికి చీకటి రోజు`` అని ట్రంప్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి దాడులు అమెరికా వంటి నాగరిక, అభివృద్ది చెందిన దేశాల్లో జరగవని, కేవలం అభివృద్ధి చెందని పేద, అనాగరిక దేశాల్లోనే ఇలాంటి దాడులను చూస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
FBI raids on Trump estate | 15 బాక్స్‌ల డాక్యుమెంట్లు
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌ను వీడుతున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ పామ్‌బీచ్‌లోని తన ఎస్టేట్‌కు దాదాపు 15 బాక్స్‌ల నిండా ముఖ్యమైన అధికారిక పత్రాలను తీసుకువెళ్లారన్న ఆరోపణలపై ఎఫ్‌బీఐ దర్యాప్తు జరుపుతోంది. ఆ డాక్యుమెంట్లలో కొన్ని అత్యంత రహస్య పత్రాలు కూడా ఉన్నాయి. 2024లో మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలవాలని రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ప్రారంభించిన సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.
FBI raids on Trump estate | పామ్ బీచ్ ఎస్టేట్
అట్లాంటిక్ సముద్ర తీరంలో 20 ఎకరాల్లో ట్రంప్ ``మేర్ ఎ లాగో`` ఎస్టేట్ ఉంది. 2018లో ఈ ఎస్టేట్ విలువ 160 మిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ అంచనా వేసింది.