Donald Trump: మళ్లీ పోటీ చేస్తా.. గెలిచి తీరుతా: డొనాల్డ్ ట్రంప్-donald trump announces 2024 us presidential elections bid officially ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Donald Trump Announces 2024 Us Presidential Elections Bid Officially

Donald Trump: మళ్లీ పోటీ చేస్తా.. గెలిచి తీరుతా: డొనాల్డ్ ట్రంప్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 16, 2022 10:52 AM IST

Donald Trump - US Presidential Elections 2024: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. మళ్లీ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంటానని దీమాగా చెప్పారు.

Donald Trump: మళ్లీ పోటీ చేస్తా.. గెలిచి తీరుతా: డొనాల్డ్ ట్రంప్
Donald Trump: మళ్లీ పోటీ చేస్తా.. గెలిచి తీరుతా: డొనాల్డ్ ట్రంప్ (AP)

Donald Trump - US Presidential Elections 2024: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ (Republic Party) తరఫున మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించారు. మరోసారి వైట్‍హౌస్ పీఠాన్ని దక్కించుకునేందుకు రేసులో ఉంటానని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల పోటీ కోసం అమెరికా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‍కు పత్రాలు సమర్పించారు.

ట్రెండింగ్ వార్తలు

ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో (US Mid-term election) రిపబ్లికన్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. అయినా ట్రంప్ ఏ మాత్రం తగ్గడం లేదు. తమ పార్టీ మరింత బలపడిందని, అమెరికన్ల కలను సాకారం చేసి తీరతానని అన్నారు. అందుకే మళ్లీ పోటీలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

“అమెరికాను మరింత సమోన్నతంగా, కీర్తిమంతంగా తీర్చిదిద్దడంలో భాగంగా అధ్యక్ష ఎన్నికల్లో నా అభ్యర్థిత్వాన్ని నేడు ప్రకటిస్తున్నా” అని ట్రంప్ వెల్లడించారు. అమెరికన్ల కలలను కాపాడడంలో ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు.

అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఇటీవలే జరిగాయి. అయితే అధికార డెమోక్రాట్ పార్టీపై భారీస్థాయిలో వ్యతిరేక ఉంటుందని అంచనా వచ్చినా అలా జరగలేదు. రిపబ్లికన్ పార్టీ ఊహించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయింది.

అమెరికా సెనేట్‍లో డెమోక్రాట్లు 50 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. రిపబ్లికన్స్ 49 సీట్లలో ముందంజలో ఉన్నారని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ వెల్లడించింది. అమెరికా ప్రతినిధుల సభ (US House)లో రిపబ్లికన్లు 217 స్థానాల్లో లీడింగ్‍లో ఉన్నారు. డెమోక్రాట్లు 207 స్థానాల్లో ముందున్నారు.

Donald Trump: పార్టీ మరింత శక్తివంతంగా..

రిపబ్లికన్ పార్టీ ముందు కంటే మరింత బలంగా, శక్తిమంతంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. “రిపబ్లికన్ పార్టీ మరింత పెద్దగా, శక్తిమంతంగా, బలంగా తయారైంది. దేశంలో కోసం మరింత ఎక్కువ మంచి చేయగలదు” అని ట్రంప్ అన్నారు.

ఒకవేళ ట్రంప్ ప్రెసిడెంట్‍గా ఉండిఉంటే ఉక్రెయిన్‍లో రష్యా యుద్ధం చేసేది కాదని కొందరు డెమోక్రాట్లు కూడా అంటున్నారని ట్రంప్ చెప్పారు. బైడెన్‍కు మరో నాలుగు సంవత్సరాల అధికారం రాదని ఆయన అన్నారు.

ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో గతంలో కంటే అత్యధిక ఓట్లతో గెలుపొందుతానని డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు.

2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలయ్యారు. అధ్యక్ష పదవిని కోల్పోయారు. అనంతరం అమెరికాలో మునుపెన్నడూ లేని విధంగా అల్లర్లు జరిగాయి. కాగా, 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని ట్రంప్ కొన్ని నెలలుగా సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.

IPL_Entry_Point

టాపిక్