Pornography Side Effects : పోర్న్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే మీరు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..-side effects of pornography know if you watching porn frequently can damage your sexual health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pornography Side Effects : పోర్న్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే మీరు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

Pornography Side Effects : పోర్న్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే మీరు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 20, 2022 07:30 PM IST

Pornography Side Effects : తరచుగా పోర్న్ చూడటం వల్ల మీ లైంగిక ఆరోగ్యం, మీకున్న సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది అంటున్నారు నిపుణులు. ఇది రానూ రానూ మీ మానసికం ఆరోగ్యంతో పాటు.. శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. ఎందుకంటే..

పోర్న్ ఎక్కువగా చూస్తున్నారా?
పోర్న్ ఎక్కువగా చూస్తున్నారా?

Pornography Side Effects : పోర్న్ చూడటం అనేది చాలా మంది వ్యక్తుల జీవితాల్లో ఒక సాధారణ, ఆనందదాయకమైన భాగంగా చూస్తారు. కానీ దేనినైనా అతిగా చేస్తే.. అది మీకు హానీ చేస్తుంది. అలాగే తరచుగా పోర్న్ చూడటం మీ లైంగిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా అనే ప్రశ్నపై మీకు ఖచ్చితమైన సమాధానం దొరకనప్పటికీ.. ఈ విషయంలో పరిగణించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.

మీరు ఆందోళన చెందాల్సిన విషయంలో మొదటిది.. చాలాసేపు పోర్న్ చూడటం వల్ల సెక్స్ గురించి అవాస్తవ అంచనాలకు దారితీయవచ్చు. పోర్న్ తరచుగా సెక్స్‌ను అతిశయోక్తిగా లేదా అవాస్తవంగా చిత్రీకరిస్తుంది. ఎవరైనా ఈ రకమైన కంటెంట్‌కు రోజూ అలవాటుపడితే.. వారు సెక్స్ అలానే ఉండాలని నమ్మడం ప్రారంభిస్తారు. ఇది నిజ జీవితంలో లైంగిక ఎన్‌కౌంటర్స్‌లో నిరుత్సాహానికి లేదా నిరాశకు దారితీయవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడంలో, నిర్వహించడంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు.

మరొక సమస్య ఏమిటంటే.. తరచుగా అశ్లీల వినియోగం లైంగిక ఉద్దీపనలకు డీసెన్సిటైజేషన్‌కు దారితీయవచ్చు. దీనర్థం కాలక్రమేణా.. అదే స్థాయి ఉద్రేకాన్ని పొందడం, మరింత తీవ్రమైన అశ్లీలతను కొనసాగించడం అనమాట. ఇది ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం, సంబంధాలపై ప్రతికూల పరిణామాలను కలిగి ఉంటుంది. మరింత తీవ్రమైన లేదా డెప్త్ కంటెంట్‌ను వెతకడానికి దారితీయవచ్చు.

రిలేషన్ షిప్ డైనమిక్స్‌పై అశ్లీలత సంభావ్య ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవడం కూడా విలువైనదే. ఒక భాగస్వామి చాలా పోర్న్ చూస్తున్నట్లయితే.. అది ఇతర భాగస్వామిలో అసమర్థత లేదా పోటీ భావనలకు దారితీయవచ్చు. ఇది కమ్యూనికేషన్ సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాకుండా సంబంధాన్ని దెబ్బతీస్తుంది.

అశ్లీల వినియోగం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాలపై శాస్త్రీయ పరిశోధనలు ఇంకా జరగలేదని గమనించడం ముఖ్యం. కాబట్టి ఇది లైంగిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పడం కష్టం. అయితే వ్యక్తులు సంభావ్య ప్రమాదాల గురించి తెలుసుకోవడం, అశ్లీలతను బాధ్యతాయుతంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. మీ అశ్లీల వినియోగం మీ రోజువారీ జీవితంలో లేదా సంబంధాలలో జోక్యం చేసుకోవడం ప్రారంభించినట్లు మీకు అనిపిస్తే.. సహాయం పొందడానికి థెరపిస్ట్ లేదా ఇతర మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడటం విలువైనదే కావచ్చు.

తరచుగా అశ్లీల వినియోగం లైంగిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా అనే ప్రశ్నకు ఎవరికీ సరిపోయే సమాధానం లేనప్పటికీ.. సంభావ్య ప్రమాదాలను పరిగణనలోకి తీసుకోవడం, పోర్న్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ సొంత పోర్న్ వినియోగం గురించి మీరు ఆందోళన చెందుతూ ఉంటే.. మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడటం సహాయకరంగా ఉండవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం